మనసెరిగిన నేస్తం

మనసెరిగిన నేస్తం

మనసెరిగిన నేస్తం

*హోల్లో ఫోన్ రింగ్ ఔతుంది,

“రమా ఆ ఫోన్ చూడూ ఎవరో అన్నారు రమణా…
“వస్తున్నానండీ “ఇంత ఉదయమే ఎవరో ఫోన్” హలో…”ఆ చెల్లెమ్మ నేను కిషోర్ అన్నయ్య ను, బావున్నారా..”అన్నయ్య మీరా…బావున్నాం, వదిన వాళ్ళు బావున్నారా…? ఇంకా ఏంటి విశేషాలు ఇంత ఉదయమే కాల్ చేశారు…”

ఏం లేదమ్మా…ఈ మధ్య ఫ్లాట్ తీసుకున్నాం కదా ఈ శుక్రవారం రోజు బావుందటా గృహప్రవేశం చేయాలని నిర్ణయించాము,మీ వదిన, మీరు ఆడపడుచులు కదా రావలసిందేనని ఒకటే అడుగుతున్నారు, అందుకే ఫోన్ చేశాను…

“ఓహ్ ఔనా ఆడపడుచుల లాంఛనాలు ఇస్తానంటే ఎందుకు రాకుండా ఉంటాం అన్నయ్య…” “తప్పకుండా ఉంటాయి మీరు బావ అందరూ రండి..”సరే అన్నయ్య…

“ఏరా చరణ్ ఈ శుక్రవారం ఏం ఫోగ్రాం పెట్టుకోకు మీ మామయ్య అదే మన దూరం బంధువు కిషోర్ వాళ్ళ గృహప్రవేశం ఉంది వెళ్ళాలీ…”

“ఏంటమ్మా నువు ఈ గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు తిరగడానికి నేనేమైనా ఆడపిల్లనా…” అన్నాడు
“అలా అంటావేంట్రా అన్నయ్య ఆడపిల్లలే తిరగాలని రూల్ ఏమైనా ఉందా…”అంది సుమా.” హ్మ్ నువు ఆపవే… నాకు వీలు కాదు నువు వెళ్ళూ…” అన్నాడు.

“నేనెలాగు వెళతా నువేం చెప్పక్కర్లేదు అనడంతో రమణ కల్పించుకుని “హే నువు రాకుండా ఇకడ వెలగపెట్టే రాచకార్యాలు ఏమైనా ఉన్నాయా…””ఆ నాన్న
అలా కాదు నేను రాలేను..”
“హే ఎందుకు…?
పెళ్ళి కావలసిన అబ్బాయివి నాలుగు చోట్లా తిరిగితే నలుగురి దృష్టిలో పడుతావు బావుంటుంది”

“(నాన్న నా పెళ్ళి గురించి మాట్లాడేసరికి నాకు చాలా సంతోషం కలిగింది వెంటనే వెళ్ళాలి అని పిక్స్ అయ్యాను) “కాని నాన్న నాకు అకడ ఎవరు తెలియదు బోర్ గా ఉంటుంది.” ఎపుడైనా వస్తే కదా తెలిసేది పల్లెటూరి ని తలపించే ఆ ఊరి వాతావరణం, చాలా బావుంటుంది వచ్చేయ్ రా…

“అలాగే నాన్న..”

కొత్త ప్రదేశం చూడబోతున్నాననే ఆలోచన చాలా బావుంది అనిపించింది, చూడకపోయిన నా ఊహలలో ఆ ప్రదేశం బావుంది అని ఎప్పుడు వెళతాం అన్నా కుతూహలం మొదలైంది.. ”

“రవి ఓ మూడురోజులు మేము ఓ కొత్త ప్రదేశం వెళుతున్నాం,””ఎక్కడికిరా చరణ్ మేము రావచ్చా…?” “వద్దు రా మా అమ్మ వాళ్ళ దూరపు బంధువులు విలేజ్ వెళుతున్నాం,” “ఓహ్ ఆల్ద బెస్ట్ రా అక్కడ నువు అనుకుంటున్నది దొరకాలిరా..” “హే నేనేం అనుకోలేదు…”

“హ్మ్ మాకు తెలుసులే…! ఒకే మమ్మల్ని మరచి పోకు…” “వీడేంటి ఇలా అంటున్నారు అనిపిస్తుంది మనసులో… అనుకుంటుండగానే ఆ రోజు వచ్చేసింది..ఆ ఊరు బయలుదేరాం”

“వ్వావ్…! ఎంత బావుందో ఆ ఊరు పచ్చని పొలాలు, చల్లని గాలి,చెరువులో కనిపిస్తూ కనువిందు చేస్తున్నా భూదేవి నుదుటన కుంకుమ దిద్దినట్టూగా వెలిగిపోతున్న అస్తమయసమయార్క ప్రతిబింబం మనసును దోచుకుంది పల్లెటూరి వాతావరణానికీ ధీటుగా ఉన్నా ఈ పట్టణంలో కలకాలం ఉండి పోతే బావుండు అనిపిస్తుంది..

సరదాగా కాసేపు నదీ తీరంలో పార్కు లో గడిపి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం… ఇన్ని రోజులు కాలుష్యం మధ్య తిరగిన మనసుకు ఈ ప్రకృతి ఎంతో హాయిని కలిగించింది,ఆ ఆలోచనలు మనసును గిలిగింత పెట్టగా నిదుర లోకి జారున్నాం…..

“ఒదినా మా అల్లుడు చరణ్ ఇంకా లేవలేదా…ఓ అత్తా…! వాడు లేవాలంటే 10 దాటాలి…ఇపుడే లేవడు.. పడుకోనీవు మళ్ళీ లేస్తే బోర్ ఔతుందని ఫీల్ ఔతారు,” “ఏంటీ నేనుండగా బోర్ కొట్టనిస్తానా నా ప్రతాపం చూపిస్తా బావకు అని తరుణ్ వెళతారు..”

“ఒరేయ్ తరుణ్ వద్దు రా బావకు నువు తెలియదు ఇబ్బంది కలిగించకు…”
నో వే… బామ్మరిది ఉన్నదే ఇబ్బంది క(తొ)లగించేందుకు కదా…!నేనే స్వీయ పరిచయం చేసుకుంటా…”

“ఔను పరిచయం ఎలా చేసుకోవాలి… ఐడియా… బావకు గిలిగింతలు కలిగిస్తే లేస్తారు కదా…”చెవిలో మెల్లగా పూలతో గిలిగింత చేయగానే..

“హాయ్ బావా బోర్ కొడుతోంది అన్నారటా కదా నేను చూసుకుంటాలే….. నేను తరుణ్…మొన్ననే Btech పూర్తి చేసి వచ్చేశా,మీకో మాంచి స్నేహితులు అనుకో ఏదైనా ఆర్డర్ వేయి…. “ఓహ్ కంగ్రాట్స్…

“తరుణ్ నాతో ఉండే తీరుకి ముచ్చటేస్తుంది… దాదాపుగా సమవయస్కులమే ఏదైనా పంచుకోవచ్చు…ఈ మూడురోజులు మంచి టైంపాస్ ఔతుంది అని మనసులో అనుకున్నాడు చరణ్..”

“తరుణ్ …బావకు బోర్ గా ఉందటా రేపటి కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లుకు నీతో పాటు తీసుకెళ్లి మన ఊరంతా తిప్పి తీసుకొని రా అని లతా అనడంతో…” “అలాగే అమ్మా…రండి బావా.. ఫల్సర్ బైక్ పై బయలుదేరి, పచ్చిక బయళ్ళు,పారే సెలయేర్లు,
కొండ ప్రదేశాలు, మాఘమాసం లో మామిడి తోటల అందాలు అన్ని చూస్తూ మైమరచి పోతు పూజకోసం మామిడి ఆకులు తీసుకోని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నా…”

అప్పటికే వీళ్ళ ఇంట్లో బంధువులతో సందడి సందడిగా ఉంది..అందులో ఎవరు నాకు తెలియదు పరీశీలనగా అందరి వైపు చూశాను అనుకోకుండా నా చూపు ఓ చోట ఆగింది, కారణం…. ఏ దివిసీమల వసంతమో ఈ ఎడారి యదలో చేరినట్లు గా స్వర్గలోకాలను వదిలి భువి పైకి వచ్చిన నర్తకీ లా ఉన్న ఆ నయన మనోహరి అందం మనసుకు హత్తుకుని మైమరిపిస్తోంది, ఒక్కసారిగా నా మనసులో ఈ అమ్మాయి నా స్వంతం ఐతే బావుండు అనేంతగా నచ్చేసింది. ఇదేం భావమో తెలియని అనుభూతి మనసులో కలవరం కలిగిస్తుంది, ఎలాగైనా ఆ అమ్మాయి మనసులో స్థానం సంపాదించాలనే ఆలోచనలతో ఆ రాత్రి నిదుర కరువైంది…

“మరునాడు ఉదయమే ఆకాశంలో చందమామ అవని పైకి అరుదెంచినట్లుగా,పసుపు పూసిన గుమ్మానికి పచ్చతోరణం కడుతూ పట్టు పరికిణి ఓనీ తో నడు ఒంపులలో నాట్యం చేస్తున్నా వాలుజడ ఒయ్యారంతో నడుస్తూ కాఫి కప్పుతో నను చేర వచ్చింది నవరవ్వన నాయకి ఆశ్చర్యం ఆనందం కలగలిపిన సరికొత్త భావంతో ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బైపోయాను,ఇంకా తేరుకోలేకుండానే” “హాయ్ కాఫీ తీసుకోండి అని చేతికందిస్తూ నేను మీకు తెలియదు కదా నా పేరు హరిణాక్షి” “ఔను కదా…” “హ్మ్ మీకలా తెలుసు…!” “మృగనేత్రాల్లాంటి మీ కనులు చూసి చెప్పాను” “అంటే నేను మృగం లా కనిపిస్తున్నానా…?”
“చ చ అలా కాదు లేడి కళ్ళ కాజల్ లాంటి మీ పేరుకు కవితాత్మక అర్థం” “ఓహ్ మీరు కవులా…”ఇప్పటివరకు కాదు కనువిందు చేసే మీ అందం చూస్తుంటే కవిత్వం పుట్టుకొస్తుంది.” “నీ కవిత్వం తర్వాత తీరికగా వింటాలే కాని ముందు ఫ్రెష్ అయిరండి..”

