కవి గారి కళత్రం* కదిలించే కథ

*కవి గారి కళత్రం* కదిలించే కథ
*26/06/2022*
*ఆదివారం*

మనిషి గా పుట్టిన తనను మనీషిగా చేసి,మనసిచ్ఛిన మధుమతితో మనువు జరిగేలా చేసినా ఓ మహానీయుని స్నేహం గురించి ఆలోచన చేస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు ముఖేష్,

“అది 1980 దశకం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు,డిగ్రి పూర్తి చేసుకొని పిజి లో చేరిన రెండవరోజు,

“మై డియర్ స్టూడెంట్స్ మీరంతా పాఠశాల చదువు పూర్తి చేసుకొని, కళాశాలలో కళలు వికసింపచేసుకొని (మీ కళను ప్రదర్శించి) విశ్వాన్ని శాసించే స్థాయికి చేరాలని ఈ విశ్వవిద్యాలయం లో చేరారు కాబట్టి మీ కళలు అభివృద్ధి చెందించుకొనే వేదిక గా ఈ కళాశాల ఉండబోతోంది, మీరందరూ మీ మీ ప్రతిభను నిరూపించుకోవడానికి రేపు జరగబోయే కార్యక్రమం లో మీ పేర్లు నమోదు చేసుకోని అందరు పాల్గొనాలి” అని ప్రొఫెసర్ రామచంద్రం మాస్టారు చెప్పడంతో అందరు తమకు ఉన్నా కళలు ప్రదర్శించే ప్రయత్నం లో మునిగిపోయారు, నాకు ఏ కళలో ప్రవేశం లేదు అందరితో పాటు పేరు ఇవ్వకపోతే చిన్నతనం గా అనిపించింది ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయాను,

“ఏరా దుర్గా…. రేపు జరగబోయే కార్యక్రమం లో నీవు ఏ విషయం పైన పేరు నమోదు చేసుకున్నావ్ రా….” నాకు అంతగా ఏం రాదు రా స్టేజి ఫియర్ ఎక్కువ కాబట్టి
ఏవైనా రెండు టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను రా, నువ్వేం చేయబోతున్నాను,” “ఏం అర్థం కావడం లేదు రా చూడాలి” “నేను ఓ సలహా ఇవ్వాలా…మన మయూరి ఉన్నాడు కాదరా వానిని కాకా పట్టు ఏదైనా రాసిస్తాడు” “అంతేనా వాడు ఎక్కువ పరిచయం లేడు ఏమంటారో తెలియదు,” “వాడు తప్పకుండా సహాయం చేస్తారు రా ప్రయత్నం చేయి” అని దుర్గా సలహా ఇవ్వడంతో మయూరి కోసం వెళ్ళాను,

“హాయ్ మయూరి ఏం చేస్తున్నారు” “ఏం లేదు చెప్పండి బ్రో,” రేపటి కార్యక్రమం కోసం ఏం రాశారు….?”నాకు ఏం వచ్చు అన్నా ఏదో చిన్న కవిత రాశాను,” “నాకు ఓ కవితా రాసివ్వ గలవా నాకు ఏం చేయాలో తెలియక పేరు నమోదు చేసుకోలేదు,” “దానిదేముంది రాసిస్తాలే నా కవిత పబ్లిక్ లోకి వెళుతుంది అంటే నాకు సంతోషమే కదా,ఇంతకి ఏ అంశం పైనా రాసివ్వాలి,” “అది మీరే ఆలోచించండి కాని కవిత్వం బాగా రావాలి” అనగానే మయూరి ఒకే చెప్పడంతో చాలా సంతోషం కలిగింది, నిజంగా మయూరి చాలా గొప్ప వాడు స్నేహానికి ప్రాణం ఇచ్చేంత వ్యక్తిత్వం కలవాడు, కాకపోతే నా అనుకున్న వాళ్ళు వంచనకు గురి చేసినా,కష్టాల కడలినినే నిత్యం ఈదుతున్నా ఏ రోజు తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేదు,ఎవరు ఏ సహాయం అడిగినా ఇచ్చేది అలా మొదలైంది మా పరిచయం, క్రమక్రమంగా స్నేహం గా మారింది ….

