వేము వందనం సాహిత్యం

వేము హైదరాబాద్

🌲🧚‍♀️🌲
అంశం పర్యావరణం
కవిత. : వచన కవిత
పేరు. : సాహితీ రత్న
వేము వందనం
చరవాణి: 83743 33907
🌼🌼
పర్యావర్ణంప్రాణప్రధమనినమ్మి
పచ్చదనంపరిశుభ్రతధ్యేయంగా
పంచమహావృక్షాలను పరిరక్షిస్తే
పచ్చనిచెట్టే ప్రగతికితొలిమెట్టు!

నీటి వాయు శబ్ద కాలుష్యాల
సమ్మేళనమీసృష్టికి విషాలను
విఘాతాలసృష్టిస్తూ మరణ
శయ్యపైపర్యావరణాన్నుంచె!

ఓజోనును రక్షంపోఉద్యమం
చేపట్టి ప్లాస్టిక్ మహమ్మారిని
తరిమికొట్టీనాడే ప్రతిజ్ఞపూను
మృతకళేబరాలనుపూడ్చెస్తూ!

తడిపొడిచెత్తలకువిడాకులిచ్చి
స్వచ్చ భారత్,స్వచ్చ సర్వేక్షణ
ఊపిరిగాపారిశుద్ధ్యనిర్ములనతో
పరిసరాల కాపాడ దీక్ష పూని!

పర్యావరణం మరణశయ్యపైకి
జాలువారకముందే’వృక్షసంపదే
నేటధికసంపద’నెంచుస్పూర్తితో
“వృక్షో రక్షితి రక్షితం”ఆర్యోక్తితో!

🌲5-6-2022 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 🌲

🌹కష్టజీవుల కవి ”శ్రీ శ్రీ”🌹🏵️
ప్రజాకవి అభ్యుదయ
యుగకర్త విశ్వ కవి
మరువలేని మహాకవి
”మహాప్రస్థానం”సృష్టి కర్త
పీడిత,బడుగు,బలహీన
వర్గాలజనుల సమైఖ్య
జీవనసమసమాజకోసం
విప్లవవిజయశంఖారావం
పూరించి తరతరాలకు
జనులనాలుకలపైనిల్చిన
నవకవితా నిత్య తేజస్వి
సమత,యువత,నవతలో
చైతన్య దీపాలవెలిగించిన
నవ సమాజ నిర్మాణానికి
ధర్మ సమాజ స్థాపనకు
నిరంతరంతపించానాడే
సాహిత్యంసామ్యవాదాల
వివాహంజరిపంచినమహా
మహోన్నత మా శ్రీరంగం
శ్రీనివాస్ విశ్వకవితేజమా
మీ వర్ధంతి మహా వేడుకల
వేళమేమేమిచ్చిమీఋణం
తీర్చుకోగలం ”చంద్రునికో
నూలు పోగుగా”అర్పిస్తున్నాం
విశ్వపూలతోటలోనిపుష్పాల
‘కవితా”పూమాలల హారాల్ని
అందుకోండివిప్లవజోహార్లతో!
🦋🦋

విశ్వ నాన్నలకు శుభములు
(హ్యాపీ పాదర్స డేసందర్బాన)
🌹🙏🌹
నీచేయిపట్టి నడకలు,నడవడిక
నేర్పించాడు నీకు’నీనాన్న’
అప్పులెన్నెన్నోచేసి నీకు ఉన్నత
విధ్యలందించాడు’నీనాన్న’
ఉన్నదంతూడ్చేసినీకోసుఖమైన
జీవితాన్నిచ్చాడు’నీనాన్న’
తాను పంటకాల్వ లోనీరుతాగి
పంచభక్ష పరమాన్నాలిచ్చె,
తాను నేలపైనే నిదురించి నీకు
హంసతూలికాతల్పాలనిచ్చె,
తాను అతుకులచొక్కాతొడిగి
నీకధునాతన దుస్తులిచ్చె,
తాను ఎండ వానల్లో నిలచి
నీకుచలువరాతిమేడనిచ్చె,
కొడుకా! ఇన్నిచ్చిననీనాన్నకు హ్యాపీపాదర్స్డేఅని”చెప్పలేవా!
💐🍇💐🍇💐🍇
👑నేటి ఓ మంచి మాట 👑

