ఉత్తమ గురువు కథ

*ఉత్తమ గురువు*

దండకారణ్యానికి ఈశాన్య భాగంలో ఓ గురుకులం ఉండేది,గురువు వివేకవర్దనుడి సమక్షంలో చాలామంది విద్యార్థులు చదువుకునే వారు,అందులో సకల సుగుణాలు సిద్ధించిన సిద్ధార్థుడు అనే ఓ శిష్యుడు ఉండేవారు తను చాలా తెలివైన వాడు, గురువు గారి తెలివి తేటలు వారసత్వం గా పొందాడేమో తన సత్ప్రవర్తన తో గురువు గారితో అవినాభావ సంబంధం ఏర్పడింది,మంచి విద్యావంతులు అంటే ఏ గురువుకైనా ఇష్టమే కదా అలా వివేకవర్ధనుడు సిద్ధార్థుని పై ప్రత్యేక శ్రద్ధ చూపడమనేది తోటి విద్యార్థులు నచ్చలేదు ఎలాగైనా సిద్ధుని గురువు గారి ముందు దోషిగా నిలబెట్టాలని ఎన్నో పన్నాగాలు చేశారు కాని *సత్ప్రవర్తన స్వధర్మమైతే శాపం కూడా వరమై వర్ధిల్లుతుంది* అంటారు కదా సిద్దు అన్నింటిని అవలీలగా ఎదుర్కున్నాడు,ఇలా పది సంవత్సరాలు గురుకుల విద్య అభ్యసించారు,

ఒకరోజు గురువు గారు ఒక అంశం ఇచ్చి దీనిని మీరు పూర్తి చేయడం వలన మీరు ఉత్తీర్ణులవుతారని ఆజ్ఞ జారి చేశారు నిజంగా అది విద్యార్థులు అందరికీ ఓ పెద్ద పరిక్ష లాంటిదే ఎలాగైనా సాధించాలని సిద్ధార్థుడు ప్రయత్నాలు మొదలు పెట్టారు,తోటి విద్యార్థులు మాత్రం రేయ్ మనం ఏమి చేసినా సిద్ధార్థుడిని దాటలేము,ఈ ప్రయత్నం చేయడం వృధా ఎలాగైనా దీంట్లో సిద్ధూ ఫెయిల్ అయేలాగా చేద్దామని కుతంత్రాలు చేశారు,ఇవేవి తెలియని సిద్ధార్థ్ గురువు గారు తనకు అప్పగించిన పని పూర్తి కాగానే కాస్తా విశ్రాంతి తీసుకుని ప్రయత్నం లో తాను అలా పడుకున్నాడు, పాపం చాలా అలసిపోయారేమో కునుకు పట్టేసింది,గాఢ నిద్రలో జారుకున్నారు,

ఇది గమనించిన తోటి విద్యార్థులు ఇదే మంచి సమయం అని భావించి సిద్ధు సేకరించిన సమాచారం మొత్తాన్నీ తస్కరించి మాయం చేయాలని ప్రయత్నం చేశారు ఇవన్నీ తెలిసిన వివేకవర్ధనుడు వీరిని ఓ కంట కనిపెడుతూ ఉండేవారు,అలా వీళ్ళు తస్కరించిన సమాచారం గురువు గారు తన చాకచక్యం తో సేకరించి తన దగ్గర భద్రంగా ఉంచారు,

గురువు గారు చెప్పిన సమయం రానే వచ్చింది,అందరు తాము సేకరించిన సమాచారం మొత్తాన్నీ అందజేయాలనే చెప్పగానే సిద్ధార్థ్ తప్ప మిగతా విద్యార్థులు ఏం ప్రయత్నం చేయలేదు కాబట్టి వారికి ఏ భయం లేదు, మేము చేయలేదని సులభంగా చెప్పేశారు,ఇక సిద్ధార్థ్ వంతు వచ్చింది,తడపడుతున్నా సిద్ధూ మొహం చూడగానే ఏమైంది అని గురువు ప్రశ్నించారు, స్వామి మీరు చెప్పిన సమాచారం సేకరించినా కాని ఎక్కడ పెట్టానో తెలియడం లేదని (తన మిత్రులు చేసినా పనే కావచ్చు అని మనసులో అనుకున్నా గురువు గారికి చెప్పడం వలన వారి కోపానికి గురి ఔతారని భావించి) చెప్పారు,కాని చాలా బాధ పడినాడు ఇన్నాళ్ళు గురువుగారి మనసుకు దగ్గరైన శిష్యుడు లా ఉన్న నేను ఈ పని చేయకపోవడం వలన గురువు మనసులో తనకున్న స్థానం ఎక్కడ పోతుందో అని చాలా ఏడ్చేశాడు, సిద్ధార్థ్ బాధ చూడలేని వివేకవర్ధనుడు తన దగ్గర భద్రంగా ఉంచిన సమాచారాన్ని తీసుకువచ్చి సిద్ధార్థ్ ని గురుకులం విద్యా పూర్తి చేసుకున్నందుకు స్నాతకోత్సవం తో సత్కరించారు, మిగతా విద్యార్థులను మందలించి వెళ్ళగొట్టారు,

