“పదాలతోనే పట్టుత్వం ”
నా చూపు పడినచోట..
నాలోని పదాలు వడివడిగా
ముడిపడి వాలిపోతాయి!!..
పదాలన్ని జతకట్టి అనుకున్న
పసందైన భావాన్ని మూటకట్టి
నిజమైన కవిత్వంగా ముస్తాబవుతాయి!!…
అచ్ఛమైన స్వచ్చమైన జీవితాన్ని వ్యాఖ్యానిస్తూ..
వాస్తవాన్ని పలవరిస్తూ పలకరిస్తాయి…
దైన్యాన్ని పోగొట్టి నిజమైన ధైర్యముతో
ఓ కొత్తమార్గానికి దారిచూపుతుంది!!…
పదపదానికో పట్టు వాక్యముగా చుట్టేసి!!
వ్యక్తిత్వాని పట్టి కవిత స్పర్శతో ఒట్టేసి!!
మంచోళ్లకు కరచాలనం చేస్తాయి..
చెడ్డోళ్లకు కరవాలం చూపిస్తాయి!!..
శబ్దంతో భయపెట్టి
నిశ్శబ్దంతో నిదరపుచ్చుతాయి!!..
జీవితాంతం ఓ మధుర జ్ఞాపకమై
మమతానురాగాలు పంచుతాయి!!
మానవతా శబ్దమై వినిపిస్తాయి!!..
అన్యాయాన్ని అరికట్టే
ఓ నినాదమై కనిపిస్తాయి…
యువతరాన్ని ..తట్టిలేపుతోంది
నవతరాన్ని ప్రభావితం చేస్తాయి!!..
ఓ కొత్త చైతన్యాన్ని
పులకరింపచేస్తోంది!!..
పదాలు ఒక్కటై జతకడితే
ఒక ఉద్యమమవుతాయి!!..
రణంవైపు జనాన్ని నడిపిస్తాయి!!..
మచ్చుకైనా మానవత్వం
కనబడనిచోట ప్రతిఘటన చేస్తాయి!!..
ప్రతి వ్యక్తి గుండె గూటిలో
నిజాయతీ దీపం వెలిగించి
నిరాశ తాపాన్ని తొలిగించేది
పదాల శబ్దంతో
అవినీతిని విధ్వంసం చేస్తున్నాయి…
అప్పుడప్పుడు పదాలు ఘోషిస్తాయి!!..
ఆగ్రహంతో పేలిపోతాయి!!…
పదాలు మెదళ్లకు పదును పెట్టే మొదళ్లు
శతాబ్దాల చీకటి పరదాలను తొలిగించే పదాలు
అలల్ని సృష్టించి వలల్ని..
విసిరి మనసు కుదుళ్లలో..
ఊహించని కాంతితో ఉబికి వస్తోంది!!..
అంబటి నారాయణ
నిర్మల్
9849326801