పుష్పాలు వికసించిని చోట
సువాసన లేల జనియించు!
పసి పాపలు నడయాడని
లోగిళ్ళలోఆహ్లాదమేలపుట్టు!
నీటి చుక్కలు లేని చోటున
ఉద్భవించునాగరికపూపైన!
సహృదయం లేని మనిషిలో
ప్రేమానురాగాలమాటఓకలే!!
✍️
వేము: 🌼 శుభోదయం 🌼
నేటి ఓ మంచి మాట
🙏
ఎండ,వానలెన్నైనగుడిలోపలి
దేవుళ్ళు కుశలమేత్రికాలాలలో
మండుటెండ,జడివానలెన్నైన
పేదోడికిపొట్టనింపెంతకష్టమో!
✍️
వేము
నేటి ఓ పిల్లల మాట
🧑‍🎤👩‍💼

నేటి పిల్లలే రేపటి చిరుదివ్వెలు
నవ్వులొలుకు తొలకరిజల్లులు
అప్పుడేవికసించినమల్లెపూలు
వారిమోమింద్రధనస్సురంగులు
🌹🙏🌹 వేము🌹
ఓ మంచి మాట
🏵️
కోట్ల కొద్దిగా నీ వెంత విత్తము
కూడబెట్చిన,ఓచిల్లిగవ్వైనను
నీవెంటరాదు మరుభూమిదాక
పరులచెంతకేగానినీకేటిలబ్ది!!
✍️
వేము
ప్రపంచ జనాభా దినోత్సవ
శుభాకాంక్షలతో
🤷‍♀️🧑‍🎤👩‍💼

పెరిగి పోతుంది జనాభా
విశ్వ దేశాలలో పోటీపడి
ఎర్ర త్రికోణపుగుర్తుమరచి!
ఎగిసెగిసి పడుతున్నాయ్
నేడుపేదరికపుఅలలెన్నెన్నో!
విత్తమున్నోడిదభివృద్దిదేశం
అదిలేనోడిదిపేదరికపుదేశం!
చైనాజనాభాతోనేమనపోటీ
అభివృద్ధిపదంలోవెనుకసీటే!
మాయదారి కరోనాతో పాటు
కొత్తజబ్బులుఖజానామింగేస్తే
గరీబోడి ప్రాణాలుగాలిలోకెళ్ళె
ఆరోగ్య సూత్రాలావిరై పోయె!
ధరణిపై జనాభాపెరగాలి,కాని
సుఖశాంతులతోవిరజిల్లాలిగా!
🌼🙏🌼
✍️
వేము 🌼శుభోదయం 🌼
నేటి ఓ మంచి మాట
🙋‍♂️
విశ్వమంత నేనెరుగుదునని
విర్రవీగువాడుసమానుడేకదా
కూపస్థమండూకముతో,పంచ
భూతాలపనినెరిగినోడేధరణిపై
అసలైనజ్ఞానసంపదకలవాడు!
✍️
వేము ఓ మాట🌼🌼
🩱
ఎదుటివారెదుగుదల ఓర్వలేక
నిత్యమెదుకుతారుతప్పులెంచ
తమతప్పులన్ని గురిగింజవోలె
దాచినడయాడుతారునక్కవోలె
🎾🎾
వేము నేటి ఓ మంచి మాట
🌼
మన తాతలు మీసాలపైన
నిమ్మకాయలు నిలుపవచ్చు
రోషమున్నోడనిచెప్పగలమా
రొయ్యమీసాల్లార్భాటమేమో!
✍️

