*మా తండా ముచ్చట్లు.. వ్యాసకర్త రాథోడ్ శ్రావణ్*
~~~~~~~~~~~~~~~~
అదగదిగో మా తండా
అందమైన మా తండా
పచ్చని చెట్లుతొ నిండా
పక్కన నాగల్ కొండా…!!
తాండా గురించి ముత్యాల హారం… రూపకర్త రాథోడ్ శ్రావణ్.. రచయిత ఉట్నూరు సాహితీ వేదిక కు పూర్వ అధ్యక్షులు సోనాపూర్ తాండా నార్నూర్ మండలం ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం
జననీ జన్మభూమిశ్చ…
స్వర్గాదపీ గరీయసి ,
స్వర్గాదపీ గరీయసి.
ఏ తల్లి నిను కన్నదో…..
ఆ తల్లినేకన్న భూమి గొప్పదిరా…………….అన్నాడు
ఒక మహాకవి.
“ఉన్న ఊరు కన్నా తల్లి”
“జన్మనిచ్చిన యాడితో సమానం మన తాండా”
మా తాండా సోనాపూర్ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా నార్నూరు మండలంలో ఒక గిరిజన రెవెన్యూ గ్రామము. ఇది మండలానికి 8 కి,మీ దూరంలో ఉట్నూరు పట్టణానికి 20 కి,మీ దూరంలో ఉంది. చుట్టూ మూడు వైపుల గుట్టల నడుమ గ్రామాన్ని యు- “U”ఆకారంలో చుట్టుపక్కల గుట్టలతో అడవులు ఆవరించి ఉంటుంది.అణువు అణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతోంది. ఈ గుట్ట ప్రాంతంలో ముఖ్య వృక్షాలు టేకు, ఇప్పా, తునకి,జమ్మి ,రేగి, సారా,అందుగ,రావి,జీడి,మేడి,తావిజి,కొడిసా,మోదుగ, మర్రి,తుమ్మ,నల్లమద్ది, తెల్ల మద్ది,చిన్నచిన్న పొదలతో చూడడానికి ఆకర్షణీయంగా కన్పిస్తుంది. పాడి పంటలతో పచ్చని పొలాలు, చిన్న చిన్న వాగుల మధ్య రమణీయంగా కళకళలాడుతూ ఆర్థిక పునరుజ్జీవనం వైపు అడుగులేస్తోంది.
ఈ ప్రాంతంలో లంబాడీ గిరిజనులు, ఆదివాసీ గోండులతో పాటు గిరిజనేతరులు, ఇచ్చట జీవనం సాగిస్తున్నారు.ఈ తాండా కి వచ్చేవారు తాండా దగ్గర వరకు వచ్చిన ఊరు కన్పించకుండా అందమైన అనుభూతి నిస్తుంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ తాండా జనాభా 218 ఉంది. గ్రామంలో మగవారు 118 ఆడవారు 100 తెలంగాణ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలో భాగంగా గ్రామ పంచాయతీ బేతాల్ గూడలో గ్రామంలో ఉంది. పోలిష్ పటేల్ వ్వవస్థ కాలంలో తాండాలో జాదవ్ మోహన్ సింగ్ నాయక్ గారు తాండా చుట్టూ ఉన్న ఎనిమిది, నుండి పది గ్రామాలకు పోలీషుపటేల్ గా వ్యవహరించడంతో పాటు తాండాకు నాయక్ గా వ్వవహరించేవారు.అతనితో పాటు అతని తమ్ముల్లు, జాదవ్ లాల్ సింగ్, జాదవ్, గూలాబ్ సింగ్, బందువులు రాథోడ్ చంద్రభాణ్,రాథోడ్ అమృ, రాథోడ్ రతన్ సింగ్,గ్రామ కారోభారి జాదవ్ రాంచందర్, జాదవ్ భావ్ సింగ్, రాథోడ్ హారిలాల్, కాశీరాం, మేగాజీ, ఖుబా తో పాటు కిషన్ పల్మటే, బాబు రాజపేటే, మొదలగు వారి వంశమే ప్రస్తుత సోనాపూర్ గ్రామము.వీరి ప్రధానమైన జీవన ఆధారము వ్యవసాయం చేయుట అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్ముట ప్రధానమైనది. వాణిజ్య పంటలు పత్తి, మరియు సోయా, జోన్నలు, మీనుములు, పేసర్లు,కందులు,ఉలువలు తో పాటు వరి, గోధుమలు,శేనగలు, పండించే వారు.అడవిలో దొరికే ఇప్పపూలు,బీడిఆకులు,బంక, సారపలుకులు మొదలగునవి సేకరించి అమ్మేవారు.తాండా నాయక్ మోహన్ సింగ్ పెద్ద కూమారుడు శ్రీ జాదవ్ కిషన్ సింగ్ రిటైర్డ్ ఉపాధ్యాయులు గారు ప్రస్తుతం తాండా నాయక్ గా కొనసాగుతున్నారు. కారోభారి జాదవ్ పర్సురాం గారు, డావ్ అంబారావ్ గారు,మాన్కరి మేర్ సింగ్ గారు వ్యవహారిస్తున్నారు. జాదవ్ కిషన్ సింగ్ నాయిక్
