*నాగాపూర్ ప్యాసింజర్* లో *మొదలైన ప్రేమకథ*
నవంబర్ మాసంలో నరాలు తెంచే చలిలో నడిరేయిజాములో నాగాపూర్ ప్యాసింజర్ లో నవయవ్వని లాంటి ఓ కన్యక నా ఎదురుగా పై బెర్త్ లో కూర్చుని నవమన్మథుని లాంటి నను తన మదిలో నింపుకోవాలని తపిస్తున్న వేళా తన ఆలోచనల ప్రభావమో ఏమో నా మనసు తడబడి తలయెత్తి పైకి చూసింది పసినిమ్మ పండులాంటి చిరునగవుల సొగసరి సౌందర్యం నా మగసిరిని దోచుకుంది. అంతవరకు హెడ్ సెట్ లో పాటలు వింటూ చిప్స్ తింటూ ప్రశాంతంగా ఉన్న నా మదిలో ఏదో తెలియని అలజడి, ఇన్నాళ్లు నేను ఎరుగని కొత్త కలవరం ఏమిటో ఆలోచిస్తున్నంతలోనే ఆ పారాణి పాదాల నా కలల రాణి వాలు చూపుల ఆ వారిజాక్షి వార్దా అనే స్టేషన్ లో దిగిపోయింది.
అతివలకైనా మతి చెదిరే అతి సుకుమారమైన ఆ అందం చూస్తూ తన జ్ఞాపకాలలోనే లీనమైన నాకు “అన్నా….! అక్క ఈ నెంబర్ మీకిమ్మందీ” అనే కుర్రాడి పిలుపు తో ఈ లోకంలోకి వచ్చాను….ఆ స్లిప్ లో ఇది 9848839385 నా నెంబర్ అని ఉంది. ఎవరామే అని వెనుతిరిగి చూశాను ఆశ్చర్యంగా ఇందాక నాతో పయనించిన ఆ అమ్మాయే గాలిలో తన పేరు “సరళ”మని చెబుతూ ఆ ముద్దుగుమ్మ ముద్దులివ్వకుండానే వెళ్ళిపోయిందేంటీ….అనీ…
కొంత దూరం ప్రయాణం చేసిన నేను మా ఇంటికి వచ్చేశాను దీపావళి పండగ హడావుడి లో, బంధువులు, కుటుంబ సభ్యుల కోలాహలం లో సరదాగా గడుపుతున్న సమయంలో ఆ నెంబర్ ఎక్కడో మిస్ అయింది…
నా పేరు కిరణ్ మాది మహారాష్ట్ర లో ఓ కుగ్రామం ఇంటర్ వరకూ అక్కడే చదివి పై చదువుల కోసమనీ నాగాపూర్ వచ్చేశాను LVR కాలనీలో ఉంటూ ఫ్రెండ్స్ తో చదువుకునే వాళ్ళము ప్రతిరోజూ సాయంత్రం టెర్రస్ పైనా ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళం.
ఒకరోజు స్నేహితులు లేని సమయంలో ఒక్కడినే టెర్రస్ పైన చదువుతూ ఉన్న ఇంతలో ఇంద్రలోకం నుడీ దిగివచ్చిన దేవకన్యలా ఓ అమ్మాయి నను చూస్తూ చదువుతున్నట్లుగా అనిపించింది ఇలా చాలా రోజులు గడిచింది. ఆ అమ్మాయి అందం నా గుండెల్లో ముద్రితమైందీ.
