అట్టహాసంగా కొమురం భీమ్ జయంతి వేడుకలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్

కొమురం భీమ్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
చరిత్ర కొమురం భీం సైన్యం లో స్త్రీలు సైతం వుండేవారు, అతి తక్కువ మంది అనుచరులతో వీరోచితంగా పోరాటం చేసాడు.నిజాం ను ఎదిరించిన వీరుడు,ధీరుడు కొమురం భీం, తన వదినతో కలిసి ఊరు ప్రజల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు
అడిగి తెలుసుకొనేవాడు.2సార్లు ఊరును వేరే అటవీ ప్రాంతాలకు మార్చారు. నిజం గుండెల్లో నిద్రపోయాడు……


అలాంటి
గోండు జాతి వీరుడు కొమురం భీమ్ జయంతి వేడుకలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె భీమా రావ్ ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్త చరిత్ర విభాగం మాట్లాడుతూ, ఆదివానీ ఆత్మగౌరవ ప్రతీక. స్వయంపాలన అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క పోరాట వీరుడు తన జాతి ప్రజలను విముక్తిచేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు. | కొమురం భీమ్ అని ఆయన అన్నారు. కొమురం
భీమ్ నేటి ఆసిఫాబాద్ జిల్లాలోని సంకేపల్లిలో 22 అక్టోబర్ 1901 జన్మించారు. నిజం ప్రభువు స్థానిక జమీందారుల నీరంకుశ విధానాలకు వ్యతిరేకంగా జల్ జంగిల్ జమీన్ నినాదం తో గోండు జాతి హక్కుల కోసం బాబేఝరి జోడేఘాట్ ప్రాంతంలోని 12 గ్రామాలలో యువకుల తోడ్పాటుతో సాయుధ పోరాటం చేసి నిజాం సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి బుర్దుపాటేల్ ద్రోహం వల్ల 1940 సంవత్సరం లో నిజాం పోలీసులు చేతిలో వధించబడ్డాడని రాంజీ గోండు స్పూర్తితో పోరాడాడని ఆయన అన్నారు ఈసందర్భంగా నిర్వహించిన ఉపన్యాస వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం జరిగింది

ఈ కార్యక్రమంలో జే భీం రావు ప్రిన్సిపాల్, అధ్యాపకులు రవికుమార్, రమాకాంత్ గౌడ్, నర్సయ్య, శంకర్ శ్రీహరి డాక్టర్ రజిత అఫ్రీన్ ఉమేష్,డాక్టర్ రంజిత్ కుమార్, దిలీప్, రవీందర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గన్నారు.

Get real time updates directly on you device, subscribe now.