రామగుండం కోకన్వీనర్ గా ఏటూరి శ్రావన్ కుమార్

న్యూ ఇండియా పార్టీ

న్యూ ఇండియా పార్టీ రామగుండం నియోజక వర్గ కోకన్వీనర్ గా ఏటూరి శ్రావన్ కుమార్ నియామకం.
…..

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం న్యూ ఇండియా పార్టీ కో కన్వీనర్ గా ఏటూరు శ్రావణ్ కుమార్ ని న్యూ ఇండియా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి నియమించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం (ఎన్టీపీసీ) జంగాలపల్లికి చెందిన ఏటూరి శ్రావణ్ న్యూ ఇండియా పార్టీ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు అని NIP కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నందుకు గాను విద్యార్థుల, స్తానిక సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసిన నందులకు , పార్టీ ని మరింత బలపరుస్తుందులకు గాను అలాగే రామగుండం నియోజకవర్గ కన్వీనర్ వానమామలై రామాచారి సిఫార్సు మేరకు ఈ పదవి లోశ్రావణ్ కుమార్ ని నియమించినట్టు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి తెలిపారు.
తన నియామకానికి మద్దతు తెలిపి అభినందించి నందులకు ,ఉపాధ్యక్షులు మదరబోయిన నర్సయ్య , అశోక్ వేముల , మహబూబ్ ఆలీ ,జాతీయ కార్యవర్గ సభ్యురాలు గంట భబిత సోనీ , విక్రమ్ సింగ్, తొగరి బానేష్ ,వానమామలై రామాచారి, నగునూరి విజయ్ కుమార్ , ఆషాడం ముఖేశ్ ,లకు ఈ సందర్భంగా ఏటూరి శ్రావణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్మాణం లో సైనికుడి లా నిరంతరం కష్టపడుతానని శపథం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.