ఆకాష్ మన ఎదురింట్లో ఒక అమ్మాయి ఉందిరా……!చాలా బావుందీ…..! “ఏం రా ఈ కాలనీ లో అమ్మాయిలే లేరు ఇది బ్యాచిలర్స్ ఏరియా.. ఫ్యామిలీసే ఉండవు” అని వారించాడు కారణం తను వారికి ఎప్పుడూ కనిపించలేదు నేను ఉన్నప్పుడు మాత్రమే పైకీ వచ్చేది ఇలా చాటుగా నను లైక్ చేస్తున్నట్లు అనిపించింది.. ఈ విషయం ఫ్రెండ్స్ కి చెప్పిన నమ్మలేదు మరునాడు కిటికీ డోర్ కి చిన్నరంద్రం చేయించి అందులో నుండి తనను గమనించిమని చెప్పాను… “రేయ్ నిన్ను మాత్రమే చూస్తుందిరా నువ్ లక్కీరా ప్రొసీడ్ అవమంటూ ఎంకరేజ్ చేశారు కానీ చదువు ఉద్యోగం అనే ఆలోచన లో ఉన్న నాకు నచ్చకపోయేది…
“ఒరేయ్ నువు చాలా అందంగా ఉంటావ్ రా…..!నిను ఎవరూ పెళ్ళి చేసుకుంటారో కానీ వాళ్ళు చాలా లక్కీరా…. “ఏంటక్కా……!అలా మాట్లాడుతున్నావ్” “నిజం రా నువ్ మహేష్ బాబు లా అందంగా ఉంటావు …..”రేయ్ నీకీ విషయం తెలుసా….?ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో 99 రౌండ్లో 48 బాల్స్ 244 స్కోరు137 పీపుల్స్ చాలా బావుందీ రా…..నువ్ చూస్తే బావుండేది…”ఏంటక్కా …..!అలా స్కోర్ చెబుతూ గాలిలో నెంబర్ రాస్తున్నావేంటీ…..?నీకేమైనా పిచ్చా ….!”ఓరి పిచ్చోడా….అర్థమవాల్సిన వారికి అర్థం కాదు నేకేంట్రా అన్నీ అర్థం అవుతున్నాయి….. “ఇంతకీ అర్థం అవాల్సిందీ ఎవరికీ అక్కా…?”మూస్కో నీకెందుకులే….?
ఓహో తను ఇందాక చెప్పిందీ నాకేనా నను చూస్తూ అలా రౌండ్లు స్కోర్స్ చెప్పిందేంటీ అనీ ఆలోచిస్తున్నా అది తన సెల్ నెంబర్ అని అర్థం అయ్యింది. నెంబర్ గుర్తు తెచ్చుకున్నా కానీ 9 నెంబర్లే వచ్చాయి ఎంత వెదికినా పూర్తి నెంబర్ దొరకలేదు…..
” రేయ్ కేబుల్ ఇవాళ జిరాక్స్ సెంటర్ కి వెళ్ళాలిరా నాతో వస్తావా…..? “నేనెందుకు రావాలి……!నాకు హోంవర్క్ చాలా ఉంది” “ఏం హోంవర్క్ రా ఎప్పుడూ చదువేనా…..?అలా అంటే చివరికి ఎదురింటి పై వారిలా అమ్మాయి లంటే నచ్చకుండా పోయే స్థితి కి వస్తావురా….. తర్వాత హోంవర్క్ చేయొచ్చులే… నాతోరా……”అక్కా….!నాకో డౌటు నువు నను అంటున్నావా….ఎదురింటి అన్నయ్య ను అంటున్నావా…? “తను నీకు అన్నయేంట్రా…. బావా అని పిలువు బావుంటుంది….”కాదక్కా… పెద్దవారిని అన్నయ్యా అని పిలవాలనీ మా మాష్టారు చెప్పారు” “ఔనా……!మీ మష్టారుకీ ఎదురింటి పై వారిలా అమ్మాయి ల అందం గురించి తెలియదేమో అందుకే అలా చెప్పారు…”ఏంటక్కా ప్రతిదానికీ ఎదురింటి పై వారు అంటున్నావేంటీ తను నీకేమైనా పరిచయమా….? “పరిచయం ఉంటేనే అలా అనాలా పరిచయం చేసుకోవడానికి కూడా అనవచ్చు కదా….!”అంటే పరిచయం ఇలా కూడా చేసుకుంటారా….?”ఔను ఎంత షార్ప్ రా నువు బుర్రనే లేదు….”ఏంటో షార్ప్ అంటున్నావు అంతలోనే బుర్రలేదంటున్నావు…”నువు షార్ప్ బుర్రలేని వారు వేరే ఉన్నారులే….
“అసలు ఏంటక్కా నీ ప్రాబ్లమ్…?”నీకు అర్థం కాదులే “ఎదురింటి అన్నయ్యా నీతో మాట్లాడాలనేనా……?అ….లాం….టి…దే….
“ఓహో నేను సెట్ చేస్తా కదా
అన్నా షాప్ కి వెళ్దాం వస్తావా.? నేనా…?ఎందుకు…?”ఊరికే నాకు తోడుగా….. మీ అక్కా ఉంది గా…”అందుకే తోడుగా రమ్మంటున్నా…రారా…ప్లీస్… ఒకే ఒకే జస్ట్ వెయిట్…. “థ్యాంక్యూ…
ఆకాష్ నేను షాప్ కి వెళ్తున్నా….”ఎందుకురా…..?చిన్న పని ఉందీ….
