నవ రత్నాలు

తెలంగాణ

*నవ రత్నాలు*

1)
నాటిన మొక్కలు సంరక్షిస్తూ
నీ కర్తవ్యమును నిర్వర్తిస్తూ
నేటి కలుషితం రూపుమాపుము
నవరత్నాలు మానవ హిత కారకాలు

2)
నీడనిచ్చు చెట్లను నరకకుండా
నేల పోషకాలు పరిరక్షిస్తూ
నరునిగా కర్తవ్యం గైకొనుము
నవరత్నాలు మానవ హిత కారకాలు

3)
నిబద్ధతతో చక్కగా నడుస్తూ
నీటి సమస్యలు పారద్రోలుతూ
నవ నాగరికతకై ప్రతిజ్ఞ పూనుము
నవరత్నాలు మానవ హిత కారకాలు

హామీపత్రం :
ఈ నవరత్నాలు నేను స్వతహాగా రాసినవి

సాకీవార్ ప్రశాంత్ కుమార్

Get real time updates directly on you device, subscribe now.