తెలంగాణ-స్వరాలు
1)
ప్రకృతిదేవతకు పూజలు
మనోహరమైనట్టి పాటలు
వలయాకారపు నృత్యములు
ఆడపడచుల ఐక్యతలు
బతుకమ్మకు నీరాజనాలు
2)
నైవేద్యముల సమర్పణలు
పోతురాజుల విన్యాసాలు
ఎల్లమ్మదేవికి ప్రార్థనలు
ఆషాడమాసపు వేడుకలు
బోనముల గొప్పతనములు
3)
పౌర్వసత్వ హక్కులు లేక
చెప్పలేనన్నియు అవస్థలు
పెత్తందారుల దుశ్చర్యలతో
తీవ్రమైన ప్రతిఘటనల
విముక్తి సాయుధ పోరాటాలు
4)
రక్తతర్పణాలు ధారపోసి
తెలంగాణ బాహాటముతో
ప్రతినిమిషం శ్రమించినట్టి
అమరుల త్యాగములకు
చిరస్మరనీయపు జోహార్లు
5)
ప్రాణాలను పణంగా పెట్టుతూ
భూమిపొరల్లో కష్టపడుతూ
బొగ్గుకుప్పల్లో మసిబారుతూ
విరాజిమ్మేటి సింగరేణులు
తెలంగాణ కే తలమానికం
6)
ఉద్యమములకు పుట్టినిల్లు
విశిష్టసంస్కృతి నిలయాలు
రగిలించునట్టి పౌరుషాలు
కదిలించే హృదయ దీప్తులు
తెలంగాణకే విశిష్టతలు
7)
కార్యాలోచన ప్రత్యేకతతో
రణరంగంలో కత్తినిపట్టి
మ్రోగించెను విజయదుందుభి
ధైర్యసాహసపు వీరనారి
రుద్రమ్మ నీకు వందనములు
8)
బంగారు వర్ణవలయాలతో
కాకతీయ స్ఫురణ తోరణ
ప్రతిబింబించిన స్పష్టతతో
తెలంగాణ అధికార చిహ్నం
రాజముద్ర కళావైభవము
9)
సురక్షిత నీటి ఆశయంతో
ఇంటింటికి స్వచ్చ త్రాగునీరు
ప్రత్యేక కుళాయి ఏర్పాట్లతో
మిషన్ భగీరథ పథకమా…
ప్రభుత్వం యొక్క సహకారమా…
10)
పచ్చదన మొక్కలు నాటుతూ
పర్యావరణ సమతుల్యాలు
ప్రాణవాయువు నెంతో పెంచుతూ
పరిరక్షణ కార్యక్రమపు
తెలంగాణ హరితహారము
సాకీవార్ ప్రశాంత్ కుమార్
ఉట్నూర్ సాహితీ వేదిక
9381475331