మేకింగ్‌ ఎవ్రీ పర్సన్‌ మేటర్‌

యూజీసీ వెబ్నార్

సమ్మిళిత పాలనపై విద్యా మంత్రిత్వ శాఖ మరియు యుజిసిలు “మేకింగ్‌ ఎవ్రీ పర్సన్‌ మేటర్‌” అనే ఆంశంపై వెబినార్‌ ఏర్పాటు చేశాయి

జాతీయ విద్యా విధానం 2020 సమానత్వం మరియు సుస్థిరతను నిర్ధారించడమే లక్ష్యంగా ఉంది మరియు ఇది సుపరిపాలనకు నిజమైన మానిఫెస్ట్ – శ్రీ అర్జున్ ముండా

అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంలో భాగంగా విద్య మంత్రిత్వ శాఖ మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసి)  ఈ రోజు ఒక వెబ్‌నార్‌ను నిర్వహించాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా ముఖ్య అతిథిగా వెబ్‌నార్‌లో ప్రసంగించారు. ఉన్నత విద్య శాఖ సెక్రటరీ శ్రీ అమిత్ ఖారే, యూజీసీ చైర్మన్ శ్రీ డి.పి. సింగ్; ఉన్నత విద్య జాయింట్ సెక్రటరీ శ్రీమతి నీతా ప్రసాద్ మరియు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ ” ఏక్‌లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పథకం సమ్మిళిత విద్య పట్ల ప్రధాని దూరదృష్టి విధానాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతాలలో అట్టడుగున ఉన్న జనాభాకు ఈఎంఆర్‌ఎస్‌ విద్యను అందిస్తుంది. సమానత్వం మరియు సమ్మిళతను నిర్ధారించడానికి ఉద్దేశించిన జాతీయ విద్యా విధానం 2020 గిరిజనుల విద్యకు జాతీయ దృక్పథాన్ని అందించిందని, ఇది సుపరిపాలనకు నిజమైన మానిఫెస్ట్ అని శ్రీ ముండా హైలైట్ చేసారు. డిజిటల్ ఇండియా, సమగ్రశిక్ష వంటి కార్యక్రమాలు గిరిజన, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీపడేందుకు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు.

సబ్‌కాసాథ్‌, సబ్‌కావికాస్‌, సబ్‌కావిశ్వాస్‌ మరియు సబ్‌కాప్రయాస్ స్ఫూర్తితో స్వీయ పరిపాలన యొక్క ప్రాముఖ్యతను శ్రీ అర్జున్ ముండా నొక్కిచెప్పారు. మరియు నిజమైన ప్రజాస్వామ్యానికి ఆధారం అయిన ఈ ఆశయాల సాధనలో ప్రజల భాగస్వామ్యంపై దృష్టి సారించి ప్రధానమంత్రి మాకు ఈ మంత్రాన్ని అందించారని చెప్పారు.

మనం ఆజాది కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి మన దీర్ఘకాల రాజ్యాంగ నిబద్ధతతో అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరిని శక్తివంతం చేయడం మా సంకల్పం అని మంత్రి పునరుద్ఘాటించారు.

మంచి పాలన, స్వీయ-పరిపాలన మరియు సమగ్ర పరిపాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని శ్రీ ముండా చెప్పారు.  కొత్త తరం ముఖ్యంగా అణగారిన ఆకాంక్షలకు రెక్కలు ఇవ్వాల్సిన బాధ్యత విద్యాసంస్థలకు ఉందని శ్రీ ముండా గుర్తు చేశారు.

శ్రీ అమిత్ ఖారే గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల విద్యార్థులతో సహా సమాజంలోని అణగారిన వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలెట్ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న భాషా సమస్యలపై శ్రీ ఖరే నొక్కిచెప్పారు. హిందీ మరియు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. తద్వారా ఏ విద్యార్ధి కూడా వెనుకబడకూడదని ఆకాంక్షించారు.

యుజిసి ఛైర్మన్ ప్రొఫెసర్ డి.పి. సింగ్  తన ప్రారంభ ప్రసంగంలో మన ప్రజాస్వామ్యంలో కీలకమైన హోదా మరియు అవకాశాల సమానత్వం యొక్క రాజ్యాంగపరమైన ఆదర్శాలను పునరుద్ఘాటించారు. సమ్మిళితత్వంపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత విద్యాసంస్థల నాయకులందరూ మంచి పరిపాలన దిశగా సమన్వయంతో కృషి చేయాలని మరియు వారి సభ్యులందరికీ సమానంగా అవకాశం కల్పించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్జురింగ్‌ ఇన్‌క్లూజివ్‌ గవర్నన్స్‌ : మేకింగ్‌ ఎవ్‌రీ పర్సన్‌ మేటర్స్‌ వెబ్‌నార్‌లో మేధావులు, విద్యావేత్తలు మరియు నిర్వాహకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఒక అవకాశాన్ని అందించింది. మరియు లక్నోలోని బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ విశ్వవిద్యాలయం మద్దతు ఇచ్చింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సంజయ్ సింగ్ స్వాగతోపన్యాసం చేశారు. లక్నో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలోక్ రాయ్ తన ముఖ్య ప్రసంగంలో విద్యార్థులను మన విద్యా వ్యవస్థకు ప్రాథమికంగా పునరుద్ఘాటించారు. సమాజంలోని అన్ని వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన నొక్కిచెప్పారు మరియు మహిళా విద్యార్థులు, దివ్యాంగ్ విద్యార్థులు, గిరిజన విద్యార్థులు మొదలైనవారి  సమస్యలను వివరించారు.

టెక్నికల్ సెషన్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ సుష్మా యాదవ్, మాజీ వైస్-ఛాన్సలర్, భగత్ ఫూల్ సింగ్ మహిళా విశ్వ విద్యాలయం, సోనేపట్ మరియు మెంబర్-యుజిసి. ప్రొఫెసర్ ఎం.ఎం. సాలుంఖే, వైస్ ఛాన్సలర్, భారతీ విద్యాపీఠ్, పూణే, ప్రొఫెసర్ హెచ్‌సిఎస్ రాథోడ్, దక్షిణ బీహార్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సలర్ మరియు ప్రొఫెసర్ భీంరాయమెత్రి, ఐఐఎం నాగ్‌పూర్ డైరెక్టర్ టెక్నికల్ సెషన్‌లో ప్రసంగించారు.

Get real time updates directly on you device, subscribe now.