ఆల్ ద బెస్ట్
“ఎందుకురా….?నువు వెళ్ళేది షాప్ కీ కాదు ప్రియురాలి సన్నిధికి అని.మాకు తెలుసులేవోయ్…
సరేకాని ఈ వైట్&బ్లూ లైన్స్ డ్రెస్ వేసుకోరా…..స్పెట్స్ పెట్టకో ఇన్ షర్ట్ చేసుకో…అందంగా తయారు కావాలి ఎలా అంటే చూడగానే ఆ అమ్మాయి నీ ఒళ్ళో వాలి పోవాలి….ఒకే రా..
గుడ్ ఈవినింగ్ అంకుల్.. “చెప్పండీ ….ఒక పెన్ కావాలి “ఇదిగో తీసుకొండీ….థ్యాంక్యూ
“హాయ్ నా పేరు మానస.. ఔను కదా….అర్థం అయింది… ఎలా…? ఇంతలా నస పెడుతుంటేను….”కరెక్ట్ అన్నా….ఒకటే నస తట్టుకోలేక పోతున్నా…”రేయ్ నువు ఆపురా ఇంటికి వెళ్ళు నేను తర్వాత వస్తా….”ఓకే వెళ్తా నాకేమైనా నీతో ఉండాలని ఆశనా…..
“మీ పేరు….?కిరణ్… “మీరు చాలా అందంగా ఉంటారు …ఔనా….!నాకెప్పుడూ అనిపించలేదే…?ఇది ఎప్పటినుండీ….?”నేను మిమ్మల్ని చూసినప్పటినుండి..
ఎపుడూ చూశావ్…?”నువ్ మా ఎదురింటి పై పోర్షన్ లో దిగినపుడే….ఔనా….?”మన అందం మనకంటే ముందు ఎదుటి వారికే కనిపిస్తుంది… నీకసలు అర్థం కాదా….?ఏంటదీ….?”ఒకమ్మాయి మీతో మాట్లాడాలనీ ఇంతలా ట్రై చేస్తుంటే మాట్లాడాలనీ అనిపించదా…?నా అందం నిను దోచుకోలేదా…?ఒక ఆడపిల్ల మనసు ఇంతకంటే ఎక్కువగా ఎలా చెబుతోంది అనుకుంటున్నావు” కదా….! ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం నాకా కష్టపడే ఓపికా తీరికా లేవు.. “ఏం పాపం …? ముందు చదువు ఉద్యోగం… “ఔనా….!జీవితంలో అవి మాత్రమేనా ప్రేమ కూడా కావాలి నా దగ్గర చాలా ఉంది….అంతకుమించి మా అమ్మా నాన్నల దగ్గర చాలా ఉంది నీ ప్రేమ నాకెందుకు…?”నువ్ అసలు మగాడివేనా…?హూ ఏంటా ప్రశ్న….”మరి ఇంత అందమైన అమ్మాయి వెంటపడుతుంటే కాదంటావేంట్రా ..ప్లీస్ నాకు నువు కావాలి…మన మధ్య ఏదో బంధం ఉంది అందుకే నేను ఇంతలా దగ్గరయ్యాను” బంధం లేదు పరిమళ గంధం లేదు నేను మీకు దగ్గర కాలేదు ఇంకా దూరంగానే ఉన్నా… “అదే కదరా నా బాధా అర్థం చేసుకునే మనసే లేదా…” అంటూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ బుంగమూతి పెట్టింది నువ్ అన్నట్లు మన మధ్య ఏదో బంధం ఉంటే మళ్ళీ మనం కలిసినప్పుడు చూద్దాం… సరే సరే ఇపుడు ఏమంటావ్ “నీతో ఒక కాఫీ ..
సరే పదా..