కాని గురువు గారి పైన కోపాన్ని, సిద్ధార్థ్ పైన ద్వేషాన్ని పెంచుకున్న విద్యార్థులు ఎలాగైనా ఈ గురుశిష్యులు బంధాన్ని విడగొట్టాలని మనసులో బలంగా అనుకునే పక్క ప్రాంతంలో ఉన్న వేరే గురుకుల గురువుని ఆశ్రయించారు,ఆ గురుకులం గురువు నందివర్ధనుడు తన గురుకులంలో
సహాయాచార్యులు గా బోధించడానికి ప్రకటన చేశారు అది తెలుసుకున్న ఈ విద్యార్థులు నందివర్ధనుడిని సంప్రదించి మా మిత్రుడు తెలివైన వాడు ఉన్నాడు తనకి ఈ కొలువు దక్కడం వలన ఎంతో సహాయం చేసినవారు ఔతారని చెప్పారు,ఈ విషయం సిద్ధార్థ్ కి తెలియకుండానే దరఖాస్తు చేయడానికి వెళ్ళారు నందివర్ధనుడు పెట్టిన పరిక్ష లో విజయం సాధించారు, కొలువు లో చేరడానికి మరో వారం రోజులు సమయం ఉందని చాలా సంతోషంగా మిత్రులకీ ఈ విషయం తెలియజేస్తు గర్వపడ్డారు,

ఇవన్నీ తెలుసుకున్న విద్యార్థులు గురువైన వివేకవర్దనున్ని సిద్ధార్థ్ ని విడగొట్టడానికి ఇదే అనుకూలమైన సమయం అని భావించి నందివర్ధనుని దగ్గరకు వెళ్ళి నక్క వినయాలు నటిస్తూ,వివేకవర్ధనుడు చాలా తెలివైన వాడు అతని దగ్గర నేర్చుకున్న మేమంతా కూడా విద్యావంతులం అయ్యాము తను ఉన్నంత వరకు మీ గురుకులానికి మంచి పేరు రాదు కాబట్టి తన మీద మీరు గెలువలేరు అని ఏదో ఆశ కురిపించారు, ఎంతటి వారైనా పదవి పేరు ప్రఖ్యాతలు కోసం ఏదైనా చేయడం ఈ లోకంలో సహజమే కదా..వారం రోజులు గడవగానే ఎంతో ఆనందంగా సిద్ధార్థ్ కొలువు లో చేరడానికి వచ్చేశారు, ఎలాగైనా కొలువు దొరుకుతుంది అనే నమ్మకం తో వచ్చిన సిద్ధు ఏం అడిగినా ఇస్తారనే స్వార్థంతో ఈ కొలువు నీకు దక్కాలంటే మీ గురువు గారి శిరచ్ఛేధం చేయించాలని చెప్పారు,అది విన్న సిద్ధార్థ్ కాళ్ళ కింద భూమి కదిలినట్లైంది, ప్రశాంత కడలిలో సునామీ వచ్చినట్లు ఐంది,ఎంత బ్రతిమాలినా నందివర్ధనుడు వినలేదు, కొలువు దొరికింది అనే నమ్మకం తో వచ్చిన నేను ఏ మొహం పెట్టుకుని తిరిగి వెళ్ళాలి, అమ్మానాన్నలకు ఏ సమాధానం ఛెప్పాలి అని తనలో తాను బాధ పడుతూ ఒక చెట్టు నీడలో సేదతీరుతూ ఉన్నాడు,మృగతృష్ణ లో ముత్యపు జల్లు లా అటుగా వెళుతున్న రత్నాకర్ త్రికాల సంధ్యావందనం కోసం చెట్టు నీడన చేరాడు,తన సంధ్యా వార్పు కాగానే బేలగా ఉన్న సిద్ధార్థ్ ని గమనించి ఏం జరిగింది తమ్ముడు ఇష్టమైతే నే చెప్పండి ఏదైనా సహాయం చేస్తానని మాట ఇవ్వడం, రత్నాకర్ వేషధారణ చూసి ఏదైనా చేయగలరనే నమ్మకం తో, సిద్ధార్థ్ విషయం మొత్తం చెప్పేసి,ఇటు కొలువు అటు గురువుగారి ప్రాణం ఇలా ఇలా మానసిక సంఘర్షణను తట్టుకోలేక పోతున్నాను అని బాధ పడిన నా సిద్ధార్థ్ కి రత్నాకర్ సలహా ఇచ్చారు, కొలువు కాకుంటే మరో కొలువు దొరుకుతుంది కానీ గురు ద్రోహం చేయలేనని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సిద్ధార్థ్,

*పవిత్రమైన ప్రేమ,గౌరవం అభిమానాలకు పంచభూతాలు కూడా సహకరిస్తాయి* కదా ఏ పంచభూతాలు సిద్ధార్థ్ కి తోడుగా నిలిచాయో విషయం వివేకవర్ధనునికి చేరింది, గురువు ఎప్పుడూ శిష్యుల మంచి కోరేవారే కదా తన శిష్యుడు ప్రయోజకులు ఐతే అంతకన్నా మించింది ఏముంటుంది ఈ లోకంలో,తనకు కొలువు దక్కడం కోసం ఇవాళ కాకున్నా రేపైనా పోయే ప్రాణం పైన ఆశ ఎందుకు అని భావించారేమో తన సేవకులతో సిద్ధార్థ్ కి కబురు చేసి తన శిరస్సు ను అందించి చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం సంపాదించుకున్న ఆ గురువు వివేకవర్ధనుడు,నాటి కపటి ద్రోణాచార్యుని కంటే గొప్పవాడినని నిరూపించారు

*రేపటి ఉపాద్యాయ దినోత్సవ సందర్భంగా ఓ తమ్ముడు అడిగిన కథ*

*చిలకమారి తిరుపతి*
*స్వరమయూరి*
*9640908491*
*చెన్నూర్*

Get real time updates directly on you device, subscribe now.