పసి నిమ్మ పండులాంటి అమ్మాయి, కలువ రేకలు లాంటి కనులు, ఇంద్ర ధనుసు లాంటి కనుబొమ్మలు, ముంగురులు తారడుతూ మురిపిస్తున్న నుదురు, ఆ నుదుటి పై అరుణిమ లాంటి కుంకుమ, పాల చెక్కళ్ళ సొగసు చూస్తుంటే నాలో ఏదో తెలియని ఆనందం వెల్లువలా ప్రవహిస్తోంది. ఈ ప్రణయ ప్రవాహం లో మునగక ముందే నా ప్రేమ విషయాన్ని చెప్పాలి అనుకున్నా…కాని మార్గం కనిపించలేదు, చెప్పితే తను ఏమంటుందోనని యదలో ఏదో అలజడి, ఆలోచించి తరుణ్ సహాయం తీసుకుంటే బావుండు అనిపించింది.”

“ఏరా చరణ్…” “అమ్మో అమ్మా పిలుస్తుంది… హా వస్తున్నానమ్మా”” ఏరా ఇవాళ కూడా ఇంతలేట్ గానా వెళ్ళి రడీ అయ్యిరా….చాలా పనులున్నాయి” “సరే నమ్మా…”

“అమ్మా సుమతీ….” “చెప్పండి ఆంటీ…”ఈ అమ్మాయి మా అన్న కూతురు పేరు హరిణాక్షి నీకు మంచి కాలక్షేపం చేస్తుంది, హా అన్నట్లు ఈ కార్యక్రమ భాధ్యతను మీపై వేస్తున్న ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకుని పూర్తి చేయండి, నేను అందరిని పలకరించాలి కదా…” “సరే ఆంటీ… వెళదామా…” “పదా…’

“మీరేం చేస్తుంటారు సుమా…” ” నేను మొన్ననే ఎమ్మస్సీ పూర్తి చేశాను సెర్చింగ్ ఫర్ జాబ్…మీరు” “MBA కంప్లీట్ చేశాను హైదరాబాద్ లో ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్న..” “ఎంత సంపాదిస్తున్నారేంటి” ” హా ఏముంది ఆరంకెల వేతనం అరకొర జీవితం…” ” అలా అంటారేంటి…? సరిపోతుంది కదా…” “మనిషి ఆశాజీవి సరిపోవడమనేది ఉండదు, రోటీన్ లైఫ్ చేంజ్ ఉండాలి కదా అందుకే కొద్దీ రోజుల ఇక్కడ వాతావరణం లో గడపాలని వచ్చేశా…”

“ఓహ్ మీరు శ్రీమంతులా…” “ఎందుకు అలా అడిగారు..” “ఎంజాయ్ చేయడానికి టైం కేటాయిస్తున్నారు కదా అందుకే…” “ప్రపంచంలో డబ్బులు ఉన్న వారు శ్రీమంతులు కాదు..మంచి మనసు, అర్థం చేసుకునే తథ్వం ఉండాలి…” “మీకు అలాంటి వారే దొరుకుతారు పెళ్ళి తర్వాత లైఫ్ హ్యాపీ గా ఉంటుంది…” ” అలాంటి వారు దొరికితేనే చేసుకుంటా…”

“నేను మాత్రమే చెపుతున్నా మీ వివరాలేం చెప్పరా…” “హ్మ్ మాది మామూలు కుటుంబం, నాన్నగారు క్లాత్ మర్చంట్, అమ్మ గృహణి” అన్నయ్య మెడిసిన్ చేశారు ప్రస్తుతం ప్రాక్టీసు లో ఉన్నారు… మా అన్నయ్య ను చూశారా…. అతనే…”హే ఇతను మీ అన్నయ్య నా మీకంటే ముందే పరిచయం…” “హా హౌ…” “ఉదయం కాఫి ఇవ్వడానికి వెళ్ళాను..” “మా అన్నయ అని చెప్పడం కాదు గాని చాలా మంచి వాడు అందరిని ఆదరిస్తూ ఎదుటివారిని సులభంగా అర్థం చేసుకుంటారు. ఎక్కడ ఉందోకాని మా వదిన అదృష్టవంతురాలే…” “ఇంకా పెళ్ళి కాలేదా….” “నొ… చూస్తున్నాం సెట్ అవడం లేదు..”

“సుమా ఏం చేస్తున్నావే నా డ్రెస్ ఎక్కడ…” ” బ్యాగ్ లో ఉంది చూడన్నా…” “ఎక్కడ…” “ఏది దొరకదు నీకు వస్తున్న ఆగు…! ఇదిగో రెడి అయి హాలులో కి రా…సరే..”

“హాయ్….” “హలో చెప్పండి” మా చెల్లి వసపిట్టలా వాగుతుంది విన్నావంటె అంతే…” “ఒరేయ్ అన్నయ్య ఏంట్రా ఆ మాటలు…నీ గురించే చెప్పాను…” “ఏంటో.. చెప్పుకునెంత గొప్ప చరిత్ర కాదులే మనది…” ” నిజమే చరణ్ మీ చెల్లి మీ గురించి గొప్పగా చెపుతుంది…” “ఓహ్ థాంక్స్… బై” “ఎక్కడ కి వెళుతున్నారు…” ” బయటకు” “ఇకడ.చాలా పనులు ఉన్నాయి అయిన తరువాత అందరం వెళదాం… ఏమంటారు…” ” నేను వచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా అలాగే.. ” “ఏంటీ మీరు కూడా వస్తారా…” “హే రాకూడదా…” “అలా అని కాదు… టైం గాడ్ తను కూడా వస్తుంది అంటే నా ప్రఫోజల్ కి లైన్ దొరికినట్లే అని ఆనందంతో ఆ రోజు సాయంత్రం గడిపేశాం…”

“అమ్మా చరణ్ బావ వాళ్ళతో బయటకు వెళుతున్నా” ” మన ఊరి పరిసరాలను చూసి రండి ” “అలాగే అమ్మా పదా బావా…

మలయ సమీరం తాకిడి, మల్లెపూల పరిమళం మనసంతా పులకరిస్తుంటే పొలాల గట్ల వెంబడి వెళుతుండగా ఆ ఆనందమే వేరు…” పల్లెటూర్లు పట్టణాలకు పట్టు కొమ్మలు అంటారు కదా నిజంగానే పల్లె టూర్లో ఇంత అందం,ఆనందం ఉంటుందా…”
“ఔను మీకు తెలియదా…” “లేదు చరణ్ నా స్టడీ మొత్తం వరంగల్ తర్వాత MBA,job అన్ని హైదరాబాద్ లోనే ఉండెది కూడా జూబ్లీహిల్స్ లో…” ఈ మాట వినగానే మనసులో ఉన్న మాట చెప్పడానికి మనసుకు ధైర్యం చాలలేదు,మేముండేది చిన్న సిటి ఆర్థికంగా మిడిల్ క్లాస్ ఇలాంటి నను తను యాక్సెప్ట్ చేయకపోతే ఎలా…ఒకవేళ తను నిజంగా సిటి కల్చర్ నా అలా అ(క)నిపిస్తలేదే…తన చనువు కలిసిపోయే తీరు సిటికి భిన్నంగా ఉంది.తరుణ్ ద్వారా నిజం తెలుసుకున్న తర్వాత మనసులో మాటా చెప్పేద్దాం అనుకున్నా…కాని ఎకడో భయం తను నాకు దక్కదేమోనని ఈ ఆలోచనలతో పరిసరాల్లో చూసి ఇంటికి వచ్చేశాం…”

“తరుణ్….” “.హా బావ చెప్పు…” ఒక సహాయం చేయాలి” ఓహ్ ష్యూర్ బావా మీరడగాలా….చెప్పండి ఏంకావాలో….” రేపు ఉదయం చెపుతాలే… ఒకే బావా బై…

“హరీ ….” చెప్పండి అత్తా..” ఏంటమ్మా ఈ పిలుపు” ” ఆంటీ అని సిటిలో ఎలాగు తప్పనిసరి కదా ఇకడైనా పిలుద్దామని…” ” ఎలా ఉంది మా పల్లెటూరి వాతావరణం,” “చాలా బావుంది అత్తా.. ఆప్యాయపు పలకరింపు, సాన్నిహిత్యపు సంబంధాలు ఇవన్నీ చూస్తుంటే ఇకడె ఉండాలి అనిపిస్తుంది…”
“దానిదేముంది నీకు నచ్చినన్ని రోజులు ఉండు నాన్నగారు తో నేనుమాట్లాడతా ” థాంక్స్ అత్తా…

“బావా ఏదో సహాయం అన్నారు కదా…” హరి వాళ్ళ వివరాలు కావాలి..” “ఏంటీ బావా మనసు పడ్డారా..” ష్… అలాంటిదే” ఒకే బావా మిమ్మల్ని కలపడానికి నా వంతు ప్రయత్నం చేస్తా…” “సరే వెళతాం మరి…ఇంకో నాల్రోజులు ఉండండి బావా ఈ లోపు పని ఐపోతుంది..” “ఏం పని అల్లుడు అక్కడ బావా ప్రాక్టీసు డిస్టర్బ్ ఔతుంది అన్నారు రమణా..”