“హాయ్ సరళ ఎలా ఉన్నావ్…? హే మానసా బావున్నావా…?ఔనూ ఈ నస మీక్కూడా పరిచయమా…! “అదేంటీ కిరణ్ ఇది మా క్లాస్ మేట్ అంటూ ఆశ్చర్యంగా కిరణ్ వైపు చూసింది సరళ మత్తెక్కించే చూపులతో కిరణ్ మనసును గుచ్చుకుందీ మీరు నాగాపూర్ ప్యాసింజర్ లో జర్నీ చేశారు అపుడు మీకు నా నెంబర్ కూడా ఇచ్చాను గుర్తుందా ..?”ఓహ్ అది మీరేనా…! ఇపుడేంటీ ఇంత అందంగా ఉన్నారు అపుడలా కనిపించలేదు …?”అబ్బ చా…!నీకు నేను పరిచయం అయాను కదా…నీలో పురుశత్వం పురివిప్పి రసికత్వం వికసించి రాళ్ళు సైతం రత్నాల్లా కనిపిస్తున్నాయి….” “నేను రాయిని కాదే సరళ మైన దానిని…నువేంటీ కిరణ్ ఒకసారైనా మాట్లాడలేదు…?ఆ నెంబర్ ఎకడో పోయింది…”అదే కదా నా బాధ సరళంగా సరసమాడాలనీ చూస్తున్నావేమోననీ..
“అమ్మో దీని వాలకం చూస్తుంటే నాకంటే ముందే కిరణ్ నీ వళ్ళో వేసుకునేలా ఉంది దీనిని పక్కన పెట్టేయాలి.
“సరళా బాయ్ మళ్ళీ కలుద్దాం అంటూ మానస వెళ్తుంటే కిరణ్ వైపు సరళ అదోలా చూసింది ఆ చూపులతో తనను తానే మర్చిపోయాడు కిరణ్ కానీ మానస ఊరుకుంటుందా… “నువ్ తనతో మాట్లాడవద్దు కిరణ్” ఏ ఎందుకూ….?”నాకు నచ్చదూ” ఎందుకో….? “అదంతా నాకు తెలియదు” ఓహో నీకు కాకుండా తనకీ ఎక్కడ పడుతానో అని భయమా…!”అలా ఎందుకు ఉంటుంది”తను నీకంటే అందంగా ఉంటుంది కదా… “ఏంటీ నాకంటే అందంగానా..?ప్రపంచ సుందరి పోటీలు పెడితే ప్రతిసారి నాకే కిరీటం వస్తుంది” అబ్బో…..!అదంతా నాకు తెల్వది నువు తనతో మాట్లాడవద్దు అంటూ చాలా ఏడ్చేసింది అమ్మో ఇలా ఏడుస్తున్నావేంటీ ఎవరైనా చూస్తే నేనేమైనా చేశానేమో అనుకుటారు”మరీ నువ్ తనతో మాట్లాడవద్దు “ఎలా మాట్లాడుతాను తన నెంబర్ నా దగ్గర. లేదు కదా… ఇస్తావా..? “చంపేస్తా”
“ఇది నా నెంబర్ అప్పుడపుడు మాట్లాడుతూ ఉండూ కిరణ్ అంటూ వెళ్లి పోయింది…
ఏంటీ ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది తనకూ ఏం కావాలి అంటూ ఆలోచనలో పడిపోయాను డిగ్రీ ఎగ్జామ్స్ పూర్తి చేసుకొనీ జాబ్ కోసమనీ సిటీ వెళ్ళాను…
చైతన్యపురీ కాలనీలో సాఫ్టువేరు కంపనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ ట్యూషన్ చెపుతు ఉన్నా ఇలా రెండు సంవత్సరాలు తన గురించి ఆలోచించే టైం దొరికేది కాదు.. ఒకరోజు ఆఫీసు కి వెళ్ళే బస్ చాలా రద్దీ గా ఉంది వెనక డోర్ పొనా ఫుట్ పాత్ పై నిలబడి అతికష్టం మీద గమ్యం చేరాను. ఎవరో నా పర్స్ మొబైల్ కొట్టేశారు తన గురించిన ఒక జ్ఞాపకం నా మొబైల్లో తన నెంబర్ అదీ కూడా పోవడంతో ఇక జీవితంలో తను నాకు కలవదేమో అనుకున్నా .విధి విచిత్రమైనది కదా…!బాధతో కాలం గడిపాను.
ఇంతలో నాన్న ఫోన్ హలో నాన్నా బావున్నరా.. “ఔనురా కన్నా నువ్ ఎలా ఉన్నావ్” బావున్నా నాన్నా అమ్మ బావుందా ఒకసారి ఫోన్ తనకీ ఇవ్వు”అలాగే”అమ్మా ఆరోగ్యం బావుందా వేళకీ భోజనం చేస్తున్నావా…?నేను ఇకడా సంతోషం గానే ఉన్నాను బెంగ పెట్టుకోకు.”అలాగే రా నాన్నా…. ఓరీ చిన్నా 22 జూన్ కి బాబాయ్ వాళ్ళ కూతురు శ్రీలత అక్కా వివాహం నిశ్చయం అయిందిరా నువ్ జూన్ 10కల్లా వచ్చెయ్”అలాగే నాన్న తప్పకుండా వస్తాను.
