రా’జీవుడు’.
నవ భారతానికి సాంకేతిక రంగంలో ఊపిరి పోసి
భారతదేశం కోసం తన శ్వాసను వదిలి
అమరుడైన రా’జీవుడు అతడు.
దేశానికి క్లిష్ట సమయం దాపురిస్తే
చుక్కాణి తానై నడిపించిన నాయకుడు అతడు.
శ్రీలంక శాంతి కోసం తన ప్రాణాలే
పణంగా పెట్టిన ఘనుడు అతడు.
ఎల్టీటీఈ ఆగ్రహవేశంతో ‘థాను’
చేసిన విస్ఫోటనంలో బలై విగతుడైన అతడు..
భారతదేశం కోల్పోయిన దార్శనికుడు అతడు..
శాంతి కపోతానికి గాయాలు పొడిచిన వేళ
రక్తపు యేరులు మడుగు కట్టిన చారికల్లో అతడు…
క్షణకాలంలో భారతం విలువైన శక్తిని కోల్పోయింది.
యావత్తు దేశం విచారంలో మునిగిపోయింది…
రాజీవుడు కోసం తల్లడిల్లింది.
అమరుడైన రాజీవ్
భారతమాత ఒడిలో ఎప్పటికీ అమరజీవుడే..
నేడు రాజీవ్ గాంధీ జన్మదినం.
ఆయన సేవలు కొనియాడుతూ.. నివాళులు అర్పిస్తూ…
అశోక్ చక్రవర్తి.నీలకంఠం.