ఎలక్షన్ నియమావళి

*జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో సమీక్ష ద్వారా మాట్లాడుతూ….*

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలి..

వివిధ పబ్లిక్ ఆస్థులు అనగా బహిరంగ ప్రదేశాలు,బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు,వాల్ రైటింగులు,పోస్టర్లు,కటౌట్లు వంటివన్నీటినీ వెంటనే తొలగించాలి…

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను నిలిపి వేయాలి..

అంతేగాక ప్రభుత్వ వెబ్సైట్ లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు,రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలి..

మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారంలో వాడొద్దు.

మంత్రుల ఎన్నికల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించరాదు..

వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపి, ఎంఎల్ఏలు వంటి ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండరాదు..

Get real time updates directly on you device, subscribe now.