SSA ఉద్యోగుల సమ్మే….. పట్టించుకోని సీఎం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా SSA ఉద్యోగులు సమ్మేకు దిగారు. మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా ఉద్యోగుల ఉద్యమం చూస్తున్నాం. అసలు వీళ్లకు పనిలేదా? అనుకోకండి.
*******
తెలంగాణ 2014 లో వచ్చింది కాని అప్పటి పూర్వ ప్రభుత్వం అయినా BRS, TRS నాయకులు గాని తొలి ముఖ్యమంత్రి కలువకుంట్ల చంద్రశేఖర్ గారు వెన్నెల పంచని చంద్రుడుగా మారి కలువలు ఉనికిని మింగేసి నట్లు SSA ఉద్యోగులను గాని, నిరుద్యోగ యువతను గాని పట్టించు కోకుండా 10 సంవత్సరాలనుండి నరకం చూపించినాడు.
రైతులు పెన్షన్ తీసుకొనే వాళ్లకు అండగా ఉండి ఆదరించాడు కానీ ఉద్యోగుల, నిరుద్యోగుల జీవితాలతో ఆట్లాడుకున్నాడు. తెలంగాణ ప్రజలు KCR కు బుద్ది చెప్పాలని అనుకున్నారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ హవా పుంజుకొని అనుముల రేవంత్ రెడ్డి ని గెలిపించుకున్నాం. ఆయన SSA ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని, గెస్టు లకు జీతాలు పెంచుతాం లాంటి అనేక హామీలను ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సరం దాటినా హామీలు ఇంకా నెరవేర్చలేదు అందుకే ఈరోజు నిర్మల్ జిల్లా లోని SSA ఉద్యోగులు సమ్మే చేస్తున్నారు. ఈరోజు సమ్మె 19వ రోజుకు చేరింది.