కోడలు సుజాత పరమేశ్వర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తాండాలను గ్రామపంచాయతీలో భాగంగా కొత్త గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఐటిడిఎ పరిధిలోని ఒక ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రం, ఒక ఆశ వర్కర్ ఉంది. గ్రామంలో పాత విద్యుత్తు స్తంభాల స్థానంలో కొత్త విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్తు సరఫరా వ్యవస్థను కొనసాగిస్తున్నారు.సర్పంచి మరియు గ్రామ పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో రోజు వారి సంపూర్ణ పారిశుధ్యం అమలవుతోంది.తెలంగాణకు హరితహారం లో భాగంగా రోడ్డు ఇరువైపులా చెట్లు నాటినారు. రక్షిత మంచినీటి సరఫరా కుమ్రంభీం ఆడ ప్రాజెక్టు నుండి నీళ్ళు, ఇంటి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచుటకు సహకరిస్తున్నారు. వైద్య సౌకర్యం కొరకు గ్రామ ప్రజలు తాడిహత్నూరు , మరియు ప్రభుత్వ ఆసుపత్రి ఉట్నూరు కు రావడం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రి రిమ్స్ కు వెళ్లుతుంటారు.గ్రామ అక్షరాస్యతను పరిశీలిస్తే ప్రతి ఇంట్లో చదువుకున్న వారు కనిపిస్తారు.తాండావాసులు చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన గ్రామ అక్షరాస్యత 96% ఉంది. చదువుకున్న వారు దేశంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలడు అనే అభిప్రాయానికి వీరు ఏకిభవిస్తారు. ఈ తాండా నుండి ఉపాధ్యాయ వృత్తిలో ఏడుగురు,సీఆర్టీలు ఇద్దరు భూకొలతల శాఖలో ఒకరు పోలిష్ ఉద్యోగంలో ముగ్గురు అప్కారిశాఖలో ఒకరు, అటవీ శాఖలో ఒకరు, ఇంటర్మీడియట్ విద్యా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు, ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖలో ఒకరు, రవాణా శాఖలో వెహీకిల్ ఇన్స్పెక్టర్ గా ఒకరు, కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ శాఖ లో ఒకరు
మరియు వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు పనిచేయుచున్నారు.ఈ తాండా నుండి మొట్టమొదటి ఉద్యోగి జాదవ్ గూలాబ్ సింగ్ మాస్టర్ గారు , మొట్టమొదటి ఇంజనీరింగ్ చదివినా జాదవ ప్రేమ్ సింగ్ గారు ప్రేంఖైదీ సినిమా యందు రెండో నటుడుగా నటించారు. వీరి తమ్ముడు జాదవ్ నారాయణ సింగ్ ప్రముఖ గాయకుడు వీరు గోర్ జీవన్ బంజారా సినిమా యందు నటిస్తూ మధురమైన రాగంతో పాటపాడడం విశేషం. మొట్టమొదటి గెజిటెడ్ అధికారి రాథోడ్ శ్రావణ్ బంజారా రచయితగా రాణిస్తున్నారు.వీరి
కుమారుడు డాక్టర్, రాథోడ్ కార్తీక్ నాయక్ గారు ఎంబిబియస్ పూర్తి చేసి ప్రస్తుతం పీజీ కోర్సుల కొసం ప్రయత్నంలో ఉన్నాడు.రెండో గెజిటెడ్ అధికారి జాదవ్ సంజయసింగ్ గారు, తాండాలో పదవ తరగతి చదువుతున్న వారు ఇరవై , ఇంటర్మీడియట్ చదివే వారు పదిహేను తో పాటు డిగ్రీ కొర్సులో చదువుతున్నావారు 40, పిజీ డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయం యందు చదువుచున్నావారు రాథోడ్ బ్రహ్మనంద ఒకరు ఇంజనీరింగ్ చదివి వివిధ శాఖల్లో పని చేస్తున్నవారు నల్గురు, ఇంజనీరింగ్ ప్రస్తుతం చదువు చున్నావారు నల్గురు, యన్.ఐ.టి గోవా రాష్ట్రంలో చదువుతున్నవారు ఒకరు, మరియు ఎమ్ టేక్ చదివి పి హెచ్ డి చేస్తున్నవారు ఒకరు,ఇలా చదువు పై ఉన్న మమకారంతో ముందుకు సాగుతున్నారు. తాండా లో రెండు ఆలయాలు ఉన్నాయి . 1)ఒకటి ఆంజనేయ స్వామి ఆలయం,2) రెండోది సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ , జగదాంబ మాత ఆలయం.