“థ్యాంక్స్ రా దుర్గా మయూరి నాకు కవితా రాసిస్తా అన్నారు కాని ఎలా చెప్పాలో తెలియడం లేదు,వేషాదారణ భాష,భావ వ్యక్తీకరణ సరిగా వచ్చేలా ప్రాక్టీస్ చేయాలి ఓ సారి నువు మా రూం కి రారా తోడుగా ఎవరినైనా తీసుకుని త్వరగా వచ్చేయ్, “ఒకే రా”… ప్రవీణ్ ముఖేష్ కాస్తా రిహార్సల్స్ చేసుకుంటాడట మనం వెళ్ళి ధైర్యం చెపుదాం వస్తావా రా…”సరే రా శ్రీకాంత్ గాడిని రమ్మందాం రా సరే పద రా” అని స్నేహితులు వచ్చేశారు ముందుగా మయూరి తో చదివించుకుని ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం మయూరిది కోకిల స్వరం వినగానే మా మిత్రులు చాలా ఆటపట్టించారు, పదహారు ప్రాయంలో జరిగే సరదాలకు మేమేమి అతితులం కాదు కదా కొన్ని సరదాలు ఇలా జరిగాయి,మయూరి మాత్రం ఇవేవి పట్టించుకోలేదు, మయూరి చెప్పినా కవితా బావుండే నాది గార్దభ స్వరం కదా కాస్తా. భయపడేలా ఉండే అలా ప్రాక్టీస్ చేశాం మరుసటి రోజు కు తయారుగా ఉన్నాం, మా సరదా కోసం ఇక్కడ జరిగిన సంఘటన మయూరి ని స్టేజి పైకి వెళ్ళకుండా న్యూనతభావానికి లోనయ్యేలాగా చేసింది,
అసలే అన్నింటిలో కొరవడిన జీవితం తనది ఈ స్వరం ఇలా ఉంటుందనే విషయం మొదటి సారి తెలుసుకోవడంతో ఎప్పుడూ స్టేజి పై కవితా చెప్పకుండానే రవిగాంచని చోటు కవిగాంచును అన్నట్లు ఏ అంశం పైనా ఐనా ఆశువుగా కవితలు రాసి ఎంతోమంది ప్రేమ కథలకు వారది వేశారు, కాని తను మాత్రం తెర వెనుక కవిలాగే ఉండి పోయారు,

“డియర్ స్టూడెంట్స్ మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్ డే ఈ రోజు జరుపుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ పింగళి వేంకటేశ్వర్ గారు రాబోతున్నారు,అలాగే మన ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు,వ్యాఖ్యాత డా తెన్నేటి సుధాదేవి గారు,వారితో పాటు తెలుగు విభాగపు పరిశోధన విద్యార్థులు ఎల్మల రంజిత్ గారు, గోపినాథ్ రాథోడ్ గారు ఇంకొంత మంది ఉంటారు మీరు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ వేదిక మీ భవిష్యత్తు దిశానిర్దేశం చేసే గొప్ప అవకాశం కావాలని ఆశిస్తున్నాను” అని ముగించి వెళ్ళిపోయారు,

ఈ వేదిక మాకంటే ఎక్కువ మయూరి కే ఉపయోగపడుతుంది కదా అని మనసులో ఆలోచించుకుని తనను ఆటపట్టించినందుకు బదులుగా వానికి ఓ అవకాశం ఇవ్వాలని భావించి మిత్రులు అందరం కలిసి మయూరి తో చర్చించాం,కాని ఏ రోజు ఎవరి దగ్గర చులకన భావం చవిచూడని వాడు కావడంతో ఈ బాధను మరిచిపోలేకా “నాకు ఇలాంటి వి నచ్చదు,కావాలంటే మీకు ఇంకో కొన్ని కవితలు రాసిస్తాను,నా స్వరం ఇలా ఉండడం నాకు శాపం మీ ముగ్గురి మధ్య నే ఇలాంటి అనుభవం ఎదురైంది అంత పెద్ద వేదిక పై మళ్ళీ పునరావృతం ఐతే చాలా సిగ్గుచేటు,నాకు కావాల్సింది పబ్లిసిటీ కాదు,ప్రతిభ ప్రదర్శించే అవకాశం దొరికితే చాలు అది మీరు చేస్తున్నారు కదా,భాష మీదే ఐనా భావాలు నావి కాబట్టి నాకు గుర్తింపు వచ్చినట్లేనని చాలా సింపుల్ గా చెప్పి తప్పించుకున్నారు” అది వాని గొప్పతనము ,కాని మాకు ఎందుకో తనకోసం ఏదైనా చేయాలనే తాపత్రయం ఉండడం తో తనకు తెలియకుండానే సర్ప్రైజ్ చేద్దామనే ఓ ప్రణాళిక తయారు చేసుకున్నాం, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజి వెళ్ళి అక్కడ తెలుగు డిపార్ట్మెంట్ లో ఉన్నవారి వివరాలు కనుక్కొని మా జిల్లాకు చెందిన సమదర్శిని గారితో చర్చించి తన ప్రతిభను గుర్తించే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడడంతో,తను చేసేది మా జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పైన పరిశోధన కావడంతో మేము చేయాల్సిన పని సులభంగా పూర్తి చేయబడింది,