“ఏరా కిరణ్ ఎపుడు వచ్చావ్” బాబాయ్ నిన్ననే వచ్చాను.”రేపు మన ఇంటికి వచ్చెయ్ అక్క పెళ్ళి పనులు చాలా ఉన్నాయి”ఆ అలాగే బాబాయ్.
హాయ్ అక్కా ఏంటీ పెళ్ళి కళ కొట్టొచ్చినట్లుగా ఉంది చాలా బావున్నావ్.”ఏరా అలా మాట్లాడుతున్నావ్” నిజం అక్కా..”సరే బావున్నావా…?ఔను అక్కా….”రేపు మా ఫ్రెండ్ వస్తుంది నువే దగ్గరుండి రిసీవ్ చేసుకోవాలి వారం రోజులు ఇక్కడే ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరక్కా ఆ ఫ్రెండ్….”మా హాస్టళ్లో మా జూనియర్… తన పేరు… అవసరం లేదు అక్కా…తను రాగానే చెప్పు నేనే వెళ్లి తీసుకవస్తాను…
“హలో శ్రీలతా నేను ఇక్కడే బస్టాండ్ లో ఉన్నా అడ్రస్ తెలియదు కదా…!సరే మా బ్రదర్ వస్తున్నాడు అక్కడే ఉండు.”తనకు నేను తెలియదు కదా…ఏం పర్లేదు నేను చెబుతాను.సరే నేను బ్లూ కలర్ చుడీదార్ లో ఉన్నాను అనీ చెప్పు.
“కిరణ్ మా ఫ్రెండ్ బ్లూకలర్ చుడీదార్ లొ బస్టాండ్ లో వెయిట్ చేస్తుందిటా నువ్ వెళ్ళి తీసుకురా…అలాగే అక్కా…. ఫల్సర్ బైక్ పై వెళ్ళాను.. ఎక్కడా బ్లూకలర్ చుడీదార్ అని వెతుకుతున్నా నాకు “ఎన్నళ్ళో వేచిన ఉదయం ఈ నాడే ఎదురొస్తుంటే” అన్నట్లు గా…”హలో మీరేంటీ ఇక్కడా…? మా ఫ్రెండ్ పెళ్ళి కి వచ్చాను…ఎవరా ఫ్రెండ్…?శ్రీలతా….!ఔనా తను మా అక్కా… రియల్లీ ఐయీమ్ సో హ్యాపీ వారం రోజులు మనం కలిసే ఉండబోతున్నాం…”బైక్ పై తనతో ప్రయాణం చస్తుంటే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినపుడు తన తనువు నా తనువుతో తడబడుతుంటే…తన వృక్షోజాల కొనలు నను గుచ్చుకొని గిలిగింతలు పెడుతూ ఉంటే పులకరించిన నా మనసు ఇలా”దోచుకున్నది దొరసాని సరాసరీ హృదయాన్ని గుచ్చుకున్నది గురిచూసి పూలబాకునీ”అని పాడుకుంది. కిరణ్ ఇన్ని రోజుల ఫోన్ చేయలేదు నేనంటే ఇష్టం లేదా..?అది కాదురా వర్క బిజీ గా ఉండడంతో చేయలేక పోయాను తర్వాత మొబైల్ ఎకడో పోయింది నీ నెంబర్ దొరకలేదు.”చూశావా ఆ రోజు మన మధ్య ఏదో బంధం ఉందంటే లేదని మళ్లీ కలిసినప్పుడు చూస్తా అన్నావ్ ఇపుడు ఏమంటావ్. ?ఏమంటాను నువ్ అన్నదే ఔనంటాను.”సరే రా నా పై నీ అభిప్రాయం ఏంటీ…?ఏముందీ ఇంతవరకు ఫ్రెండ్ ఇపుడు అక్కవాళ్ళ ఫ్రెండ్ కాబట్టి సిస్టర్ “చంపేస్తా” ఎందుకు అక్కవాళ్ళ ఫ్రెండ్ తమ్ముని కి చెల్లి అవుతుంది కదా…”అదేం కుదరదు..నువేం అంటావు…?మనం ఫ్రెండ్స్ కాదు కాబోయే భార్యాభర్తలం.అది కాదురా నాకు అలాంటివేం నచ్చవు ఈ పెళ్ళి తర్వాత అన్ని క్లియర్ గా చెప్పేస్తా..”ఎందుకురా ఇంకెవరైనా నీ మనసు లో ఉన్నారా…?ఐనా నీలాంటి మట్టి బుర్ర లో నేను తప్ప ఇంకెవరుంటారు…లేదురా ఇంతవరకు నీ పై నాకు ఆ ఆలోచనలు లేవురా..”ఇపుడు పెంచుకో ఏమౌతుంది…?చూద్దాం ఇల్లు వచ్చింది దిగండి.