1) ఆంజనేయ స్వామి ఆలయం :- ఆలయాన్ని గ్రామస్తులందరి సహకారంతో పాటు జాదవ్ జైతరామ్ గారి సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. తాండా నాయక్, కిషన్ సింగ్ గారు, వసంత్ సింగ్ గారు వీరితో పాటు ఆలయ పూజారి హూన్నాజీ గారు స్వామి వారికి సుప్రభాతం మరియు ఆరాధన చేస్తుంటారు.స్వామి వారి జయంతి కంటే ముందు తమకు తోచిన విధంగా దీక్షలు పట్టి కొందరు 11రోజులు,21రోజులు, లేదా 41రోజులు, ఆంజనేయ స్వామి, మరియు సేవాలాల్ దీక్షలు తీసుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దీక్ష విరమణ చేస్తారు.స్వామి వారు కొరుకున్న కొరికలు నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం.ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో శ్రావణమాసంలో పోలాల అమావాస్య అత్యంతవైభవంగా నిర్వహిస్తారు. 2) సేవాలాల్ మరియు జగదాంబదేవి ఆలయం:- బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జగజ్జనని జగదాంబదేవి ఆలయాన్ని గ్రామస్తులందరి సహకారంతో జనవరి-2021న నిర్మించారు. స్వామి వారి జయంతిని ప్రతిఏటా నిర్వహిస్తుంటారు.ఆ సమయలో దిక్షాగురు శ్రీ ప్రేంసింగ్ మహారాజ్ కొత్తపల్లి గారి చేతులమీదుగా భోగ్ భండారో కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహిస్తారు.
ఆలయం పూజారి రాథోడ్ గణేష్, రమేశ్ ఆలయం యొక్క బాగోగులు చూస్తూంటారు. ఆలయం నిర్మాణానికి విశేష కృషి సల్పిన ఆలయ అధ్యక్షులు రాథోడ్ బలిరాం ఉపాధ్యక్షులు రాథోడ్ ధన్ లాల్ , తాండా నాయక్ తో పాటు తాండా వాసులు సహకారంతో శిలావిగ్రహాన్ని ఏర్పరచడం ఆనంద దాయకం. బంజారాలను సంచార జీవనం నుండి సన్మామార్గంలో బోధించి తండాల్లో స్థిరనివాసం ఏర్పరచి చైతన్యతను తెచ్చి ఆధ్యాత్మికం వైపు మళ్ళించిన మహోన్నత వ్యక్తి తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని వీరి నమ్మకం.తాండా కేంద్రంగా అందరూ కలిసి మెలసి సమభావం, సహజీవనం సాగిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ సమతా విలువలతో జీవిస్తూ అప్యాయ ఆత్మీయత లకు నిలయాలు ఈ తాండా వాసులు. అందుకే తాండా ప్రేమాభిమానాలకు అండా అంటారు…. రాథోడ్ శ్రావణ్..
(వ్యాసకర్త రచయిత, ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూరు ఆదిలాబాదు జిల్లా)
*రాథోడ్ శ్రావణ్*
సోనాపూర్ నార్నూర్ ఆదిలాబాద్ జిల్లా 9491467714