అమ్మా….

గంగాధరభట్ల వేంకటేశ్వర శర్మ చందానగర్ - హైదరాబాద్

*అమ్మా!*********
ప౹౹ సృష్టిలోనజీవమిచ్చు ముదితయెవ్వరో
కష్టమునే యిష్టపడీ కనిపెంచిన దెవ్వరో
అ.ప౹౹ అమ్మ అనే అక్షరాల కమ్మనైన మాట
అనురాగం కురిపించే అందమైన పాట//సృ
చ౹౹తొమ్మిది మాసాలు మమ్ము
కడుపులోనమోసావు
ఇమ్మహిలో సంతసాన
లోకము సృష్టించావు
అమ్మను కమ్మనిమాటల.
కమ్మగపలికించావు
ఆనందామృత రసఝరి
మామది కురిపించావు ౹౹అమ్మ౹౹
చ౹౹ముద్దుముద్దుమురిపాలను
రంగరించి పంచినావు
హద్దు లేని అభిమానం
మా మనసుకు నేర్పినావు
బుడిబుడి మాటలకూర్చి
బుడిబుడి అడుగులు నేర్పి
తడబడిఅడుగిడకుండా
కడువడి అడుగులుగ మార్చి // అ//
– గంగాధరభట్ల వేంకటేశ్వర శర్మ
చందానగర్ – హైదరాబాద్

Get real time updates directly on you device, subscribe now.