శశి శర్మ బొల్లాప్రగడ అవధాని

శశి శర్మ బొల్లాప్రగడ అవధాని

శ్రీ కృష్ణా జన్మాష్టమి శుభాకాంక్షలు

శా.వి:
శ్రీకృష్ణుoడను పూజ సేయ నిటు నే చెంగల్వ పూల్దెచ్చితిన్
మాకున్ రక్షణ నీయ వయ్య నిలలో మా పాలి దైవంబుగా
ప్రాకారంబుగ నిల్వుమయ్య ఖలులన్ రక్షించు కాకోధరా!
నీకున్ దప్పక పూజ సేతునయ నానీ! నిన్ దలంతున్ ప్రభూ!!

మ:
ఖలులన్ రక్షణ జేయ; బుట్టె నతడే కాకోధరున్డై యిలన్
కలికాలంబున నిండె పాపములు లోకాలెల్ల నిండెన్ మహా
ప్రళయంబుల్ మరి నేర ఘోరములతో రంజిల్లగా నీ భువిన్
కలి కాలంబున బుట్టు మాధవుడు లోకంబెల్ల రక్షించగన్!!

– శశి శర్మ బొల్లాప్రగడ
అవధాని
విశాఖపట్నం .

Get real time updates directly on you device, subscribe now.