“హాయ్ షీలా బావున్నావా…!ఏంటీ ఇంత సడెన్ గా పెళ్ళి చేసుకుంటున్నావ్…?ఏముందీ చదువు అయింది ఎలాగు పెళ్ళి చేసుకుంటే ఓ పనైపోతుంది కదా అనీ….!
ఏంటీ ఈ క్షణం నాలో ఇలా జరుగుతుంది తన స్పర్శ తాకిన తనువు పులకరిస్తుంది నాలో తనకు ఏం నచ్చింది, నిజంగా ఇది ఏదైనా బంధమా, విచిత్రంగా తను నా వెంట పడడమేంటీ…బంధం లేదు ఏంలేదు ఒకవేళ బంధమే ఐతే నా పరిస్థితి ఏంటీ ఇంట్లో ఒప్పుకోరు కదా…చూద్దాం లే ఆ టైం వచ్చనపుడు ఆలోచిద్దాం లే ఇలా ఆలోచనలతో పెళ్ళి అంతా జరిగిపోయింది. అక్కా బావా అత్తారింటికి వెళ్తూ కిరణ్ తనని సిటి అంతా తింపు ఏ లోటు రాకుండా చూసుకో..అలాగే అక్కా..మానస వెళ్ళొస్తాం హ్యాపీగా ఉండు ఇకడి అందాలు చూడు అలాగే…
“కిరణ్ వెళ్దామా…?ఎక్కడికీ….మీ అక్క చెప్పింది కదా…తప్పుతుందా పదా…! “ఏంటీ అంత అయిష్టతా….?నథింగ్,ఇది ప్రాణహిత నదీ ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది.”ఐతే అందులో తోసేస్తావా…!(అంత అదృష్టమా..!) కాదు ఈ జారుడు బండలపై సరదాగా సాయంకాలం గడుపుతుంటే ఆ అందం ఆనందమే వేరు.”నాకు నదీ స్నానం అంటే చాలా ఇష్టం నువు రా కలిసి ఈతకొడుదాం.. పర్లేదు నువు కానివ్వు.”నాకు ఏ లోటు రాకుండా చూడభనీ మీ అక్క చెప్పింది మర్చిపోయావా..? లేదు నువు మర్చి పోనిస్తావా…?”ఐతే రా… తప్పదా..ఊహూ….ఇద్దరం సరదాగా ఈతకొడుతుంటే తడిసిన వస్త్రాలలో తన ఒంపుసొంపులు ఒయ్యారం చూస్తూ ఉంటే మతి పోయినట్లైంది.తదేకంగా తననే చూస్తూ ఉండిపోయాను. ఒక్కసారిగా నను గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకుంది ఊహించని ఆ పరిస్థితి కీ బిత్తరపోయి చుట్టూ ఎవరున్నదీ చూడకుండా ఇలా చేస్తుందేంటనీ కోపగించుకున్నా తను ఏడ్చేసింది అయ్యో ఏమైందీ,నువు చేసిందేమిటీ…! “మరీ నువు చూసిందేమిటీ…?” పదా ఇక్కడ అద్దాల మేడా ఉంది దానిలో ప్రతిబింబాలు వింతగా కనిపిస్తాయి. “అలాగా…!బట్టలు ఉన్నవారిని లేనివారిగా చూపిస్తాయా..”హ్మ్ అదేంటీ.!”మరి వింతా అంటే..? చూద్దువుగా నీకే తెలుస్తుంది.”ఇదేందీ ఈ అద్దంలో నువు లావుగా,మరో దాంట్లో కనిపిస్తున్నావు ఎందుకలా…?”అదే ఇక్కడి ప్రత్యేకత.