“ఏం కాదులే బావా ఎప్పుడో కాని రారు కదా మా చెల్లిని పిల్లల ను ఉంచి మీరు వెళ్ళండి అని కిషోర్ అనడంతో… లేదు అన్నయ్య బావ కు వంట వార్పు కష్టం కావాలంటే పిల్లలు ఉంటారు మేం వెళతాం అని రమ చెప్పింది…” హమ్మయ్య అమ్మ ఇలా అనడంతో నా ప్రేమకు రెక్కలు వచ్చినట్లటు ఐంది…

“ఈ వారం రోజుల్లో తరుణ్ సహాయం తో నా విషయం తనుకు చేరవేయాలి అనుకున్నా…”

“సుమా మనం అలా బయటకు వెళ్ళి షాపింగ్ చేసి వద్ధామా” సరేపదా… “మేము రావచ్చా…” “ఇది ఆడవాళ్ళ షాపింగ్ నువేం చేస్తావు…” “మీకే ఏదైనా గిఫ్ట్ ఇద్దామని” ” నాకెందుకు” “జస్ట్ ఫ్రెండ్ లా నా గుర్తుగా…” “ఏంట్రా అన్నయ్య మీ మధ్య గిఫ్ట్ ఇచ్చుకునేంత ఫ్రెండ్షిప్ డెవలప్ ఐందా… చెప్తా..అన్నయ్య ఏంటి తనను ఇష్టపడుతున్నారా తెలుసుకోవాలి ఒకవేళ అదే నిజమైతే నేను హ్యాపీ…”

“బావా ఇప్పుడు చెప్పండి నా సహాయం ఏం కావాలో” తరుణ్ తన మనసులో ఎవరైనా ఉన్నారా& నా పై తన అభిప్రాయం ఏంటి తెలుసుకోని నాకు లైన్ క్లియర్ చేయండి…” “ఒకే బావా…”

“అక్కా…! రా తరుణ్… ఏంటి ఇలా వచ్చారు,” ఏం లేదు, ఏదో వెతుకుతున్నారు ఏంటి…” “నిన్న షాపింగ్ చేశాం కదా నా హ్యాండ్ బ్యాగులో ఆధార్ & ఐడెంటిటీ కార్డ్ మిస్సయ్యాయి” అందులో వివరాలు మెయిల్ లో సేవ్ చేశాను ఎక్కడ ఉందో వెతుకుతున్నా న్యూ కార్డు తీసుకోవాలి కదా…”నేను చూస్తా ఇటివ్వండి” అలాగే చూసి పెట్టండి కాస్త హెడెక్ గా ఉంది రెస్ట్ తీసుకుంటా..

“అన్నయా… నువు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా” “హే లేదు” “మరి గిఫ్ట్ ఎందుకు ఇస్తానన్నావు.. నాకు తెలుసురా…నిజంగా అమ్మాయి చాలా బావుంది కదా…” “నీకు నచ్చిందా ..” “100%” “ఐతే నిజంగానే తనంటే నాకు ఇష్టం కాని… ఎలా చెప్పాలో తెలియడం లేదు…” “నేనేమైనా అడగాలా” “వద్దు తరుణ్ ఉన్నారు కదా…”

“అక్కా మీ మెయిల్ దొరికింది ఇందులో కార్డ్ మీదేనా DOB తప్పు గా ఉంది ఏంటి మార్చుకోలేదా…” “కరెక్ట్ DOB అదే మార్చాల్సిన అవసరం లేదు” ఏంటీ అక్క బావ కంటే పెద్దదా ఐతే ఇపుడు ఎలా చేయాలి అని మనసులో అనుకున్నా… చూద్దాం ముందు బావ పై తన అభిప్రాయం తెలుసుకుంటే తర్వాత ఆలోచించవచ్చు… అక్కా చరణ్ ఎలాంటి వారు…? “ఎందుకు…? తరుణ అలా అన్నారు” “మీకు గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా తనపై కోపం వచ్చిందేమోనని.” “నో వెరి నైస్ పర్సన్ చాలా ఓపెన్ గా ఉంటారు…” “హమ్మయ్య ఈ అభిప్రాయం చాలు ఏజ్ విషయం ఆలోచించాలి ఇకా అని తరుణ్ వెళ్లి పోయారు…”

“బావా తనుకూడా మీ పాజిటివ్ గానే ఉంది మీ తీరు తనకు నచ్చింది కాని తను ఏజ్ లో మీ కంటే పెద్దగా ఉంది ఈ ఒకటి తప్ప అటు కారణాలు ఏం లేవు…” “తను ఈ మాట చెప్పగానే చాలా బాధేసింది తనకు నేను ఆస్తిలో అంతస్థుల లో వయస్సు లో ఏ విధంగా సరిపోలేను కాబట్టి బయట పడక మందే ఇకడ నుండి వెళ్ళిపోవాలి ఇంకా ఇకడే ఉంటే తనపై ఇంక ఇష్టం కలుగుతుంది తర్వాత మర్చిపోవడం కష్టం ఔతుంది అని మనసును మెలిపెట్టే మధురమైన తన జ్ఞాపకం మధ్యాహ్నం ఎండలా మండిపోతుంటే,మనసంతా బాధతో మరునాడు ఉదయమే మా ఊరు వచ్చేశాం”

“హలో బావగారు ఏంటీ గృహప్రవేశం పనులు కాలేదా ఇంకా ఎన్నిరోజులు ఉంచుకుంటారు మీ కోడలుని.?యాదగిరి అనడంతో” “ఏంటి బావా అలా అంటున్నారు మేమేమైనా దూరం వాళ్ళమా అమ్మాయి సిటిలో ఉండి బోర్ గా ఉంది అంటేను ఓ నాల్రోజులు పల్లెటూరి వాతావరణంలో సంతోషంగా ఉంటుందని ఉండమన్నాం అంతే..” “సరేలే ఆరోగ్యం బావుందా…మరేం లేదు బావా అమ్మాయి కి సంబంధం కుదిరేలాగా ఉంది, అబ్బాయి ఇంజనీరింగ్ చేశారు చూడడానికి బాగానే ఉన్నారు మాకైతే నచ్చారు ఒకసారి అమ్మాయి తన అభిప్రాయం చెపితే సెట్ చేసుకుందామని ఆలోచిస్తున్నా,” “ఇప్పుడే అమ్మాయి కి తొందరెందుకు బావా కొద్ది రోజులు జాబ్ చేసుకోనివ్వండి పెళ్ళి తర్వాత ఏం చేయాలకున్న చేయలేం కదా..” “అలా అంటారా మంచి సంబంధం కదా అని..సరే ఓ సారి అమ్మాయి అభిప్రాయం తెలుసుకుంటే ఒకవేళ నచ్చకపోతే రిజక్ట్ చేద్దాం…” “బావా,,,! పెళ్ళి సంబంధాలు అంటే కూరగాయల బేరమా ఎంతమంది కి చూపిస్తాం ఒక సంబంధం అనుకున్నామంటే సెట్ చేసుకోవాలి లేదంటే తర్వాత అమ్మాయి కి ఇబ్బందులు ఎదురవుతాయి..” “సరే బావా ఇందుకోసం కాకున్నా అమ్మాయి ని పంపించండి”

“ఉమా మీ అన్నయ్య గారు ఇప్పుడే అమ్మాయి పెళ్ళి ఎందుకు అంటున్నారు ఏం చేద్దాం..” “అన్నయ్య అన్న దాంట్లో తప్పు ఏముంది మనకు బోలెడంత ఆస్తి ఉంది ఈ సంబంధం కాకుంటే మన అమ్మాయి కి పెళ్ళి కాదా ఏంటి..గుండె పై భారంగా అనుకుంటున్నారా మీరు.” “ఉమా నేను చెప్పేది విను ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరగాలని నా ఆలోచన..” “ఏమో నండి నాకైతే ఇప్పుడు పెళ్ళి చేయడం ఇష్టం లేదు ఐనా మీ మాటకు ఏ రోజు నేను ఎదురు చెప్పలేదు మీ నిర్ణయమే ఫైనల్…”

“హరీ నాన్న గారు ఫోన్ చేశారు రేపు బయలుదేరి రమన్నారు…” “అలాగే మామయ్య…”, “ఏమండీ…” “చెప్పు, లతా ” “అమ్మాయి తో పెళ్ళి సంబంధం విషయం చెప్పారా….” “లేదు… ఎందుకు…?” “చెపితే తను ఏమంటుందో కదా…”, లతా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ జంట కూడా విడిపోవడానికి మనం కారణం కాకుడదూ…మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు జాగ్రత్త…” “అలా కాదండి తను కూడా మన అమ్మాయి లాంటిదే కదా..” “ఔననే బావ తో చెప్పాను తనకు నచ్చలేదు మనం ఏం చేయలేం కదా…”

“అత్తా నేను వెళుతున్న ఇన్నిరోజులు ఈ పల్లెటూరి వాతావరణం లో చాలా సంతోషం గా గడిపాను చరణ్ ఓ తమ్ముడు లా సహాయం చేశారు చాలా థాంక్స్….” “మళ్లీ ఎపుడమ్మా రావడం…” “ఏమో చూద్దాం.. సమయం సంధర్భం రా(కా)వాలి కదా..” “సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళు చేరుకున్నాకా ఫోన్ చేయు.. ”