ఇంతకాలం ఎదురు చూసిన కార్యక్రమం మొదలు కాబోతోంది వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారం, ప్రియమైన విద్యార్థులకు శుభాశిస్సులు,ఈ విద్యా సంవత్సరం ఈ విశ్వవిద్యాలయం లో కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగత సభ ఏర్పాటు చేసి అందరికి పూర్వ విద్యార్ధులతో స్వాగతం చెప్పుకుంటూ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుందాం,మీలో ఎవరెవరు ఏ ఏ అంశాలపై మీ ప్రతిభకు ప్రదర్శించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి అంటూ వ్యాఖ్యానించారు డా తెన్నేటి సుధాదేవి గారు,

ఆ కార్యక్రమం మొదలు కాగానే నాలో ఏదో తెలియని గుబులు మొదలైంది,ఏ రోజు స్టేజి ఎక్కి మాట్లాడింది లేదు ఈ రోజు ఇంత పెద్ద విశ్వవిద్యాలయం లో ఎలా అని భయపడుతు ఉంటే నేనున్నానని వెన్నుతట్టి ప్రోత్సాహించారు మయూరి, మళ్ళీ ఒకసారి రిహార్సల్ చేసుకొని సిద్ధంగా ఉన్నాను,
చెప్పబోయేది ఒక మంచి కవిత కాబట్టి దానికి తగిన వేషాదారణ వేసుకున్న, ముందుగా మా స్నేహితురాలు పుష్ప తన కోయిల కంఠస్వరం తో స్వాగత గీతాన్ని ఆలపించి అందరి ప్రశంసలు పొందింది, తర్వాత దుర్గా తన డ్యాన్స్ తో ఇరగదీశాడు, శ్రీకాంత్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా కొత్త రూపం దాల్చాడు, ఇప్పుడిప్పుడే భారతనాట్యం నేర్చుకుంటున్న సుజాత సహజమైన నర్తకిలా అందరి మన్ననలు అందుకుంది,చివరిగా నాకు అవకాశం రావడంతో భయం భయంగా స్టేజి వైపు వెళుతు మయూరి వైపు చూస్తున్న తన ప్రేరణాత్మకమైన మాటలతో ఉత్సాహం వచ్చింది,

గురువులకు వందనాలు,నా పేరు ముఖేష్ గౌడ్,నేను చెప్పబోయేది ఓ చిన్న కవిత,

“ఓ మూర్తీభవించిన స్నేహ తథ్వమా,నా మనసు నిన్ను ఆరాది‌స్తోంది సుమా యదను మీటిన ప్రణయ మధురిమా నీ స్నేహం దాసుని గా స్వీకరించుమా….”

