ప్రజ్ఞాన్ ది స్కూల్లో ఘనంగా తానా అమ్మ నాన్న గురువు పద్యార్చన*

ISBN సమదర్శిని హైదరాబాద్ న్యూస్

*ప్రజ్ఞాన్ ది స్కూల్లో ఘనంగా తానా అమ్మ నాన్న గురువు పద్యార్చన*

హైదరాబాద్; డిసెంబర్18,2023 సమదర్శిని న్యూస్ ;

ఉప్పల్ లో గల ప్రజ్ఞాన్ ది స్కూల్ లో తానా అమ్మ నాన్న గురువు పద్యార్చన ఘనంగా జరిగింది.ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు 100 దేశాల్లో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో
వందేవిశ్వమాతరమ్ పేరుతో *చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల్లో నిర్వహిస్తున్న శాంతి సద్భావన యాత్ర* లో భాగంగా తానా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అని *తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి* తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా
ఉప్పల్ ప్రజ్ఞాన్ ది స్కూల్ విద్యార్థులు చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన అమ్మ శతకం ,నాన్న శతకం, గురువు శతకాలలోని పద్యాలను కంఠస్థం చేసి 50 మంది సామూహిక గానం చేశారు. ప్రిన్సిపాల్ శ్రీమతి అరుణ్ సూర్య, కరస్పాండెంట్ శ్రీమతిశకుంతల,ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నళిని మాట్లాడుతూ విద్యార్థులకు పెద్దల పట్ల గౌరవం పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.నిర్వహణ బాధ్యతను శ్రీమతి సత్యనీలిమ చేపట్టగా శ్రీమతి ఎలిజబెత్,శ్రీమతి సుజాత,శ్రీమతి ప్రమీల,శ్రీమతి సువర్ణ,శ్రీమతి స్రవంతి,శ్రీమతి సెలస్టీనా,శ్రీమతి రోజా,కుమారి సునీత,కుమారి సుమ,శ్రీ శోభన్ బాబు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.