“ఈ మామిడి తోట చాలా బావుంది ఇక్కడ కాసేపు కూర్చుందాం అంటూ నా ప్రక్కనే కూర్చుంది కబుర్లు చెబుతూ నా ఒళ్ళో వాలిపోయింది.ఏరా ఈ చల్లగాలి మామిడి పూత వాసనా చూస్తూ ఉంటే నీకు ఏమీ అనిపించడం లేదా…?” ఊహూ…”నీకు టేస్టీ లేదురా…” ఏ ఎందుకూ…..!నీకు ఏమైనా అనిపించిందా..?”ఔనూ విరహ వేధన లో ఉన్న ప్రేమికులు కలిసినట్లు అనిపిస్తుంది.”ఏంటీ మనం ప్రేమికులమేంటీ. ..? “నువు నవమన్మథుని లా ఉంటావ్ రా నేను రతి దేవిలా కనిపించలేదా….నీలో స’రస రాగాలు రవళించలేదా…?లేక నీలో ప్రేమ పవళించిందా …? “ప్రేమా లేదు దోమ లేదు నువు అక్కవాళ్ళ ఫ్రెండ్ వి నువు ఇక్కడి నుండీ వెళ్ళే దాకా నిను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత.”జాగ్రత్తగా అంటే నేను అడిగింది ఇస్తావా…!య…. “ప్రామిస్” ఒకే ప్రామిస్. “ఒకసారి నాకు నీతో ఆ బంధం కావాలీ…”ఏ బంధం ..?”మట్టి బుర్ర ఏం తెలియదురా… శారీరక సంబంధం…”ఏంటీ…!నీకేమైనా పిచ్చా…ఏం మాట్లాడుతున్నావ్ నెవర్ అది జరగని పనీ…పదా ఇంటికి వెళ్దాం….
నా పై కోపంతో ఉండే ఎలా కన్విన్స్ చేయాలా…గుడ్ మార్నింగ్ మానసా…ఇవాళ నీకో ముఖ్యమైన చోటు చూపిస్తా వెళ్దామా… “ఎందుకూ” నువ్ ఒంటరిగా ఉన్నావ్ కదా కాస్తా రిలాక్స్ గా ఉంటుంది.”అక్కడ వాతావరణం బావుంటుందా .?నువ్ ఊహింనంతా….ఔనా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం… కాళేశ్వరం ముక్తీశ్వరాలయం.. అయితే పదా…”వామ్మో ఏంటీ ఇకడ నదీ ఇంత వెడల్పు గా ఉంది….?” ఇక్కడ త్రవేణీ సంగమం అని చెప్పుకుంటారు. “సంగమం అంటే…?”రెండు నదులు కలయిక ప్రాణహిత గోదావరి కలిసి ఇంత వెడల్పు గా ప్రవహిస్తాయి అంతర్వాహిణి లా సరస్వతి నదీ ఉందని ప్రసిద్ధి.”ఔనా….!మరి మన సంగమం ఎప్పుడూ. ఏ బుద్ధి లేదా నీకు మన సంగమం ఏంటీ….?ఏం మాట్లాడుతు ఉన్నావ్ .?”ప్లీస్ రా ఏరా కోపం వచ్చిందా… నాతో మాట్లాడవా అంటూ చిలిపిగా ప్రవర్తించేది.ఇది శివలింగం దీనిపై రెండు రంద్రాలు ఉంటాయి అందులో ఎంత నీరు పోసినా నిండవంటా ఇది సరస్వతీ మాత మందిరం ఇక్కడ అక్షరభ్యాసం చేయించుకుంటే చదువు బాగా వస్తుంది’ట.”ఐతే మన పిల్లల కు ఇక్కడే చేయిద్దాం.. ఇది ఏ విగ్రహం..? కాలభైరవ,అదేంటీ అలా ఉంది…!ఎలా…? “వివస్త్రని వైనా నీలా…”నిన్నూ అది దేవుడే అలా అనకూడదూ “నా దేవుడు నువ్వే కదరా .. ఐనా దేవుళ్ళ కే ఉందీ,సృష్టిలో అది ఒక భాగమే కదా…నేను కోరేదేంట్రా ఒక్కసారి ప్లీస్ రా…” అలాంటి ఆశలేం పెట్టుకోకు . “సరే నాతో మాట్లాడకూ” అని. విసురుగా వెళ్లి పోయింది. ఏ మానస ఆగూ ఒకదానివే ఎలా వెళ్తావు నేనొస్తా ఆగు వినడం లేదు చివరికి ఎలాగోలా ఒప్పించి ఇద్దరం పడవలో ప్రయాణం చేస్తుంటే తను నా ప్రక్కనే కూర్చుంది అనుకోకుండా నా చేయీ తన నడుము కి టచ్ అయింది దాంతో కోపంగా తిట్టేసింది అక్కడ నుండి ఇంటికీ వచ్చాము కాని తను ముబావంగా ఉంది ఏంచేయాలో తోచలేదు చాలా బాధ అనిపించింది..
