నేటి భారతదేశంఇలా కనిపిస్తుంది
రేపులు జరిగే దేశం
మళ్లి మాపులు జరిగే దేశం..
రౌడీలేలె దేశం
డబ్బుతో రాజ్యలేలే దేశం..
చింతాకంత చింత చెయ్యని గొర్రెలు తిరిగే దేశం..
పరుగుల మీద పరుగులు తీస్తు పట్టి లేనిది దేశం..
వ్యవస్థలు మారని దేశం
ఎన్నో అవస్థలు పెట్టే దేశం..
సోమరిపోతుల దేశం
సగటి మనిషిని నరికే దేశం..
పుస్తకాలని పక్కాన పెట్టి వైన్సులు పెంచిన దేశం..
సిగ్గు,మానం పక్కాన పెట్టి శిలానమ్మిన దేశం..
రైతులు సచ్చె దేశం
విద్యార్థులు సచ్చె దేశం..
ఆకలీ తీరని దేశం
వెట్టి చాకిరి చేసే దేశం
ధర్మవ్యవస్థకు సంకెళ్లేసిన సన్నాసులుండేటి దేశం..
పార్టీకొక్క పలుకులు పలికే పత్రికలుండే దేశం..
అర్థనాధల దేశం
మత ఘర్షణ జరి జరిగే దేశం..
మంచిని మట్టిలో వేసిన దేశం
విద్య,వైద్యాన్ని కల్తీ చేసి దందాల సాగే దేశం..
మార్పు కోసం ఎదిరి చూస్తూ ఓ సామాన్య బాధితులకు ఇది అంకితం
గాండ్ల భానుప్రకాష్..
ముటాపూర్..
నిర్మల్ జిల్లా..