ఈ కవిత చెపుతుండగానే ఏదో తెలియని గుండె దడ ఎక్కువ కావడంతో మాటి మాటికీ నా చూపులు మయూరి పై పడడం ముఖ్య అతిథిగా వచ్చిన వారిలో ఒకరైన సమదర్శిని గమనించారు,తనకు ఉన్న అవగాహన తోనె మయూరి లో ఏదో గొప్ప ప్రతిభ ఉందని కనిపెట్టేశాడు, ఎలాగోలా కవితా చెప్పేసి వచ్ఛేస్తుండగా కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ పింగళి వెంకయ్య గారు దగ్గరకు తీసుకొని నీ కవితా చాలా బావుంది ముఖ్యంగా ఒక స్నేహాన్ని పొందడం కోసం తపించే యువకునిలా నీ భావ వ్యక్తీకరణ బావుంది,ఈ రోజు ఈ కార్యక్రమానికి నీ కవితే హైలెట్ గా నిలిచింది అని అనడంతో చాలా గర్వంగా ఉన్నా,ఇది నా ప్రతిభ కాదని కాస్త ఇబ్బంది కలిగింది కాని మయూరి కూడా నన్ను కీర్తించారు,ఆ రోజు అంతపెద్ద డీన్ గారి చేతులమీదుగా సన్మానం జరగడం ఇప్పటికీ మరిచిపోలేను,మిత్రుల ప్రశంసలు,ప్రోత్సాహం పరిశోధక విద్యార్థుల సహాకారంతో ఒక కవిగా పరిణతి చెందాలి అనుకున్నాను,ఆ క్షణం శాశ్వతంగా ఉంటే బావుంటుంది అనిపించింది, కోలాహలంగా కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చేస్తుండగా డా సమదర్శిని గారు మయూరి ని చూసి ఈ కవిత నీ కలం నుంచి జాలువారిన భావాలు కనిపిస్తున్నాయి,అని అడిగి వివరాలు తీసుకొని నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నన్ను ఫాలోయింగ్ చేస్తూ ఉండు,నేను మీ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర పైన పరిశోధన చేస్తున్న నీ కవితలు నాకు చేరవేస్తే నేను సమర్పించే థీసీస్ లో నీ పేరు రాస్తాను,అని విజిటింగ్ కార్డ్ ఇచ్చారు,అలా నా ప్రతిభ కు వేదిక ఇచ్చిన ఈ కార్యక్రమం జరగడానికి ముందు నేనో సాధారణ మనిషిని,ఇప్పుడు ఓ సెలబ్రిటీ లా మార్పు వచ్చింది, హ్యాట్సాఫ్ మిత్రమా అని చెపుకుంటు వచ్చేశాను,

“హే మిస్టర్ నిన్నటి మీ కవిత చాలా బాగుంది,నాకు నచ్చేసింది,ఇంతకి నా పేరు చెప్పలేదు కదా…నీలు,
నీలిమా..మీ బ్యాచ్ మేట్ అని పరిచయం చేసుకుంది,ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. అని అనడంతో నాకు కాస్తా ఇబ్బంది కలిగింది ఏ మ్యాన్ ఏ కాలం మగాడివోయ్ నేను స్నేహం మాత్రమే అడిగాను ప్రేమించమనలేదు అండర్స్టాండ్ అంటు వసపిట్టలా వాగింది,ఇంతలో బెల్ కావడంతో క్లాస్ లోకి వెళ్ళిపోయాం”

హే ముఖేష్ నీలో ఇంత ట్యాలెంట్ ఉందా చూస్తే కనిపించడం లేదు మున్ముందు కాలంలో చాలా గొప్ప వాడివి ఔతావు అంటూ నేను ఒక సన్నివేశం ఇస్తాను దానికి ఒక చమత్కార వాక్యం చెప్పుగలరా మీ ప్రతిభకు ఇదో పరిక్ష, భయపడకు ప్రయత్నం చేయి, ఆడది మగవారు ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం నాలుగు వరసలు కవితలో చెప్పగలవా, సమయం తీసుకో సాయంత్రం వరకు చెప్పండి అని తెలుగు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు చెప్పి వెళ్ళిపోయాడు,ఇప్పుడేం చేయాలి నాకేమో కవితా రాయడం రాదు ఎలా అంటు ఆలోచిస్తుంటే,అరేయ్ మంచి అవకాశం రా నీవు ఇంతలా పబ్లిసిటీ వస్తుంది తన అడగడం నువు చెప్పకపోవడం ఏంటి ట్రై చేయమని అంటుంటే నేను బిత్తర పోయి చూస్తుండగా మయూరి వచ్చి కవిత రాసిచ్చాడు,మిత్రమా నా కవితకు నీ ద్వారా వేదిక దొరుకుతుంది చాలా సంతోషం ఈ కవిత సార్ కి చెప్పి చెప్పి నిన్ను నీవు నిరూపించుకో అని సలహా ఇచ్చారు, మనసుకు నచ్చకపోయినా తీసుకో చదువుకున్న,ఇంతలో ప్రిన్సిపల్ గారు వచ్చి ముఖేష్ నువు కాస్తా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేస్తే మంచి సినీ గేయ రచయిత గా గుర్తింపు తెచ్చుకుంటావు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రయత్నం చేయమని సలహా ఇస్తున్నారు,నాలో లేని ప్రతిభకు నేను గుర్తింపు పొందడం చూస్తుంటే నాకు కాస్తా సిగ్గుగా ఉంది,ఇవేవి తెలియని మయూరి కూడా నన్ను ప్రోత్సహించడం నేనున్నానని సలహా ఇవ్వడంతో ఆలోచనలో పడ్డాను, తెలుగు ప్రొఫెసర్ పిలవడంతో కవితా తీసుకుని వెళ్ళాను,