మహా నేత వై ఎస్ ఆర్ జయంతి మరియు రైతు దినోత్సవ దిన శుభాకాంక్షలతో
💐🙏💐
ఆనాటి మనరాజు మహారాజే
పేదల పక్ష పాతి బిరుదతనిదే
చూస్తాడుగడియారం పాలనకే
స్టెతస్కోప్తోచూసేది జనంనాడే
ఫీజుమాఫీచేసిపిల్లలకుమేల్చేసే
ఆడపడుచులనాధరించినన్నవే
నిరుద్యోగులకుపాధికల్పననీదే
పేదోడికార్పోరేట్వైధ్యంనీచలవే
వృద్ధులకచ్చిన పెన్షన్నీమహిమే
హిందువులతోజోడీకట్టిందినీవే
ముసల్మానులతోభాయందినీవే
క్రైస్తవులతో ఆమేనన్నదీ నీవే
దైవరూపమైజనుల్లోనిల్చావ్నీవే
అభివృద్ధికి నడక నేర్పందీ నీవే
అసలు రీడర్ మేకర్ అన్నీ నీవే
భావి తరాలకు దిక్క్చూచి నీవే
సామాన్యుడికినిత్య స్ఫూర్తినీవే
గిట్టుబాటుధరలందించావునీవే
ప్రేమానురాగాలప్రేమమూర్తినీవే
వ్యూహచతురతలోహీరోవునీవే
ఇందిరమ్మిళ్ళు ఇంజనీరువునీవే
ఆరోగ్యశ్రీ రూపకల్పన డాక్టర్నీవే
రైతన్నలకుచితవిధ్యుత్నీ చలవే
రూపాయకి కిలో బియ్యం నీవే
పేదలకుభూపంపిణీసారథివ్నీవే అందుకే ”
వై ఎస్ ఆర్ రారాజే’
రాజశేఖరుడుపాలనలోవిజేతే!
🪂🪂🪂
సాహితీ రత్న
వేము వందనం
రచయిత,నటుడు
83743 33907
నేటి ఓ మంచి మాట
🙏
నర్సరీ చదువులకే లక్షల ఖర్చు
ఉద్యోగానికివయస్సు పెంచినా
‘ పెంషన్’ ఊసేది కొలువచ్చినా
చావుబతుకులసమరమేమిగిలె
✍️
వేము
ప్రపంచ జనాభా దినోత్సవ
శుభాకాంక్షలతో
🤷‍♀️🧑‍🎤👩‍💼

పెరిగి పోతుంది జనాభా
విశ్వ దేశాలలో పోటీపడి
ఎర్ర త్రికోణపుగుర్తుమరచి!
ఎగిసెగిసి పడుతున్నాయ్
నేడుపేదరికపుఅలలెన్నెన్నో!
విత్తమున్నోడిదభివృద్దిదేశం
అదిలేనోడిదిపేదరికపుదేశం!
చైనాజనాభాతోనేమనపోటీ
అభివృద్ధిపదంలోవెనుకసీటే!
మాయదారి కరోనాతో పాటు
కొత్తజబ్బులుఖజానామింగేస్తే
గరీబోడి ప్రాణాలుగాలిలోకెళ్ళె
ఆరోగ్య సూత్రాలావిరై పోయె!
ధరణిపై జనాభాపెరగాలి,కాని
సుఖశాంతులతోవిరజిల్లాలిగా!
🌼🙏🌼
✍️
వేము

🧚‍♀️వర్షం 🧚‍♀️🧚‍♀️కవిత

🏵️సాగరానికల్పపీడనజ్వరమొచ్చె
సుడి గాలితోకాశానికి రంధ్రమై
అతిభారీవర్షం అవనిని ముంచె
హోరు గాలితో చెట్లు నేలకొరిగె
వాగులు వంకలపరుగులుసాగె
నదులు ఉప్పొంగి పోటెత్తసాగె
జలపాతాలెన్నోపరవళ్ళుతొక్కె
తుఫానుకు పూరి గుడిసెలెగిరె
రోడ్లు వంతెనలుకొట్టుకుపోయె
పంటలుతడిసిరైతన్నగుండాగె
బడులు కాలేజీలు బందాయె
పంచభూతాలాగ్రహించినవేళ
మనిషికికమిగిలేవిరక్తాశ్రువులే!
అతివృష్టి అనావృష్టి బాధలే
జగతికి లాభనష్టాల బేరీజు!!
✍️
వేము
నేటి ఓ మంచి మాట
🙏🌼🙏
తాము చెప్పేది నీతంటు ఎంచి
నోటికొచ్చినవన్ని వల్లించెదరు
పరులకుమేలుచేయుసూక్తులు
హృదయాల్లోనుద్భవించవలె!!
✍️
వేము
నేటి ఓ మంచి మాట
(107)
పందెపు గుర్రాలకు, కత్తి కట్టె
కోడి పుంజులకు వేలకు వేలు
ఖర్చుచేస్తారుకానియాచకుడు
అరచినాఅరకాసైనావిదల్చరు
✍️

నేటి ఓ మంచి మాట
(109)
🙏
భక్తులగోడుదేవుడువింటూంటే
పనోడిగోడెజమాని వింటూంటే
ఉద్యోగి గోడేజమాన్యం వింటే
కన్నవారిగోడీపిల్లలినేదెప్పుడో?
✍️
వేము

Get real time updates directly on you device, subscribe now.