శివరాత్రి సందర్భమున ప్రత్యక్ష మైన శివునితో అన్న పలుకులు
1. తేటగీతి
ఆది భిక్షువు శంకరా పరమ పురుష
నీవు నాకు నీవే వరాల్ నీయు మిపుడు
యేమి యిచ్చుకోలేను నే యికను బదులు
నీకుc, సాధ్యమా గెల్వగా నీ మది నిలc
సూచనలు
1. పద్యం రాయుటకు పదజాలం సిద్ధం చేసుకోవాలి.
2. పద్యం ఒక భావంతో వ్యక్తీకరణ చేసుకుంటూ ముందుకు సాగాలి.
3. పద్య లక్షణాలు మదిలో మెదులుతూ ఉండాలి పాదానికి అనుగుణంగా వచ్చేటట్లు చూసుకోవాలి.
4. పద్యం పాడుతూ రచన చేయాలి.
5. పద్యంలో ఒకవేళ
అలంకారాలు రావాలని అనుకుంటే ముందే నిర్ణయం తీసుకొని రచనలో కూర్చాలి.
6. విభక్తుల ను సాధ్యమైనంత వరకు తొలగించి పద్య రచన కొనసాగాలి.
7. వస్తు పోలికలు ముందు ఏర్పాటు చేసుకోవాలి
8. అంశం ముందుగానే అనుకోవాలి.
9. అంశంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
10. పదాల కోసం నిఘంటువు సహాయం పొందాలి.
11. అప్పకవీయము, ఛందో దర్పణం, ఛందో రంజీతము లాంటి లక్షణిక గ్రంథాలు అధ్యనము చేయాలి.
12. సమకాలీన విషయాలు రచనలో వచ్చే విధంగా చూసుకోవాలి.
13. ఒకే అంశంపై కనీసం 10 పద్యాలు తాత్పర్యంతో రాసుకోవాలి.
14. రచనలు జాగ్రత్త చేసుకోవాలి.
15. ఆర్థిక వీలును బట్టి ముద్రణ చేయించుకోవాలి.
మైత్రి అచ్చులు :
1.అ – ఆ – ఐ – ఔ- ( య – హ – న)
2. ఇ – ఈ – ఎ – ఏ
3. ఉ – ఊ – ఒ – ఓ
మైత్రి ఉభయాక్షరాలు :
1.c -న- ౯
2.ం -ము – అం
3 . :హ / అ
మైత్రి హల్లులు :
1. క – గ – ఘ – క్ష
2. చ – ఛ – జ ఝ
3. ట – ఠ – డ – ఢ
4. త – థ – ద – ధ
5. ప ఫ బ భ
6. న -ణ – జ్ఞ – ఞు – మ
7. ల- ళ -ఱ – డ
8. ఋ – ౠ
9. మ- మ
10. య – య
11. ర – ఱ – ఋ , ౠ
12. వ – వ
13. శ – ష – స – క్ష
రచన
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్