“డాడి సడన్ గా ఎందుకు రమ్మన్నారు అర్థం కావట్లేదు ఇంకా కొద్ది రోజులు ఉంటే బావుండు అని ఆలోచిస్తూ బస్ ఎక్కాను..బస్ కదులుతుంటే నాలో ఆలోచనలు గంతులు వేస్తున్నాయి ఇక్కడ పరిసరాలు పరిచయాలు, స్నేహితుల జ్ఞాపకాలు జీవితాంతం సరిపోయే తీపిగుర్తులా అనిపిస్తుంది..ఆ తరుణంలో చరుణ్ పై అభిప్రాయం ఏంటని తరుణ్ ఎందుకు అడిగారోనని అనిపించింది…అప్పుడు చెప్పలేదు కాని తను సూపర్… తనతో ఉంటే సమయమే తెలియదు,తను లేకుంటే సంధ్య వాలదు..ఓ మంచి సన్నిహితుడు..ఒక మాటలో చెప్పాలంటే తనో మంచి ఫ్రెండ్…ఈ జ్ఞాపకాలలో గమనం చేస్తున్న నాకు జూబ్లీ బస్టాండ్ అనే కండక్టర్ మాటతొ ఈ లోకం లోకి వచ్చాను…”

“అమ్మా…!నాన్న ఎక్కడ…?” “రా అమ్మా ప్రయాణం బాగా జరిగిందా..పల్లెల్లో సంబంధాలు ఎలా ఉన్నాయి…అత్త వాళ్ళు కులాసేనా….ఇన్ని రోజులు సరదాగా గడిపావా….” “ఔనమ్మా చాలా బావుండే ఇంకో కొద్ది రోజుల ఉంటే బావుండు అనిపించింది ఇంతలోనే రమ్మన్నారు ఎందుకు అమ్మా అని గదిలోకి వెళ్ళింది…”

తరుణ్ చెప్పిన షాకింగ్ నిజాలు తలుచుకుంటే చరణ్ మనసులో అల్లకల్లోలంగా ఉంది,తన మనసులో ఇంతవరకు ఎవరికి చోటు ఇవ్వలేదు. అలాంటి ది ఆ అమ్మాయి ని చూడగానే ఎంతో సంతోషం కలిగింది ఈ విషయాలు ఫ్రెండ్స్ తో పంచుకుంటూ స్వాంతన పొందుతుంటే రవి ఇలా అంటున్నారు…”ఒరేయ్ చరణ్ అమ్మాయి మనసులో స్తానం కలిగితే ఇవన్నీ కాలణాలు కావు కదరా వాళ్ళంతా ఆస్తి లేకున్నా నీకంటూ ఓ జాబ్ ఉంది కదరా…కావల్సింది అమ్మాయి ని ప్రేమగా చూసుకుంటాననే నమ్మకం తనకు కలిగించు తర్వాత అన్ని సర్దుకుంటాయి నా మాట వినరా..” “ఏమో రా ప్రేమించడానికి రెండు మనసులు చాలు కాని పెళ్ళి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కలవాలి,నా మనసులో మాట చెప్పిన తర్వాత తను నో అంటే భరించలేనురా..
నీదన్నదేనాడు చేజారి పోదు లేదంటే అది నీకు దక్కేది కాదు అనుకుంటా…” ఆపరా నీ వేదాంతం అని రవి అక్కడ నుంచి వెళ్ళి పోయారు…

“హరీ అని, ఉమ పిలవడంతో హాల్లోకి వచ్చింది ఏంటమ్మా…?”పెళ్ళి పై నీ అభిప్రాయం ఎంటీ …? “ఎందుకు అమ్మా…?” “నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేశారటా నీ ఉద్ధేశ్యం చెపితే సెట్ చేద్దాం అంటున్నారు, దీని విషయమే మాట్లాడాలని ఇంత త్వరగా రమ్మని చెప్పారు…” “ఇప్పుడే నాకు పెళ్ళి ఏంటమ్మా ఇంకొన్ని రోజులు జాబ్ చేశాక ఆలోచిస్తా నాన్నగారి తో చెప్పమ్మా…’

“ఇంతలో మార్కెట్ నుంచి వస్తున్న నాన్న గమనించి హరీ తను మంచి అబ్బాయి మనకు బాగా తెలిసిన వారే నీ జీవితం బావుంటుంది ఒకసారి చూస్తే నువు ఒప్పేసుకుంటావని నాన్న ప్రయత్నం చేశారు” “ఐనా హరి మనసు అంగీకరించలేదు అలాగని నాన్న మాట కాదనలేక అక్కడ నుంచి.వెళ్ళి పోయింది…” “ఏమండీ హరి కి ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేనట్టుది వదిలేయండి… నువు ఊరుకో ఉమా తను ఒప్పుకుంటేనే చేద్దాం…

హరి మనసులో ఆందోళన నాన్న మాట కాదనలేదు ఒప్పుకోవాలంటే ఇష్టం లేదు ఏం చేయాలోనని ఆలోచన చేస్తూ చివరకు ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకుంది నాన్న ఆలోచన నాకు ద్రోహం చేయదు ఒకసారి అబ్బాయి ని చూస్తే నచ్చితే ఆలోచిద్దాం లేకుంటే వదిలేద్దాం…నాన్న మనసు నొప్పించలేం కదా అనీ నిదుర లోకి జారుకుంది.. …

“మరునాడు ఉదయమే హరీ.. అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు మనం అవకాశం ఇస్తే ఈ శుక్రవారం వస్తా అంటున్నారు. నువేం అంటావు…”సరే నాన్న మీ ఇష్టం అబ్బాయి నచ్చితే మీరు చెప్పినట్లే చేసుకుంటాని చెప్పింది..”

అమ్మాయి చెప్పిన మాట విన్న యాదగిరి అబ్బాయి వాళ్ళకు కబురు చేశారు వాళ్ళు అన్ని నచ్చితే వీలైతే నిశ్చితార్థం కూడా చేసేద్దాం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు, ముందు అమ్మాయి ని చూశాకా మాట్లాడాదాం అని వాళ్ళకు శుక్రవారం రమ్మని చెప్పారు,
ఉమా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారని అందుకు కావలసిన ఏర్పాట్లు చూడాలని హడావుడి చేశారు,

“ఏరా మహేష్ రేపు యాదగిరి అంకుల్ వాళ్శ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ అమ్మాయి హరి నీకు తెలుసు కదా తను నీకు నచ్చితే నీ లైఫ్ పార్టనర్ చేసేందుకు మేము ఒకే, నీ మనసులో ఎవరైనా ఉన్నారా ఈ సంబంధం ఓకే నా…అని శ్రీకర్ తన కొడుకు తో అన్నారు. “ఇప్పటివరకు నా మనసులో ఎవరు లేరు మీరు చెప్పినట్లే చూద్దాం నాన్నా.”

“యాదగిరి అంకుల్ వాళ్ళు చాలా ధనవంతులు ఒకరే అమ్మాయి నా లైఫ్ సెట్ ఐనట్లే అమ్మాయి ఎలా ఉన్నా అభ్యంతరం చెప్పొద్దూ అనే నిర్ణయానికి వచ్చారు మహేష్, ఆ అమ్మాయి తో తన జీవితం ఊహించుకుంటూ సంతోషంగా ఉన్నారు…

“ఉమా అబ్బాయి వాళ్ళు వచ్చే టైం ఐంది అమ్మాయి రెడీగా ఉందా…..” “ఔనండీ రడీ గానే ఉంది అంటుండగానే శ్రీకర్ వాళ్ళు వచ్చేశారు…” “ఇల్లు చాలా విశాలంగా ఉంది ఎంతైనా ఈ ఇంటికి అల్లుడు కావాలంటే రాసిపెట్టి ఉండాలి అమ్మాయి ఎలా ఉన్నా ఆస్తి కోసమైనా తనను ఒప్పుకోవాలి ఈ ఆస్తికి వా‌రసున్ని కావాలని పిక్స్ అయ్యారు మహేష్.. ” “ఇంతలోనే బ్లూ కలర్ చుడీదార్ లో కాఫీ తీసుకుని హరీ వచ్చేసింది” “మా అమ్మాయి హరిణాక్షి అని పరిచయం చేసింది ఉమా” “పేరుకు తగినట్లు గా చాలా అందంగా ఉంది అని కాబోయే కోడలు ను చూస్తూ మురిసిపోయింది సరళ” “అరవిందం లా అరుదెంచిన అమ్మాయి అందంచూస్తూ ఊహలలో విహరిస్తున్నా మహేష్ ను చూసి బాబు అమ్మాయి తో ఏమైనా మాట్లాడాలంటే చెప్పు అని యాదగిరి అనడంతో ఈ లోకంలోకి వచ్చారు మహేశ్…” “నో అంకుల్ మాట్లాడేది ఏం లేదు అమ్మాయి నాకు ఒకే మీ అమ్మాయి అభిప్రాయం కనుకోండి”

“నవ మన్మథుడు లాంటి అందంతో మనసు దోచుకున్న మహేష్ ను చూసి హరి కి కూడా తగిన జోడులా ఉన్నారని అందరు అనుకోవడంతో రిజక్ట్ చేయడానికి రీజన్స్ ఏమి కనిపించలేదు హరికి సిగ్గుల మొగ్గలు బుగ్గల పై వికసిస్తుంటే తల కిందికి దించుకుంది…” ఏం కోడలు పిల్లా మా కోడలు నలుగురి లో తల ఎత్తుకు నిలబడాలి తలదించుకోవద్దూ అంటూనే ఇంతకీ మా అబ్బాయి నీకు నచ్చారా అని అడిగింది,సరళ” “ఆ అమ్మాయి సిగ్గు చూస్తే తెలియడం లేదా అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు మనం ముందు గా అనుకున్నట్లుగా అబ్బాయి ని మీ వాన్ని అమ్మాయి ని మా ఇంటి కోడలు ను చేసుకుందామని యాదగిరి వాళ్ళు కార్యక్రమం కానిచ్చారు..”

