కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్సీ ఎస్టీ సెల్ నూతన డైరెక్టర్ గా డాక్టర్ తుమ్మల రాజమణి నియామకం….
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో ఎస్సీ ఎస్టీ సెల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ డైరెక్టర్ గా డాక్టర్ తుమ్ముల రాజమణి ని నియమిస్తూ రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుత సంచాలకులు డాక్టర్ కే సదాశివ గారి నుండి ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. తుమ్మల రాజమణి నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామానికినివాసి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మెడిసినల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివి అదే విశ్వవిద్యాలయం నుండి 2013లో మెడిసినల్ కేమిస్త్రి లో డాక్టరేట్ పట్టా పొందారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సదస్సులలో 12 పైగా పరిశోధన పత్రాలను సమర్పించారు. రెండు ప్రతిష్టాత్మక పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి ఎల్ఎల్ఎం పట్టాను పొంది గతంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపికైనారు. భారత రాజ్యాంగంపై అనేక సెమినార్లలో ప్రసంగాలు చేశారు. కోవిడ్ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి ప్యాండమిక్ సిచువేషన్ లో గ్లోబల్ సౌత్ ఫోరంలో పాల్గొని విలువైన సూచనలను చేసినారు. తెలంగాణ మహిళా సభకు వ్యవస్థకు ఉపాధ్యక్షులుగాను ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో జీవిత కాలపు సభ్యులుగాను అదేవిధంగా ఇండియన్ గైనకాలజి సొసైటీలో జీవితకాలం మెంబర్ గా కొనసాగుతున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూరు. ఎస్సీ ఎస్టీ సెల్ సంచాలకులుగాను మరియు కాంపిటీటివ్స్ ఇన్చార్జిగాను వ్యవహరిస్తారని ఆచార్య మల్లారెడ్డి ఉత్తర్వులు పేర్కొన్నారు. సంచాలకులుగా డాక్టర్ తుమ్మల రాజమణి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు పోలా గ్రామస్తులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ గురుకుల సిబ్బంది మరియు తిరుమల జిల్లాకు చెందిన ప్రముఖ కవులు డాక్టర్ తుమ్మల దేవరావు, డాక్టర్ దామెర రాములు, డాక్టర్ చక్రధారి నేరెళ్ల హనుమంతు అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, తుమ్మల రాజారాం, తుమ్మల రాజన్న తదితరులు డాక్టర్ రాజమణికి అభినందనలు తెలిపారు.