నీ రూపే తెలియని ఎదలో జగడమే

ప్రసాద్

🌿🌼☘️🌸🍀🌷🍃🌾🍂🌻

*పాట:-*

*పల్లవి:*

నీ రూపే తెలియని ఎదలో జగడమే
చెలి చెలిమికే గగనమై గమనమే(2)
తొలి వలపుకై మధుర మధనమై
నయన నడవడికై వదన అఖిలమై…!(2)

*చరణం:1*

ఓ వన్నెలు పోయే వయ్యారివో
ఓయ్ వెన్నెల తెచ్చే మయూరివో
నా ఊహా లోకాన వసంతాల వెల్లువైనావోయ్
ప్రకృతి కన్య కురులారబోసి నిలువెల్ల ఆడే వేళ
చిరుజల్లుల తాపమై నా దేహమే పులకరించెనే
పరిచయమే తెలిపి మోగితే తన్మయమై వలలో నిలిచా…!!

*చరణం:2*

నీ రూపు చుక్కనై ఊహించుకునే మలిచానే
అందంగా అరిచానే తెలిసిన రీతిగా పాటల గానంలో
అందులో భాగమై పోయినే మాటల కలయికలే
నడిచి వలిచి భావాలనే విరిచి విహరించేలా
మరి మరి అలంకారాలనే అలంకరించి వలచానుగా నీకై
సరి జోడి కడితే సిరి సంపదలే సరిగమ పదనిసల ప్రాయంగా…!

*చరణం:3*

నీ రూపే తెలియని ఎదలో జగడమే
చెలి చెలిమికే గగనమై గమనమే
తొలి వలపుకై మధుర మధనమై
నయన నడవడికై వదన అఖిలమై…!

పాతికేళ్ల ప్రణయమే పదిలమైన చిరు వరమైనావై
పొదుపై పదునుగా నాటే రహస్య నమ్మకమే నేనుగా
ప్రేమనే అనుకున్నానే మొదటి మొత్తంగా నీ(తో)కై నేనై(తే)
దూరమే పెరిగాక అర్థమే తెలిసెనే చిర ప్రాణమైనావని…!!

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-
Lyrics / Lyricist ✍️
– Dr. Dhavala V.S.S.S.R.Prasad
Suresh(Rjy)
Mob:9492754546

🍁🌼🍂🌻🍂🌺🎋🌹🌾💐

Get real time updates directly on you device, subscribe now.