మండే కుంపటి
””””””’
అధికారి చేతిలో కుంచె
సప్తవర్ణ చిత్రాల బహు విచిత్రం!
న్యాయన్యాయాల
సత్య శోధనకు అన్వేషణ
అద్దం ముఖం చాటేసింది
అతని నిజ స్వరూపం చూసి!
ఉన్నత వర్గ విహార కేళి ముందు
గుడ్ల గూబ కళ్ళు తప్ప
కిందిస్థాయి కీలు బొమ్మలే కదా!
తనిఖీల తతంగంలో
చేదు నిజాల గుట్టు రట్టయినా
బలహీనతల బజారు కీడ్చలేక
అవాస్తవ వ్యంగ్యస్త్రాల సంధింపు
ఎవని బతుకు కాల రాస్తందుకో ?
నత్త నడక న్యాయ దేవతని చూసి
కడుపుబ్బ నవ్వే అనైతిక రక్కసి
మండే కుంపటి అధికారం
సమైక్యత ఓ బలమైన అస్త్రం
ఎవడికి వాడైతే ఎండు పుల్లలే!
ఆమ్యామ్యాల రుచులకు
ఆశయాలు జీవచ్చవాలు!
నిధుల వరద ఉప్పొంగినా
సంక్షేమం సదా సంక్షోభమే!
అవినీతి దోమ ఎంతదైనా
బాదితునికి పెద్ద ప్రమాదమే!
అదృశ్య గారడీ భ్రమలతో
కపాలం కంపించటం కాదు
యువ నరాల్లో నవచైతన్యం
ఉత్తుంగ తరంగమై కదలాలి
నిఖార్సైన నిజాలు నిగ్గుతేలాలి
నిజాయితీ పునాదిపై
నాణ్యత నైపుణ్యాలతో
జాతి భవంతి నిర్మించేదెపుడో?
🔥🔥🔥🔥🔥✊🏻🔥🔥🔥🔥🔥
రచన: కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య పర్యవేక్షకులు,NVBDCP సబ్ యూనిట్ సికింద్రాబాద్, 8555010108.