“ఏరా మహేష్ నీ క్యారెక్టర్ ఏంట్రా నాకు అర్థం కావడంలేదు, కొన్ని రోజుల మమత తో స్నేహం చేశావు, తర్వాత ప్రియాంక తో లవ్ అన్నావు,సాయిప్రియ పై అభిమానం అన్నావు,దీపికా అంటే ఇష్టం అన్నావు,ఇప్పుడు ఎవరు ఊహించనట్లుగా హరి తో ఎంగేజ్మెంట్ ఏంట్రా, ఆడపిల్లలంటే ఆటబొమ్మలు అనుకుంటున్నావా నీ దృష్టి లో ఇవేవి తెలియని హరి నిన్ను ఎంతో ఆరాధిస్తోందిరా” అని రవి అనడంతో “రేయ్ ఫూల్ పదిమంది ని చూడాలి ఐదుగురిని అభిమానించాలి ఇద్దరిని ప్రేమించాలి ఒకరితో జీవితం పంచుకోవాలి ఇదేరా లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలిరా అందం ఐశ్వర్యం కలిగి ఉన్న అద్భుత సౌందర్య రాశి రా తను నా హృదయం లో దేవతలా పూజిస్తా హరిని .” ఈ మాటలకేం కాని ఆస్తికోసం తనకు అన్యాయం చేయకురా అమాయకత్వం తో నిను నమ్మింది అని రవి అక్కడ నుండి వెళ్ళిపోయారు.

అమ్మాయి అబ్బాయి ఇద్దరు సంతోషంగా ఉన్నారు,ఒకరి ఫోన్ నంబర్ ఒకరు తీసుకున్నారు రోజు గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకోవడమే వీలు దొరికినప్పుడల్లా కలుసుకోవడం ఇలా ఆనందంగా సాగిపోతుంది వాళ్ళ ప్రేమ ప్రయాణం.. హరి నువు చాలా అందంగా ఉంటావు నాకు దక్కడమనేది నిజంగా నా అదృష్టం ఇంతటి అందం నా స్వంతం అవడానికి ఇంకా ఆలస్యం చేయాలనిపించడం లేదు మన కలయిక శీఘ్రం చేయాలి ఈ ఎడబాటు తట్టుకోలేక పోతున్న త్వరలోనే ముహూర్తం పెట్టించమని మీ వారితో చెప్పు ప్లీజ్……”ఏంటీ మహీ నేనెలా అంటాను నేను కావాలని తొందర పడుతున్నారు కదా నువ్వే అడుగు…”అమ్మో నేను అడగలేను భయం హరి.” ఎందుకు మహీ భయపడితే నీ కోరిక తీరదు కదా….” హ్మ్ కోరిక తీరడానికి ఈ దేవత కరుణిస్తే చాలు అడగాల్సిన అవసరం లేదు..” “ఏంటీ మీరనేది…” “ఈ ముద్దుగుమ్మ ముద్దుకోసం ఈ సుందరాంగి పొందుకోసం నీ అందాల సెలయేరు లో ఆనందంగా విహరించాలని ఆశ కలుగుతుంది అర్థం చేసుకుని అవకాశం ఇవ్వరాదా… ” “ఆశా.. అదేం కుదరదు అన్ని పెళ్ళి తర్వాతనే..” “నీకు తెలియదు హరి ఎంగేజ్మెంట్ ఐతే సగం పెళ్ళి ఐనట్లు దీనిలాగానే అది కూడా సగం…” “ఇదిగో ఇలా మాట్లాడావంటే ఇక్కడ నుంచి వెళ్ళి పోతా ఇవన్నీ నాకు నచ్చవు” “నాకు తెలుసులే హరి ఆడవారి మాటలకు అర్థాలు వేరు కదా..” అదేం లేదు నేను వెళుతున్నా….హరి హరి ప్లీజ్ ఆగవే…. “అనగానే ఆనందం తో అక్కడ నుంచి వెళుతు మహేష్ కి నా పై ఎంత ప్రేమ ఉందోనని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది హరి…

“తరుణ్ ద్వారా తన నం తెలుసుకుంటే బావుండు నా ప్రేమ విషయం చెప్పకపోయినా జస్ట్ ఫ్రెండ్స్ లా ఫీల్ ఐతే బావుండేది ఇప్పటికే 60 రోజులు ఔతుంది హరి అందం నా హృదయం లో ముద్రితమైంది అనే ఆలోచనలు తో తన జ్ఞాపకాలు వెంటాడుతుంటే విరహ ప్రేమికుడిలా మారి పోయాడు చరణ్, వీని వాలకం చూసిన ఫ్రెండ్స్ ఆరాతీయడంతో అసలు విషయం చెప్పేశాడు, చరణ్ ప్రేమ లేని జీవితం వ్యర్థం రా తను ఒప్పుకుంటుందో లేదోనని భయంతో చెప్పలేదు కాని తన మనసులో నీపై ప్రేమ ఉందేమో నీకెలా తెలుస్తుందిరా అని రవి అంటుంటే అలా కాదురా వయసులో కూడా తను పెద్దది అందుకే ఆలోచన చేశాను…,”మనసెరిగిన మనిషి తోడుంటే వయస్సు పట్టింపులు ఏముండవురా ఏదేమైనా ఆ అమ్మాయిని మిస్ చేసుకున్నావురా బ్యాడ్లక్…. ఇప్పటికైనా తన నం తీసుకోరా చరణ్ అని రవి సలహా ఇవ్వడంతో ఆలోచన లో పడ్డారు చరణ్..”

“నిశ్చితార్థం తర్వాత ఎక్కువ రోజులు ఉంచడం సరైనది కాదు ఆడపెళ్ళి వారం మనకే తొందర ఉండాలని శ్రీకర్ కి ఫోన్ చేశారు యాదగిరి, బావా …ముహూర్తం పెట్టుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు అనగానే ఇంకా ఆలస్యం ఎందుకు బావా నేనే ఫోన్ చేయాలి అనుకున్న కాని ఆడ పిల్ల వాళ్ళకు పనులు ఎక్కువగా ఉంటాయని మీ చెల్లిఅనడంతో ఆగిపోయాను మీకు వీలైతే రేపే వచ్చేయండి”. అలాగే బావా అని ఫోన్ పెట్టేశారు రమణ”

“ఉమా రేపు రమ్మన్నారు బావ వాళ్ళు ఎవరినైనా తోడుగా తీసుకు వెళదాం…”
ఇంత తక్కువ టైం లో తోడు ఎవరు దొరుకుతారు మనమే వెళదామని ఉమ ప్రయాణానికి సిద్ధం అయింది, అనుకున్నట్లుగానే ఇద్దరు జాతకాలు పరిశీలించి మాఘ శుద్ధ పంచమి శుక్రవారం సరస్వతి మాతా పుట్టినరోజు బ్రహ్మండమైన ముహూర్తం నిర్ణయించారు సిద్ధాంతి, ఇరువైపులా వారికి నచ్చడంతో అదే ముహూర్తం ఖరారు చేసుకుని ఇంటికి బయళుదేరారు… ..

“ఆడపిల్ల పెళ్ళి అంటే మామూలు విషయం కాదు కదా చాలా పనులు ఉంటాయి పసుపు కొమ్మలు నొక్కించడం, పప్పు రౌతు పెట్టడం,పెళ్ళి బట్టలు కొనడం ఆడవాళ్ళ పని, కార్డులు పంపించడం, పంక్షన్ హాల్ బుక్ చేయడం, ఇలాంటి పనులు బిజీగా ఉండడంతో కష్టం గా అనిపించి తరుణ్ ని సహాయకరంగా రమ్మని చెప్పారు యాదగిరి తరుణ్ కూడా రావడం పనులు పూర్తి చేసుకోవడం అన్ని క్రమక్రమంగా జరిగిపోయాయ, “పెళ్లికి ఇంకా మూడురోజులు టైం ఉంది పనులన్నీ ఐపోయాయి కదా నేను ఊరెళ్ళి అమ్మవాళ్ళతో కలిసి పెళ్ళి ముందు రోజే ఇక్కడ ఉంటానని తరుణ్ యాదగిరి అనుమతి తీసుకుని వెళ్ళిపోయారు….

“ఇంతలో శ్రీకర్ నుంచి ఫోన్ మీ అల్లుడు బ్రాస్లెట్ తో పాటు ఇంకో రెండు లక్షల రూపాయలు కట్నం కావాలంటున్నారు బావా,” దానిదేముంది బావా మా అల్లుడు మేము ఇచ్చుకుంటాంలే కాని బ్రాస్లెట్ ఐతే ఇప్పుడు ఇస్తా, ఎప్పటికైనా ఆస్తి తనదె కదా ఎమౌంటు పెళ్లి తర్వాత ఇచ్చేస్తా బావా,” సరే మీ అల్లునితో చెపుతాను..