ఆడది ఐదు రూపాయలకు
అమ్ముడుపోతే వెలయాలు,
మగవాడు లక్ష రూపాయలకు
అమ్ముడుపోతే పెళ్ళికొడుకు,

అని అర్థాలు తెలియకుండా కవిత చెప్పి రాగానే ప్రొఫెసర్ అర్థం ఐందేమో ఇంకాస్త ప్రశంసలతో ముంచెత్తారు, దీనితో ఒకేసారి రెండు సినిమాలు హిట్లు సాధించిన హీరోకి వచ్చిన క్రేజ్ వచ్చేసింది, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది,
హీరో అంటే హీరోయిన్ ఉండడం సహజమే కదా ఆనుభవం కూడా ఎదురైంది,

“ఏంట్రా నీ లక్కూ ఒకే ఒక్క రోజులో మా అందరిని మించిన సెలబ్రిటీ ఐపోయావేంట్రా…” “నిజమే రా ప్రవీణ్ ఈ క్రెడిట్ అంతా మయూరి కే దక్కుతుంది రా…” “మరి పార్టీ ఏం లేదారా…?” “ఎందుకు ఉండదు రా ఖచ్చితంగా ఉంటుంది కాని ముందుగా మయూరి కి ఏమైనా ఇవ్వాలిరా” “ఔను కరెక్ట్ రా వాడు చాలా సెన్సిటివ్ పర్సన్ కాని వానిలో ఇంత ట్యాలెంట్ ఉందేంట్రా,మనం జాయిన్ ఐన మొదటి వాని కట్టు బొట్టు వేషాదారణ చూసి ఏదో అనుకున్నాం కాని వాడు వాడు వాడు వేషానికి తగినట్లు పండితుడేరా… ఒకసారి కలుద్దాం పోదాం అని” ప్రవీణ్ అనడం తో మయూరి వాళ్ళ రూం కి వెళ్ళాం,”అక్కడ ఓ ఇద్దరు మిత్రుల సహకారంతో వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకున్నాడు, వివరాలు తెలుసుకుంటే తను ఒకప్పుడు బాగానే ఉండేనటా ఈ మధ్య నాన్నగారు చనిపోవడంతో, ఐనవారు మోసం చేయడంతో ఆర్థిక స్థితి బాగాలేక రెండు సంవత్సరాల చదువు ఆపేసి ప్రైవేటు స్కూల్ లో జాబ్ చేసుకొని ఎమౌంట్ దొరకగానే ఈ సంవత్సరం మళ్ళీ జాయిన్ అయ్యాడు,ఆ ఎమౌంట్ కోర్సు కే సరిపోయేలా ఉండడం తో వీళ్ళ పనులు చేసుకుంటూ వీళ్ళ దగ్గర ఫ్రీ షెల్టర్ తీసుకున్నట్లు తెలుస్తోంది,మా కంటే రెండేళ్ళు పెద్దవాడు,” మమ్మల్ని చూడగానే ఎంతో సంతోషం గా పలకరించి కుషల ప్రశ్నలు అడిగాడు,తన ఆర్థిక స్థితి తెలుసుకొని ఏమైనా ఇద్దామని ప్రయత్నం చేస్తే ఆత్మాభిమానం కలవాడు కాబట్టి ఏం తీసుకోలేదు, పంటికింద బాధను బిగపట్టి మాతో సరదాగా మాట్లాడుతూ ఇంకా ఏమైనా కవితలు కావాలంటే అడగండి ఇచ్ఛేస్తా అని వినమ్రంగా చెప్పడంతో మాకు ఆశ్చర్యం వేసి నువు దేంట్లో పాల్గనవు ఎందుకు అని అడగడంతో అనాధ లాంటి నాకు ఏ వేదిక ఐనా ఎక్కే అర్హత లేదు,నా ప్రతిభ మీ ద్వారా బయటకు వస్త చాలు అని సలహా ఇచ్చాడు,ఎంత గొప్పవారో అని మనసులో అనుకుని ఏదైనా సహాయం చేయాలనే అక్కడ నుంచి వచ్చేశాం,

