బాల సాహిత్య పురస్కారం పొందిన వలిపే రాం చేతన్

మాచిరాజు బాల సాహిత్య పీఠం నిర్వహించిన బడి పిల్లల కథల పోటీలు 2023 లో భాగంగా ఆదివారం రోజున రవీంద్ర భారతి మినీ హాల్ హైదరాబాదులో ప్రజ్ఞాన్ ది స్కూల్ ,ఉప్పల్ విద్యార్థి చిరంజీవి వలిపే రామ్ చేతన్ రాసిన ఆలోచన కథకు ప్రముఖ బాలసాహిత్య రచయితలు చొక్కాపు వెంకటరమణ , విఆర్ శర్మ, మాచిరాజు కామేశ్వరరావు, దాసరి వెంకటరమణ చేతుల మీదుగా మాచిరాజు బాలసాహిత్య పీఠం వారి బాలసాహిత్య పురస్కారం అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ్ సూర్య, కరస్పాండెంట్ శకుంతల గార్లు అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నళిని గారు, మాట్లాడుతూ తొమ్మిదవ తరగతి విద్యార్థి రామ్ చేతన్ రాష్ట్రస్థాయిలో బాలసాహిత్య పురస్కారం అందుకోవడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేస్తూ, చిరంజీవి రామ్ చేతన్ తో పాటుగా తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.