ఉమా వియ్యంకుని వాళ్ళు ఫోన్ చేశారు అల్లునికి బ్రాస్లెట్, రెండులక్షల రూపాయలు కావాలటా ఏం చేద్దాం అన్న యాదగిరి మాటలకు ఉమా విస్తుపోయి ఏంటండీ ఇది నిశ్చితార్థం రోజే అమ్మాయి కి అత్తారింట్లో గౌరవం తగ్గకూడదని పది లక్షల కట్నం పాతిక తులాల బంగారం మన ఇష్టం తో ఒప్పుకున్నాం కదా ఇప్పుడు ఇలా అంటే ఏం చేసేది ?మీరు ఏమన్నారు మరి,
బ్రాస్లెట్ వరకు ఇపుడు ఇస్తాం డబ్బులు వారం తర్వాత సర్దుబాటు చేస్తాం అని చెప్పాను, అసలే ఖర్చులు ఉంటే వారం లో ఎలా ఇస్తారండి…
ఏదో ఓటి చేయాలి ఉమా ఈ ఆస్తి మొత్తం అమ్మాయి కే కదా తర్వాత ఇచ్చేది ముందే ఇస్తున్నాం అంతే, ఈ మాటలు విన్న హరి బాధతో ఏంటీ డాడి ఇది పెళ్లికి ఒక రోజు ముందు ఇలా అంటే రేపు జీవితాంతం డబ్బు కోసం ఎంత వేధిస్తారో నాకీ పెళ్ళి వద్దు,మీరు ఇబ్బందులు పడవద్దు…హరి నీకు తెలియదు పీటల మీది పెళ్లి ఆగిపోయింది అంటే సమాజంలో అవమానాలు భరించాలి దేనికైనా మేమున్నాం కదా అమ్మ అని ఓదార్చాడు యాదగిరి.

“హరి కి పెళ్ళి పిక్స్ ఐన విషయం చరణ్ బావకి తెలుసా తెలియకపోతే చెప్పాలి లేదంటే తెలిస్తే తరువాత బాధ పడుతారు అందుకు కారణం నేను కాకూడదు అని తరుణ్ ఆలోచించి చరణ్ కి కాంటాక్ట్ అయ్యాడు, హలో బావా హరి అక్క కి పెళ్ళి సెట్ ఐంది మీకు తెలుసా…” “ఔను తెలుసూ” “మరి మీకేం బాధ లేదా..” “అనుకున్నవన్ని దక్కాలనే రూల్ ఏముంది బాధపడీనా ఫలితం లేని దానికి బాధపడడం దేనికి…” “ఏంటీ బావా వేదాంతం వల్లిస్తున్నారు‌, పెళ్లికి వస్తారాలేదా మరి ” ”టైం దొరికితే చూస్తా..

“బావ ప్రేమిస్తున్నారనే విషయం హరి అక్క తో చెప్పకుండా నేనే తప్పు చేశాను చెపితే తను అంగీకరించేదమో. ఎంతో బాధ్యత గా బావ చెప్పిన పని చేయలేకపోయానని బాధపడ్డారు తరుణ్.

హరి పెళ్ళి కూతురి గెటప్ లో కుంధనపుబొమ్మలా చాలా అందంగా ఉన్నావు నా దిష్టి తగిలేలా ఉంది అని కాటుక తీసి బుగ్గన దిష్టి చుక్క పెట్టి, హరివిల్లు లాంటి కనుబొమలు మధ్య అరుణిమ తో కళ్యాణ తిలకం దిద్ది పాదాలకు పారాణి అద్దింది రమా..పూసిన తంగేడు లా ఒళ్ళంతా నగలతో అరవిసిన హరి అందం చూసి నింగిలోన చందమామే మబ్బు చాటు తలదాచుకుంది,..

అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పెళ్లికి వరస తెలియని బంధువులు వరదలుగా వచ్చారు,యాదగిరి కి ఉన్న పరిచయాలు చాలా పెద్దవి ఒక్కగానొక్క కూతురు పెళ్ళి తరతరాలకు గుర్తుండి పోయేలా ఘనంగా జరిపించి అత్తారింటికి పంపించారు,

నవ దంపతులను చూస్తూ బంధువులు అందరు మురిసిపోయారు‌,మిగిలిన కార్యక్రమాలకు ముహూర్తం పెట్టించి మరుసటి రోజు రాత్రికి ఏర్పాట్లు చేశారు, ఎన్నో ఆశలతో పడక గదిలోకి వెళ్ళిన సుమను ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు మహేష్, నవయవ్వన నాయకి నడు ఒంపులలొనాజూకుగా స్పర్శ చేస్తూ,మురిపమైనా భావాలతో ముద్దులలో మంచేస్తూ,రెండు హృదయాలను రాగరంజితం చేసే రతి వీణలు మధురంగా శృతిచేస్తుంటే ఈ క్షణం ఇలా శాశ్వతం ఐపోతే బావుండు అనేంతగా ఉంది అక్కడ వాతావరణం,తొలిసారిగా పురుష స్పర్శ తో హరి వయస్సు పురివిప్పిన మయూరంలా నాట్యమాడింది ఆ అనుభవంలో మహేష్ కౌగిలిలో ముగ్ధురాలై ఉన్న హరి, మహేష్ ఊహాతీతమాటలతో ఒక్కసారిగా బిత్తరపోయి దూరంగా జరిగింది,” హరి మన పెళ్ళి లో పింక్ కలర్ డ్రెస్ లో నీ ప్రక్కనే తోడుగా కూర్చున్న అమ్మాయి ఎవరు చాలా అందంగా ఉంది, ఎంతగా నచ్చిందంటే ఈ రేయిలో ఈ పానుపు పై తానుంటే బావుండూ అనేంతగా” ఏంటండీ ఆ మాటలు ఈ టైంలో మాట్లాడాల్సినవేనా..”
“ఏంటీ హరి ముందే అనుభవం ఉన్నదానిలా ఈ టైంలో అంటున్నావ్ ఎవరితో అనుభవించావు చెప్పు..” ఈ మాటలతో బాధపడుతున్న హరి ఇంతలా దగ్గర తీసుకుని ఒక్కసారిగా దూరం చేయడం నాకు ఇబ్బంది ని కలిగించింది, మన ఇద్దరి మధ్యలో ఈ సంధర్భంగా వేరే వాళ్ళ ప్రస్తావన ఎందుకు అని నా అభిప్రాయం.”,” ఆ అమ్మాయి నీకంటే బావుందని తనతో ఈ రాత్రి గడిపితే బావుండని నా అభిప్రాయం చెప్పాను మనసులో మాట చెప్పడం తప్పెలా ఔతుంది.” గతంలో వేరు ఇప్పుడు మనం ఇద్దరం భార్యాభర్తలం ఒకరికి ఒకరు ప్రాణం మనమధ్య వేరే వాటికి చోటీయవద్దు కదా,అదే వివాహబంధంలోని మాధుర్యం” ఓహ్ నీ సెంటిమెంట్ తగలెయ్యా అని మనసులో అనుకుని బయటికి కనపడకుండా ఆ రాత్రంతా శృంగారసీమలో జాగారం చేశారు…

ఉదయాత్పూర్వమే స్నానం చేసి తలకట్టుతో పూజాగది నుంచి బయటకు వస్తున్న కోడలుని చూస్తూ ఆనందించింది సరళ,అమ్మా హరి ఇలా రా, చూడమ్మా ఇకనుంచి ఇది నీ ఇళ్ళు మేమమంతా నీ వాళ్ళమే మీ అమ్మ నాన్నలంతా ప్రేమగా కాకపోయినా దాదాపుగా అలా చూసుకుంటాం,పాతికేళ్ళు పెంచిన మా అబ్బాయిని నీ చేతిలో పెట్టాం వాని బాగోగులు మొత్తం నీవె ఏడాది తిరిగేలోగా మా మనుమని ఇస్తె చాలు, వాని ఆలనాపాలనా లో ఆనందంగా మా శేష జీవితం గడిపేస్తాం, అంటున్న అత్తయ్య మాటలతో ఆనందం కలిగినా రాత్రి సంఘటన తో ఆవిరై పోయింది,చెప్పాలి అనుకుంది కాని తప్పు గా అనుకుంటారేమోనని ఆలోచించీ చిరునవ్వు తో అక్కడ నుంచి వంట గదిలోకి వెళ్ళింద..

కాఫీ కలుపుకొని భర్త దగరకు వెళ్ళగానే ఒక్కసారిగా గట్టిగా కౌగలించుకొని ముద్దు చేయడంతో తనువంతా పులకరించింది,రెండు భిన్నమైన శరీరాల సంగమం లో ఉన్న ఆనందం వర్ఢణాతీతం,ప్రపంచంలో ఉన్న ప్రేమంతా వీరి కౌగిలిలో బంధీగా ఉంది ఆ మాధుర్యాన్ని మరోసారి చవి చూసిన రాత్రి జరిగిన విషయాలన్ని మర్చిపోయింది..అబ్బా వదలండి ఎవరైనా చూస్తారు..” ఇకడ మనం తప్ప ఎవరు లేరు ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నని నీ వస్త్రాలే అవి తీసేస్తే ఇంకా ఆనందం” ఛీ పొండి అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.

