ఎందుకు ఈ పైశాచికం”

“ఎందుకు ఈ పైశాచికం”

ఎంత దారుణం!!??…
శిరసెత్తుకొని చూడలేని దృశ్యాలతో
కవుల గుండెలకు గాయాలైనవి…
కలం పట్టాలంటే కన్నీళ్లు వస్తున్నాయి
ఏ కవిత రాయాలి…
ఏ కదం తొక్కాలి ఏ రణం చేయాలి…
కలాని కత్తి చేసి పొడువాలని ఉంది!!..

ఏమిటి…ఈ పైశాచికం!!??
భారతమాత తలదించుకునేలా..
మానవత్వానికి అవమానంగా..
చెట్టుచేమా కళ్ళలో నుండి కూడా
కన్నీరొలుకుచున్నాయి..
ఆడవారిని వివస్త్రలను చేసి
రోడ్డు మీద నడిపిస్తుంటే…
అనాదారణతో వెక్కివెక్కి ఏడుస్తూ..
ఈ దూర్తలోకంలో మా బతుకులు ఇంతేనా!!??
మానాభిమానాలు పోయిన తరువాత
ఎందుకు బతకాలి!!??
అని విలపిస్తుంటే…
గుండె మనుసు ఉన్నోళ్ళు
ఎవరు కూడా స్పందించక ఉండలేరు!!

అడుగడుగునా పొడచూపే
వారి ఆర్తనాదాలు…
వంచనాలలోకపు సంకుచిత్వాలమైకం..
అంతా దుర్మార్గపు నడకలు…
భరతమాత అణువణువునా
అమరిన అందాలను
నడిరోడ్డుపై ఒలుస్తున్న కీచకులు…
మనం ఎక్కడ ఉన్నాం!!??…
ఏలోకంలో ఉన్నాం!!??…
కళ్ళకు గంతలు కట్టుకున్నాము…
ఎదురు నిలిచే సత్తాలేక
ఎదిరించే ధైర్యం లేక..
జవసత్వాలు చచ్చి…
నిస్సహాయ స్థితిలో ఉన్నాం!!…
మనదీ ఒక జన్మేనా!!??…
కళ్లుండీ కబోదిలా… ముసిరిన కాముకుల కళ్ళు…
తనువంతా స్పర్శిస్తూ ఉంటే… దీనవేదనలో
మౌనరోదనలతో నడుస్తున్న
ఆ అభాగ్య తల్లులు..
సహాయంలేని అనుకూలన్యాయం
లేని దారిలో…పరువూ పోయింది!!…
ప్రాణం ఒక్కటి మిగిలింది!!…

ఎక్కడ ఆదర్శం!!??..
ఎక్కడ మానవత్వం!!??…
ఎన్నెన్ని దుస్సాహస దుర్మార్గాలు చూస్తున్నాం….
ఈ దృశ్యాలను చూడలేక
ఆకాశంలో మబ్బులు కమ్మేసినవి…
హృదయపు మబ్బులు
కన్నీటి జల్లులు రాల్పినవి….
సిగ్గులేని ఈ మానవ జాతిగుండె ఆగిపోయింది….
మనసు విడిపోయి పారిపోయింది…
రాతి బొమ్మై చూస్తున్నారు…
ఎవరిపనిలో వారు… ఎవరి తొందరలో వాళ్ళే…
సోమరులై…కాముకులై కదలిపోతున్నారు!!…

మీరు నడుస్తున్న దారే
మీ మాన ప్రాణాలను కాపాడింది…
ప్రకృతి తన పైటతో కప్పేసుకుంది…
మీ వెనుక నడుస్తున్న లోకులు
పలుకాకులు,దుష్టులు,దుర్మార్గులు…
కామవాంఛ పిశాచాలై
పరుగులు పెడుతున్నారు…
ఈ నాలుగు దిక్కులు వారి కళ్ళను కప్పేసింది…
వీడిన మబ్బుల మధ్య
పొడుస్తూ ఉన్న వేగుచుక్క..
దారి తప్పిన జనం గుండెలో
దరువులు మొదలవుతాయి..
ఎగిరెగిరి పడుతున్న ఈ అభినవకీచకులు
అడుగడుగునా ఎందరెందరినో అవమానించారు…
వీరి కళ్ళలో కాకులు పొడవాలి!!..
గుండెల్లో గునపాలు దింపాలి!!…
ఇలాంటి వారు సభ్యసమాజానికే తలవంపు!!
మానవ జన్మకే అనర్హులు!!…

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

Get real time updates directly on you device, subscribe now.