రాథోడ్ శ్రావణ్…. రచించిన పండుగలు

Isbn అప్రూవ్డ్ జర్నల్

రాథోడ్ శ్రావణ్) రచించిన పండుగలు – ముత్యాల హారాలు పుస్తకావిష్కరణ*

*ఉట్నూరు సాహితీ వేదిక* ఆధ్వర్యంలో *ముత్యాలహారం ప్రక్రియలో పండుగలు ముత్యాల హారాలు* పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి టి.శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
కవి, రచయిత ఉపన్యాసకులు రాథోడ్ శ్రావణ్ గారి ద్వారా రచించబడిన ఈ పుస్తకాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా మాధ్యమిక విద్యాధికారి, గౌ శ్రీ సి.రవీందర్ కుమార్ గారి* చేతుల మీదుగా ఆవిష్కరించారు. సి.రవీందర్ గారు మాట్లాడుతూ సాహితీరంగంలో “ముత్యాలహారం” అనే ప్రక్రియ అనేక మంది కవులకు గొప్ప వరమని కొనియాడారు. ఉసావే అధ్యక్షులు కవనకోకిల బంకట్ లాల్ జాదవ్ మాట్లాడుతూ హిందీ తెలుగు భాషల్లో రాథోడ్ శ్రావణ్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.
ఉట్నూరు బి.ఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ డా,,మెస్రం మనోహర్ గారు మాట్లాడుతూ ఉట్నూరు నుండి ఓ సాహితీ ప్రక్రియ వెలువడి సాహితీరంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనం సృష్టించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ బలిరామ్ గారు మాట్లాడుతూ ముత్యాల హారం అనే ప్రక్రియలో అనేక పండుగలను ఈ పుస్తకంలో రాయడం అభినందనీయం అన్నారు. ప్రిన్సిపాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ గణేశ్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో అనేక పుస్తకాలు వెలువడడం శుభ సూచకం అని కొనియాడుతూ ఉట్నూరు. లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డి.శ్రీనివాస్ గారు కవుల నుండి కూడా ముత్యాల హారాలు ప్రక్రియలో కవితలు రాసి పుస్తకాల రూపంలో తీసుకురావాలని, ఈ కార్యక్రమం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉసావే ప్రచార కార్యదర్శి ఆత్రం మోతీరాం, సభ్యులు కుమ్ర లాల్ షావ్, జాదవ్ మురళి,వసంత్ రావ్, ధరంసింగ్, బాలకవి వివేక్, కదురు రామకృష్ణ, హెచ్,డబ్ల్యువో బి.యశోదా గారు, ప్రభుత్వ జూనియర్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.