మహేష్ రెడీ అయి ఆఫీసు కి వెళ్ళారు సాయంత్రం త్వరగా వచ్చి హరిని బయటకు తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి పరిచయం చేశారు అందరితో కలిసిపోయింది హరి, కాని మళ్ళీ రాత్రి అదే తంతు ఇలా మూడు రాత్రులు మూడు యుగాలుగా గడిచింది, మరుసటి రోజు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళారు అమ్మ తో చెప్పాలనిపించినా తొందరపాటు తగదని ఊరుకుంది, ఇంతలో హరి వాళ్ళ బాబాయ్ కొడుకు ప్రకాష్ ఫొన్ చేసి పెళ్లికి రానందుకు sry చెప్పారు హరి కి ప్రకాష్ అన్నయ్య కావడంతో ఉన్న చనువుతో కాస్తా మందలింపుగా మాట్లాడింది ,ఆ మాటలు విన్న మహేష్ కి అనుమానం కలిగింది ఫోన్ లో సంభాషణలు ఐపోగానె విసురుగా అక్కడ నుంచి వెళ్లిన మహేష్ ను చూసి భయమేసింది హరి కి,భయం కనపడకుండా రెండ్రోజులు గడిపి వచ్చేశారు, ఆ రోజు రాత్రి మహేష్ నిజస్వరూపం హరికి తెలిసింది,ఇతనిలో మార్పు రాదు ఏంచేయాలి ఎలా భరించాలని ఆలోచించింది, ఎంతైనా ఆడపిల్ల అణుకువగా ఉండాలని మూడునెలలుగా భర్త లో మార్పు కోసం ఎదురుచూసింది తేడా కనిపించకపోవడంతో పుట్టింటికి వచ్చేసింది విషయం తెలుసుకున్న యాదగిరి,కిషోర్ వద్దంటున్నా వినకుండా తొందరపడి పెళ్ళి చేశాను అమ్మాయి జీవితం ఇలా అయింది అని బాధతో కిషోర్ కి కబురు చేశారు,తన సలహా తో అమ్మాయి కి విడాకులు ఇప్పించాలని నిర్ణయం చేసుకున్నారు, మహేష్ వాళ్ళ అమ్మనాన్నలు ఎంత చెప్పిన మార్పు రాకపోవడంతో నవదంపతుల జంట నాలుగు నెలలకే విడిపోయింది.

ప్రేమ విషయం మనసులో దాచుకున్న చరణ్ కి ఒకసారి తన ఫోటో చూడాలనిపించగానే ఫేస్బుక్ ఓపెన్ చేశారు ఎప్పటినుంచీ ఉందో హాయ్, హౌ ఆర్ యూ అని హరి మెసేజ్ చూడగానే చరణ్ కి రెక్కలు వచ్చాయి కాలక్రమంలో వాళ్ళ ఫేస్బుక్ కాలక్షేపం వాట్సాప్ దాకా వచ్చింది…

చరణ్ మనసులో తనను అభిమానిస్తున్న విషయం చెప్పాలనుకోని ఓ రోజు హరి తో నా పై నీ అభిప్రాయం ఏంటని అడిగారు,”మీరు చాలా అందంగా ఉంటారు మీరంటే చాలా అభిమానం, అనుకోకుండా జరిగిన మన పరిచయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది మీ రంటే మా ఇంట్లో మంచి అభిప్రాయం ఉంది అని చెప్పింది” ఈ మాటలు విన్న. చరణ్ ఆనందం కలగడంతో ఇంకాస్తా దగ్గరకు వెళ్ళి మీ వివాహనికి చెప్పలేదు, మీ మ్యారిడ్ లైఫ్ ఎలా ఉంది అనడంతో ఏం చెప్పాలో తెలియకా రెండు రోజులైనా రప్లై ఇవ్వలేదు, ఏం జరిగిందో తలుసుకోవాలని తరుణ్ కి ఫోన్ చేశారు,

తరుణ్ ద్వారా విషయం తెలుసుకున్న చరణ్ తను హరి ను ఇష్టపడిన విషయం చెప్పకుండా మనసులో దాచుకున్నందుకే ఇలా జరిగిందని బాధపడ్డారు, ఎంతైనా నేను ప్రేమించిన అమ్మాయి బాధలను తొలగించి బాసటగా నిలవాలని
నిర్ణయించుకున్నారు,తరుణ్ ఇప్పుడు హరి పరిస్థితి ఏంటి అనుకోకుండా ఇలా జరిగింది కదా గతాన్ని తలుచుకుంటూ బాధపడే కన్నా కొత్త జీవితం మొదలుపెడితే బావుంటుంది కదా….”ఔనూ బావా నేను ఆ విషయమే ఆలోచిస్తున్నా మీరు ఒకే అంటారా…” నా విషయం పక్కన పెట్టు ముందు హరి అభిప్రాయం కనుకోవాలి, “ఇప్పుడు నేను చెప్పడం సరీకాదు బావా ఇప్పటికే ఒకరిని నమ్మి మోసపోయింది, మళ్ళీ మధ్యవర్తిత్వం తో తనకు క్లారిటీ రాదు మీరే కలసి తనకు విషయం చెప్పండి ఏర్పాట్లు నేను చేస్తా.”

“ఏమండీ యాదగిరి అన్నయ్య వాళ్ళకు ఫోన్ చేసి హరిని పంపించమనండి పాపం పెళ్ళి తర్వాత ఏ ముచ్చట తీరకుండానే ఇల్లు చేరింది ఆ బాధలో తను ఏం చేసుకుంటుందో కాస్తా స్తానమార్పిడి ఐనట్లు గా ఉంటుంది ఇక్కడ మన పిల్లలతో గడిపితే జరిగిన విషయం మరుగున పడుతుంది ఏమంటారు అనే లత మాటకు సరే అని యాదగిరి వాళ్ళతో మాట్లాడి హరిని ఇంటికి రప్పించారు కిషోర్,

ఇదే మంచి తరుణం అని ఆలోచించిన తరుణ్, చరణ్ బావకు ఫోన్ బావా హరి అక్కా ఇక్కడి కి వస్తుంది రెండ్రోజుల తర్వాత మీరు వీలుచేసుకోని రండి ఇక్కడ అమ్మ వాళ్ళ సమక్షంలో మీ విషయం క్లియర్ చేద్దాం అని చెప్పడంతో చరణ్ వాళ్ళ చెల్లి వచ్చేశారు..

“హాయ్ హరి బావున్నారా…ఏంటీ రిప్లై లేదు నేను చరణ్ ని మర్చిపోయారా..! పెళ్ళి తర్వాత ఫ్రెండ్స్ ని మర్చిపోతారా ఎవరైనా… “హ్మ్. నిన్ను చంపేస్తా…నేను ఏ స్థితిలో ఉన్నా మీరేం మాట్లాడుతున్నారని మూడిగా అంది హరి…” హే హరి మా అన్నయ్య నీ స్థితి పరిస్థితి మార్చడానికే వచ్చారు.
Don’t worry all hpys,అలా సరదాగా బయటకు వెళదాం పదా అని పార్కు కి వెళ్ళారు, అక్కడ చరణ్ హరికి బ్రెయిన్ వాష్ కొత్త జీవితం పై ఆశలు కలిగించి ఇప్పటికే నువ్వంటే నాకు ప్రాణం ఒప్పుకుంటే నీకు ఓ మంచి జీవితాన్ని ఇస్తాననే నమ్మకం కలిగించారు, కాని హరి మనసులో ఏదో అలజడి ఏంచేయాలి చరణ్ మంచివారే కాని నేను చేసుకోవడం ఎలా అనే ఆలోచన లో ఎటు తేల్చుకోలేక కాస్తా టైం కావాలని చెప్పి ఇంటికి వచ్చేసింది,

గతం తాలూకు జ్ఞాపకాలు తలుచుకుంటూ గదిలో మూడిగా కూర్చుంది హరిణి,
నాన్న మాటకు ఎదురు చెప్పకుండా గౌరవంతో,
తను ఎలాంటి వారో తెలుసుకోకుండా పెళ్ళి చేసుకున్నందుకు చాలా బాధ పడింది,అన్ని విషయాల లో జాగ్రత్తగా ఉండే నేను ఈ విషయంలో తొందరపడడం ఏంటోనని ఆలోచిస్తూ కన్నీరు కారుస్తుంటే గదిలోకి వచ్చింది లతా…హరీ ఏంటమ్మా ఇది గతం గతః దాని గురించి ఆలోచిస్తే భవిష్యత్ నిర్మాణం సరిగా జరగదు అదో పీడకలలా మరచిపోయి నువు కొత్త జీవితం మొదలు పెట్టూ ,నిను సంతోషంగా ఉంచడం కోసమే నిను ఇక్కడి కి రమ్మన్నాను ఈ బాధలన్నీ మరిచిపోయి ఆనందంగా ఉండమ్మా అని బ్రతిమాలింది,”ఇంతలా తన గురించి బాధపడుతున్న లత ను చూసి కాస్త బాధలో నుండి తేరుకుంది. ఇప్పటికి నను అభిమానిస్తున్నా చరణ్ గురించి కాస్తా ఆలోచించాలి కల్మషం లేని మనస్తత్వం తనది, అన్ని విధాలా నాకు సరిపోయేవారే కాని ఒకరి ద్వారా మోసపోయిన నేను మళ్ళీ తనను ఎలా నమ్మాలి కొద్ది రోజులు అబ్జర్వేషన్ లో ఉంచితే తన వ్యక్తిత్వం అర్థం ఔతుందనే నిర్ణయానీకి వచ్చింది.