“ఏమే స్వప్నా ఇవాళ పుష్ప రాదా కాలేజీ కి” “ఇది మరీ బావుంది ఏమో నాకేం తెలుసు,ఏ విజ్జు నువు చెప్పే” కథల్ పడకు అందరు నాకు చెప్పి వస్తున్నారా… ఐనా ఇవాళేంటి పుష్ప జపం చేస్తున్నావు,ఏం పని వచ్చింది దానితో ఏ రోజైనా పట్టించుకున్నావానే ఈ రోజేమో పుష్ప గురించి ఇంతలా అడుగుతున్నావ్ నాకు తెలియదుపో,” “ఏంటే ఇంతకోపం,” మరి రాదా ఇక్కడ మేమంతా ఉండగా పుష్ప తో ఏం పని,”ఏంటీ నీలిమా నా గురించి చర్చిస్తున్ధారు,” “రా పుష్ప ఎందుకు ఇంతలేట్ ఐంది ఇవాళా…?” “నీకేంటే సింగరేణి కుటుంబం ఆస్తి పరులు లేచి కాలేజీ కి రావడమే మాకు ఎన్నో పనులు ఉంటాయి,” “సరేగాని అలా లైబ్రరీ కి వెళుతూ మాట్లాడదాం పదా” ఒకే పోదాం…

“ముఖేష్ కి అంత గుర్తింపు ఇచ్చిన మయూరి కనపడడేంటి దుర్గా…” “వాడా… ఎవరికోసం ఏ కవితలు రాస్తున్నాడో ఎంత పెద్ద వ్రైటర్ కావాలని ఆలోచిస్తుప్నారో ఎవరికి తెలుసు,పోనిలే మనలో ఒక కవి రచయిత ఉంటే మనకు పేరు వస్తుంది కదా,,” “మనకు వచ్చినా రాకున్నా వానికి ఒక గుర్తింపు వస్తుంది వాడు అకుంఠిత దీక్ష దక్షుడు, దైవభక్తుడు,” అని దుర్గా స్వప్న తో అంటుండగానే “మీది తెలుగు డిపార్ట్మెంట్ నా అంటూ సమదర్శిని గారు వచ్చారు” ఔను సార్,”ఇక్కడ ఆ రోజు ఫ్రెషర్ డే రోజు ఓ కవితా రాసిచ్చాడు తాను పేరు గుర్తు రావడం లేదు…” ఓహో మీరనెది మయూరి గురించేనా….
కాదు కాదు తను ఫిమేల్ కాదు మేల్, “ఔను మేమనేది తననే కాని తన ఫూర్తి పేరు రుద్రాక్ష భార్గవా చార్యులు,తన కలం పేరు స్వరమయూరి,మేమంతా సరదాగా మయూరి అని పిలుస్తుంటాం అలా కలం పేరుతో స్థిరపడిపోయారు” “ఓహో చాలా గ్రేట్ ఇంతకి తను రాలేదా…లేదు సర్ తను రెగ్యులర్ గా రారు తనకున్న సమస్యలు దృష్ట్యా ఓ కాలేజిలో జాబ్ చేస్తూ ఎగ్జామ్ మాత్రమే రాస్తుంటారు,,మరి తనను కలవాలంటే..ఎలా…ఇదిగో మా దుర్గా వస్తాడు తీసుకెళ్ళు,మరోలా అనుకోకండి వీని పూర్తి పేరు దుర్గా శంకర్,అంత పొడుగ్గా పిలువలేకా షాట్ కట్ ఇది,మరి నీకేంటి షాట్ కట్, నేను చెపుతా సార్ దానికి రంగు షాట్ కట్, రేయ్ దుర్గా చంపేస్తా… ఇప్పుడు కాదమ్మా మయూరి ని కలిశాక చంపేవు,ఒకే…sry sr,

