ఇది నిజం -అంబటి నారాయణ

నిర్మల్

ఇది నిజం ”

ఎక్కడో..ఒకదగ్గర
నిజాయితీ
నిలకడగా నిలిచిఉంది!!…
అందుకే కొంత పరిణితి
పెరుగుతుంది…
చెడుప్రభావం తగ్గుతుంది!!…

ఎవరు నిలిపారో
ఈ నిజాయితీ తెలియదు…
అంతటా తానై నిలిచింది…
ఎక్కడో ఒకదగ్గర
ఎవరో ఒకరు
భుజాలకెత్తుకున్నారు!!…
భూభారాన్ని తగ్గిస్తున్నారు!!…

మంచి అనేది
మనిషిని వికసింపజేస్తుంది!!…
చెడు అనేది
చెదపురుగులా తినేస్తుంది!!…
నిజాయతీ…
ఉన్నతస్థానంలో నిలుపుతుంది!!…

ఇప్పుడు మనం అన్నీ మరిచి
ఆగమైపోతున్నాం!!…
నిజం ఎప్పుడూ ఈ వ్యవస్థలో…
వెలుగుతారయై నిలుస్తోంది!!…

నిజం కొన్ని రోజులు మాత్రమే
దాగుతుంది…
అరువుతెచ్చుకున్న అబద్దాలు
చివరికి అంతు చూస్తాయి…
అబద్దాన్నిఆశ్రయిస్తే ఓ అగ్నికణమే!!…
కదం తొక్కిస్తుంది!!…
కన్నీరుతెప్పిస్తుంది!!…

ఓరకమైన
దిశానిర్దేశం చేసేది నిజం!!….
చివరికి ఆస్తిత్వాన్ని
నిలిపేది నిజం!!…

జగతికి అధోగతి తెచ్చేది అబద్ధం!!…
ప్రతిక్షణం లోలోపల
భయాన్ని పుట్టిస్తోంది!!….

అబద్దం ఎప్పుడూ..
ఓ నిశ్శబ్ద రణం!!…
నిత్యం మనిషిని
తట్టిలేపుతోంది!!…
ఏదో సమస్యను సృష్టిస్తుంది!!..
నిశ్చలత్వాన్ని తొలగిస్తుంది!!…
నిట్టూర్పుసెగలను పుట్టిస్తుంది!!…
అబద్దానికి దూకుడెక్కువ!!…
శరవేగంగా దూసుకొస్తుంది…
తొందరలో అస్తిత్వాన్ని
కోల్పోతుంది!!..
నిజమైన వ్యక్తిత్వం
నీరుగారి పోతుంది!!..

భావోద్వేగం పెంచుతుంది!!…
అన్నీటిని బంగపరుస్తుంది!!…
విషవలయములో నిలబెట్టుతుంది…
మనిషికి వ్యక్తిత్వం లేకుండా చేస్తుంది!!..
ఎప్పుడైనా గెలుపు నిజానిదే!!…
ఎన్నిరోజులైనా మెరుపు నిజానిదే!!…
ఎన్నితరాలైనా వెలుగు నిజానిదే!!…
నిజాన్ని విడువొద్దు ఇజాన్నివదులొద్దు!!..

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

Get real time updates directly on you device, subscribe now.