ఎవరి స్వార్థం వలనో హరి జీవితం అన్యాయం ఐంది తనకు ఎలాగైనా ఆనందంగా ఉంచాలి లేకపోతే ఇన్నిరోజులు తనపై నేను పెంచుకున్న ప్రేమకు అర్థం లేదు తనను ఎలా మోటివేట్ చేస్తే బావుంటుంది అని ఆలోచన లో ఉన్నారు చరణ్,

“హరీ ఇవాళ శుక్రవారం అలా గుడికి వెళ్ళి వస్తే నీ మనసున కప్పిన మబ్బులు తొలగిపోతాయి రడీ గా ఉండమ్మా అని లత చెప్పడంతో పక్క గదిలో ఉన్న చరణ్ నా ప్రేమ కు దైవసన్నిధిలో మార్గం సులభమౌతుందని తను కూడా రడి అయ్యారు,అందరూ వెళ్ళబోతుంటే ఎదురింటి పంకజం వచ్చీ ఇవాళ మా ఇంట్లో వైభవ లక్ష్మీ వ్రతం ఉంది వదినా వాయినానికి రమ్మనగానే లతా వెళ్ళిపోయింది, చరణ్ ,తరుణ్ సుమ, హరి గుడికి వెళ్ళారు,

పూజారి గారు మా పేరు మీద అర్చన చేయండి అని చెప్పారు,… “అమ్మా ఇవాళ చాలా మంచిరోజ నదిలో స్నానం చేసి తడి వస్త్రాలతో అమ్మవారి ని దర్శించుంకుంటే కోరికలు తీరుతాయి చెప్పడం తో వెళ్ళి స్నానం చేసి వస్తుంది హరి”

కలబోసిన కౌగిలిలో విరబూసిన యవ్వనం చెలియ కంటి మెరుపులలో దివితారల సోయగం జత గుండెల శబ్ధంలో జతులాడగా జ్ఞాపకం మలకెత్తిన మోహంలో మొదలైనది వ్యామోహం
ఉల్లిపొరలాంటి చీరె చాటున ఊరిస్తున్న ఆందాలు, ముంగురుల తెరమాటున మురిపిస్తున్న ముంగిరులు, తడిసిన తనువును చూస్తుంటే, మనసున మీటే మన్మథ బాణాలు గుండెల్లో గుచ్చుకుంటుంటె మందిరంలో మనసు చలించడం సరికాదని అక్కడ నుంచి బయటకు వచ్చారు చరణ్, “తన మనసులోని కొరిక తీరాలని భక్తి తో అర్చన చేయించుకోని ఇంటికి వచ్చేశారు”

”అత్తా చరణ్ ఎలాంటి వారు….” “ఎందుకు హరి చాలా మంచి అబ్బాయి, ధనానికి పేదవారైనా గుణానికి శ్రీమంతుడు. రమణ అన్నయ్య వాళ్ళు మాకు చాలాకాలంగా తెలుసు, ఇలా అడుగుతున్నావేంటమ్మా”
తను ఇప్పటికీ నను ఇష్టపడుతున్నారటా నాకు నచ్చితే కొత్త జీవితం ఇస్తా నంటున్నారు అంతమంచి మనిషికి నేను సరిపోలేను కదా అని ఆలోచిస్తున్నా …మా పెళ్ళి తర్వాత పెళ్ళి మీద నమ్మకం పోయింది అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్నావాడే ఇలా చేశారు మళ్ళీ ఎలా నమ్మాలో తెలియడం లేదు…హరీ నీకు చాలా భవిష్యత్ ఉంది ఈ ఒక్కరోజు తో జీవితం ముగిసిపోదు నిన్ను ప్రేమించిన వారు దొరకడం అదృష్టం నాన్నగారి తో మేం మాట్లాడతాం నువు హ్యాపీ గా ఉండు అని హామి ఇచ్చింది లతా…

“నాన్న ఆ రోజు కిషోర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఒకమ్మాయి ని చూశాను నాకు చాలా బాగా నచ్చింది తనను పెళ్ళి చేసుకోవాలని ఉంది మీరేమంటారు అన్న చరణ్ మాటలకు” “కోపంతో రమా, ఏంటీ నీకు నచ్చగానే పెళ్ళి చేసేస్తామా,మేము చూడాల్సిన అవసరం లేదా,
పెళ్ళిచేయాలంటె అటెడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు అమ్మాయి నచ్చితే సరిపోతుందా….? అది కాదు అమ్మా, వాళ్ళు కిషోర్ అంకుల్ వాళ్ళ బంధువులే మీరు చూడండి అమ్మాయి నచ్చుతుంది, “బుద్ధిగా ప్రాక్టీసు చేసుకోకుండా ఈ ప్రేమ వెంట తిరగడమేంట్రా ప్రేమించి పెళ్ళి చేసుకున్న కాపురాలు సుఖంగా ఉండలే వురా ” ఏంటీ అమ్మా అలా అంటున్నారు పెద్దలూ కుదిర్చిన జంటలు ఎంతమంది విడిపోలేదు, ప్రేమించడం తప్పు కాదు నా ప్రేమను తనకు చెప్పకపోవడంతో ఇంత దారుణం జరిగింది అని కన్నీళ్లు కనిపించకుండా దాచేస్తూ మాట్లాడాడు,” అది గమనించిన రమణా ,రమా వాడు ఎంతలా ఇష్టపడ్డారో వాని గుండెలోని బాధ కరిగి కన్నీళ్లు గా ఉబికి వస్తుంది చూడండి, పిల్లలు సంతోషం గా ఉంటెనే కదా మన జీవితాలకు తృప్తి,ఆడవాళ్ళకు ఆడదే శత్రువు కాకూడదు అని చెప్పి చరణ్ ను తీసుకుని అక్కడ నుంచి వెళ్ళి పోయాడు రమణ..

“చరణ్ ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయి వివరాలు” “అమ్మాయి పేరు హరిణాక్షి, ఎంబీఏ చేసింది చాలా డబ్బు కలవారు ,ఒకరే కూతురు, చెల్లికి కూడా నచ్చింది మీరు ఒకసారి చూస్తేబావుంటుంది నాన్న…”ఇంతకీ నువు ఇష్టపడ్డ విషయం తనకు చెప్పావా…” అదే నేను చేసిన పొరపాటు ముందే చెపితే ఇలా జరగకపోతుండేది, “ఏం జరిగింది…” నా ప్రేమ విషయం తనకు తెలియక వాళ్ళ నాన్న వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంది, వానికి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయి ఈ కారణంగా రోజు డబ్బు కోసం తనని వేధించడంతో నాలుగు నెలలకే విడిపోయారు,
ఎంతైనా నేను ప్రేమించిన అమ్మాయిని సంతోషం గా ఉంచడం నా బాధ్యత కదా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా మీ అనుమతి కోసం ఆరాటపడుతున్నా…

“ఏంట్రా ఇది ఇంత జరిగాకా రెండో సంబంధాన్ని మీ అమ్మ ఎలా ఒప్పుకుంటుంది…” “ఏమో తెలియదు నేనైతే తనకు ఓ జీవితం ఇవ్వాలి అనుకుంటున్నా,కనిపెంచిన మీరే నా మనసు అర్థం చేసుకోకపోతే నా పెళ్ళి తర్వాత వచ్చే అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది” “అంటే ఏంటీ నీ ఉధ్దేశ్యం..?” నేను ఎవరిని పెళ్లి చేసుకున్న తనకు ఓ గార్డియన్ లా ఉంటా,అందుకు సిద్ధంగా ఉండే అమ్మాయి దొరికితే పెళ్ళి చేసుకుంటా, లేదంటే ఇలాగే ఉంటా, ఈ బాధలో నేను వేరె అమ్మాయి ని సంతోష పెట్టలేనని నాన్నగారితో కి చెప్పాడు…

ప్రేమించిన అమ్మాయిని సంతోషం గా ఉంచడం కోసం నీ జీవితం త్యాగం చేస్తున్నావంటే నీ ప్రేమ ను అర్థం చేసుకుంటానని బరోసా ఇచ్చారు ,

“రమా ఓ కన్నతల్లి లా అబ్బాయి మనసు అర్థం చేసుకోవే వాడు తనని ఎంతలా ప్రేమించాడో తనకు చెప్పకపోవడంతో నాన్న గారి మాటకోసం ఓ మూర్ఖుడిని పెళ్ళిచేసుకుని టార్చర్ బరించలేకా మూడునెలలకే విడాకులు తీసుకుందిటా,ఇది తెలిసిన వీడు తన ప్రేయసి సంతోషం కోసం సర్వం త్యాగం చేయాలనుకుంటున్నారు,” “ఔనా….!ఇతనో సంఘసంస్కర్త మరీ” ఎదుటివారిని సంతోష పెట్టడానికి మానవత్వం ఉంటే చాలమ్మా సంఘసంస్కర్త కావాలసిన పని లేదు,”

రమా…! మనము పాతకాలపు మనుషులం,ఈ జనరేషన్ పిల్లలు అలా కాదు, మన పెంపకం మంచిది కాబట్టి ఈ విషయాలు మన దాకా తెచ్చారు, ఇలా కాకుండా వాడు మరో మార్గం ఎంచుకుంటె ఏం చేసేవాళ్ళం, మనసుకు నచ్చినవారితో మనువు మధురంగా ఉంటుంది ….అలాగే చేసేద్దాం…”సరే మీ ఇష్టం”

“చూడరా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ఢయించబడతాయి అంటారు దేవుడు ఎప్పుడు తప్పు చేయడు ఆ అమ్మాయి నీకు దక్కాలని రాసి పెట్టారు అందుకే ఇలా జరిగింది మరేం అభ్యంతరం లేదు”
“నాన్న అన్నమాటతో ఆనందం రెట్టింపు ఐంది ”

రమా,రమణ తో కలసి యాదగిరి వాళ్ళ ఇంటికి వెళ్ళి హరి & చరణ్ వాళ్ళ అభిప్రాయం చెప్పడంతో కూతురికి సంతోషం కన్నా మాకేం ఎక్కువ కాదని చరణ్ వాళ్ళ అమ్మానాన్నలతో హరి చరణ్ లను ఒకటి చేసి ఆస్తి మొత్తానికి చరణ్ వాళ్ళను వారసులు చేశారు,గతాన్ని మరిచిపోయి కొత్త జీవితం మొదలుపెట్టిన హరి ఆనందంగా ఉంది…

Get real time updates directly on you device, subscribe now.