మహిళ

B. రాణి లీలావతి, జోగులాంబ, గద్వాల

…. .మహిళ….

స్వాంతన నిచ్చు చెలిమికి రూపం
చింతను దీర్చు మేధకు ప్రతిరూపం
బాధలో బాసటగా నిలుచు
మనలోని దైన్యాన్ని తుంచు
ఉర్విలోన ఉవిద …..
సంతసాల సరాగాల సంవిద
సంశయం మాఱాడుటలో
సదా ఆసక్తి ఆత్మీయత పంచుటలో
తనకు తానే సాటి…..
ధరణిలో లేరెవ్వరు తనకు పోటీ !
తరగని సహనం తనది
అలుపెరుగని పయనం ఆమెది
ఆకలైన వేళ తాను అన్నపూర్ణ …..
ఆలోచన తానౌను సంకట సమయాన ….
తెలుసా !విస్మయ సంపద పడతి ….
వినమ్ర వనవాసి సుదతి …..
కలిమి,బలిమి తాను మగనికి
చెలిమి,మేలిమి తానసలు ఈ జగానికి
ఓర్పులో పుడమితల్లీ !
నేర్పుతో బంధాలను నిలుపు కల్పవల్లీ !!
ఏ స్వరూపమైన సంతరించు సలిలం
బ్రతుకంతా ధారవోయు కుటుంబానికి సతతం …..
ధైర్యాన ఝాన్సీ …పాలనలో రుద్రమ
మంత్రాణాన ఇందిరా …మన్నన కోరని మమత….ఎన్నలేని సాహసం నీవే
లక్ష్మి సెహగల్ …మా చదువులకై తపించిన
దుర్గాబాయి దేశముఖ్ నీవే… మరుపురాని మగువ మాంచాల తెగువ నీవు ….
అతిశయపడక …సంశయాల నగపడక ….
సందేహాలు పడదోస్తూ యెడతెగక సాగే
ప్రస్థానం …అనితర సాధ్యం తన గమనం …
తనకు తానే సాటి !
భారతీయ వనితా !జగాన నీవె మేటి !!

హ్యాపీ ఉమెన్స్ డే …….

Get real time updates directly on you device, subscribe now.