“నీలు క్లాస్ కి టైం ఔతుంది నేను వెళతా” అని పుష్ప అనడంతో అనుమతి ఇచ్చింది నీలిమ, ఇంతలో ముఖేష్ రావడం చూసి హే ప్రిన్స్ ఇలా రండి,”హ్మ్ నేను ప్రిన్స్ ఏంటి” అలా కనిపించావు లే నాకు,నిజం చెప్పాలంటే ఆ రోజు మీరు. చెప్పినా కవితా నాకు చాలా బాగా నచ్చింది,”ఐతే…” చెపుతున్న అంతే….మీరు చాలా బాగా రాస్తారు అనడంతో “ఒక అమ్మాయి ఇలా అనడం వలన నిజంగా నేను రాయకపోయినా అనుకోకుండా నే నేనని చెప్పేశాను,,” ఇవాళ నాకోసం. ఒక కవిత రాసివ్వరా” ఇదేంట్రా బాబు ఇలా అంటుందని తడపడుతూనే ఏం చేయాలి నాకేమో రాయడం రాదు అని క్లాస్ కి టైం ఔతుంది రేపు రాసిస్తా నాని తప్పుకున్నాను, అది గమనించిన మా తొట్టి గ్యాంగ్ ఏంట్రోయ్ కోతలు కోస్తున్నావు నిజంగా కవితా రాసిస్తావారా…”అలా కాదురా మయూరి దగ్గరకు వెళ్దాం పదా లేకుంటే అమ్మాయి ముందు పరువు పోతుంది అని మయూరి వేటలో బయలుదేరి తనకోసం ఎదురు చూస్తున్న రాత్రి తొమ్మిది గంటల వరకు వచ్చాడు మయూరి, హాయ్ ఒక అమ్మాయి కవితా అడిగింది రాసి స్తారా..” “క్షమించండి మిత్రమా…నా సాహిత్యం హితాన్ని బోధించాలి కాని అపకీర్తి తీసుకురాకూడదు,ఎవరో తెలియని అమ్మాయి అందాలను వర్ణించి కవిత రాయలేను అది సంస్కారం కాదు” అని అసలు ఒప్పుకోలేదు ఎంతో ప్రయాసపడి ఎట్టకేలకు కవితా తీసుకుని వచ్చి అమ్మాయి కి ఇచ్చేశాను,ఆ కవిత చూసి తను చాలా సంతోషం తో నను కౌగిలించుకుని నీ ప్రేమ నాకు కావాలి,మీ వర్ణన చాలా బావుంది, నువ్వే కావాలి అని వెంటపడుతూ,ప్రేమంటే ఏంటో తెలియని నన్ను తన ప్రేమలో ముంచేసి తననే పెళ్ళి చేసుకునేలా చేసింది, కట్ చేస్తే పాతికేళ్లు గడిచిపోయాయి,ఈ మధ్య కాలంలో ఎన్నో సందర్భాల్లో తను చెప్పిన వాటికి అనుగుణంగా మయూరి సహాయం తో కవితలు రాస్తూ ఉండగా ఒకరోజు సరదాగా నీలు మన ప్రేమ నా పైన కలిగిందా నా కవితలు పైన నా అని అడగడంతో మొదటి సారి మీ కవితలపై, వివాహం తర్వాత మీ పైన కలిగింది ఎందుకు ముఖేష్ ఇన్నాళ్ళు తర్వాత ఈ సందేహం కలిగింది మీకు,ఏం లేదు ఒకవేళ ఆ కవిత రాసింది నేను కాదని తెలిస్తే…? చంపేస్తా.. ముందు నీకు విడాకులు ఇచ్చి నిన్ను చంపి నేను చనిపోతా ఏ నాటకాలుగా ఉందా నీకు…
“అమ్మో ఈ రహస్యం రహస్యం గానే ఉంచాలని అనుకున్నాను, కొంతకాలం గడిచింది, *దాచిపెట్టిన నిజం పాతిపెట్టిన బీజం. దాగవు కదా* నా బండారం బట్టబయలు అయ్యే రోజు రానే వచ్చింది, మా శ్రీమతి ఎక్కడో ఒక కొడుకు అమ్మ నాన్నలు ను అనాదాశ్రమంలో చేర్చే సన్నివేశం చూసి, బిడ్డ పుట్టిన తర్వాత నుంచి పెంచి పెద్దగా చేసి ప్రయోజకులును చేస్తే ఈ రోజు తల్లిదండ్రులను అనాదాశ్రమంలో చేరుస్తున్నా మూర్ఖుని గురించి తండ్రి పడే వేదనా నాకు కవితా రూపం కావాలని పేచి పెట్టింది, ఇపుడు ఏం చేయాలి అని మయూరి కోసం వెతికాను తను ఎక్కడ కనపడలేదు ఏం జరిగిందో తెలియదు,కవితా ఎలా రాయాలి ఒకవేళ రాయకపోతే. నా శ్రీమతిని మోసం చేశాననే భావనతో తను ఏమైపోతుందోనని, కలం పట్టి రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు ఉండి సోఫాలో పడిపోయాను, అది గమనించిన మా శ్రీమతి,”డాక్టర్ గారు మా ఆయన స్పృహ తప్పి పడిపోయాడు ఎలాగైనా తనను కాపాడమని ప్రాధేయపడింది” నాకు చెకప్ చేస్తున్న డాక్టర్ మా మిత్రుడు ప్రవీణ్ కావడంతో విషయం మొత్తం చెప్పేశాను, చూడమ్మా నీలిమా మీ ఆయన పెద్ద వయసు ఔతుంది కాబట్టి ఎక్కువగా గా బ్రెయిన్ పై స్ట్రెయిన్ ఐతే తను తట్టుకోలేదు కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకు రావద్దు” అని చెప్పారు “సరే డాక్టర్ గారు ఏమండి వెళదామా…” నీ కవితా రాయాలి కదా…ఇక నీ నుంచి ఏం కవితా వద్దు, ముప్పై సంవత్సరాల నాకోసం రాశాను సరిపోయింది అని సెలవిచ్చారు మా శ్రీమతి గారు,

కాని అసలు ఇంత మంచి పేరు ప్రఖ్యాతలు నాకు అందించిన మయూరి ఎక్కుడా కనపడడం లేదేంటి అని మా మిత్రులు అందరికి ఉత్తరాలు రాశాను పిజి పూర్తి ఐన తరువాత ఎవరికి కనిపించలేదు,అసలు ఉన్నారో లేదోనని,అప్పటికే తనకున్న సమస్యలు ఎక్కువగా ఉండే ఏమైనా అఘాయిత్యాలు జరిగాయేమోనని మిత్రులు చెప్పడంతో చాలా బాధపడుతున్న రెండేళ్ళ సమయం గడిచింది, ఒకరోజు నా బ్యాంకు డ్యూటీ మీద మేడ్చల్ కి వెళ్ళాల్సి వచ్చింది, మార్గమధ్యలో “ఏమండి ఇవాళ గురువారం కదా ఇక్కడ సాయి గీతాశ్రమం ఉంది పార్క్ లో కూర్చుని వెళదాం అని చెప్పింది” సరేలే పదా అని వెళ్ళాం ఏమండి ఈ పచ్చని ప్రకృతి ఈ వాతావరణం చూస్తుంటే ఓ కవితా కావాలి అని ఉంది, ఇవ్వమంటావా… వద్దులే….అని అనగానే దేవుడు కరీణించాడేమో పూజారి రూపంలో ఉన్న మా మయూరి కనిపించి మంచి కవిత రాసి నేను రాశాననే భావన కలిగేలా తనకు అందించారు,

“ఏమైంది మయూరి ఇన్ని రోజులు ఏమైపోయావు నీ గురించి వెతకని చోటంటూ లేదు,” ముఖేష్ పిజి తర్వాత సమదర్శిని గారి సమక్షంలో పది కావ్యాలు, రెండు కథా సంకలనాలు,ఓ శతకం,వచన కవితా సంపుటి పూర్తి చేసి అందరికి అందించి,మా ఊరు వెళ్ళాను అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నా జీవితంలో విషాదాన్ని నింపాయి,ఆ సమయంలో ఉద్యోగం ఉపాధి కరువై తప్పనిసరి పరిస్థితుల్లోహైదరాబాద్ చేరుకున్నాను, చాలా అవస్థలు పడ్డాను,ఇంకా ఎన్నాళ్ళు కష్ట పెట్టాలని దేవునికి అనిపించిందో ఏమో కరుణించాడు,మీకంటే గొప్పగా నా కవితలు అభిమానించే ఓ తమ్ముడు దొరికాడు తన పేరు రాజా… నేనంటే పిచ్చి అభిమానం ఇప్పుడు తనే నాకు స్వంత వాడిలా మారి నా బాగోగులు చూసుకుంటున్నారు,వాళ్ళ కుటుంబమే నా కుటుంబమైంది, నేను నమ్ముకున్న నా కళామతల్లి నన్ను చెడనీయలేదు అని చెప్పి తనను తను గొప్పదనాన్ని మరో ఆశు కవితా రూపంలో వినిపించాడు,అది కూడా నేనే రాశానని చెప్పిన గడసరి మా మయూరి,

*చిలకమారి తిరుపతి*
*స్వరమయూరి*
*9640908491*
*చెన్నూర్*

Get real time updates directly on you device, subscribe now.