“కిరణ్ గుడ్ మార్నింగ్” హమ్మయ్య బ్రతికాను నా పైన కోపం పోయింది.”నాకు అచ్చం పల్లెటూరి అమ్మాయి లా ముస్తాబు అవాలనీ ఉంది”ఓకే అలాగే ఎవరు కాదన్నారు. “నువేం చేయవా…?నేనేం చేయాలి ….!”వెళ్లి లంగా ఓని తీసుకురా…”ఏంటీ నేను తీసుకురావాలా…!”మరీ నీ బాబు తెస్తాడా….”నో నేను తేను…”నేను ఏడుస్తా…అమ్మా తల్లీ తప్పుతుందా… వీణా ఒక లంగా ఓనీ ఉంటే ఇవ్వవే “ఏ ఎందుకు అన్నయ్యా.. మానస కీ లంగా ఓనీ వేసుకోవాలనీ ఉందటా…ఏంటీ అన్నయ్యా తన కోరికలు తీరుస్తున్నావు ఏంటీ విషేశం ప్రేమ దోమ కాటేసిందా..ప్రేయసి వాటేసిందా..ఎహే అలాంటిదేం లేదు తనకు ఎవరు తెలియదు కదా నేను తనకు తోడుగా ఉన్నా అంతే.తను కావాలంటే అడిగాను ఇస్తావా లేదా…? “తనకు నచ్చుతుందో లేదో కానీ ఇదే ఉంది ఇదిగో… నువు అడిగిన లంగా ఓనీ నచ్చిందా… “వ్వావ్ ఎంత బావుందో….!చాలా చాలా బావుందీ థ్యాంక్యూ సో మచ్”అంటూ గట్టిగా వాటేసుకుని బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ క్షణం లో ఆశ్చర్యంగా ఉన్నా ఆ గులాబీ రంగుల అధరాలు చెంపను తాకగానే ఒక్కసారిగా నాలో ఏదో జరిగింది ఆ షాక్ లో నుండి ఇంకా తేరుకోనేలేదు.
“హాయ్ ఎలా ఉన్నాను” అనే తన మాటతో ఈ లోకంలోకి వచ్చాను. అరవిరిసిన అరవిందం లాంటి ఆ అందం,పురివిప్పిన మయూరం లాంటి ఆ సౌందర్యం,సూరీడినే తలదన్నే ఆ నుదుటి కుంకుమ,మోముపై కదలాడే ముంగురుల సోయగం,శంఖాన్ని సైతం మైమరిపించే ఆ కంఠం,మెడలో చిన్న లాకెట్ గిరులను మరిపించే ముంగిరులు, పూలతీగ లాంటి సన్నని లేత నడుము, ఏమా సెక్సీ అందం అంటూ మనసులోనే అనుకున్నా నాకు తెలియకుండానే ఆ మాట బయటకు వచ్చేసింది.”ఏంటీ కిరణ్ అలా అన్నావు” అనాలనిపించింది అన్నాను ఒకసారి టచ్ చేస్తే బావుండు.ఆ క్షణం తను నా స్వంతమైతే బావుండూ అనిపించింది. చ చ తప్పు అలా ఆలోచించద్దూ అంటూ వెళ్లి పోయాను.
“కిరణ్ చాలా బోర్ గా ఉంది ఎదైనా చేద్దామా…”సరే దగ్గర పార్క్ ఉంది వెళ్దామా…!బైక్ పై వెళ్తుంటే మెల్లిగా తన రెండు చేతులతో నడుమును గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శ కు నాలో నవమన్మథుడు నిద్రలేచాడు తప్పుచేస్తానేమో అనేంతగా భయం వేసింది కానీ ఒక్క క్షణం ఆలోచించి మౌనంగా ఉండిపోయాను. పూలచెట్లు తాకిడి ఒళ్ళంతా పాకుతుంటే తనేమో తదేకంగా నన్నే చూస్తూ ఉంది.
“ఏం కిరణ్ మాట్లాడవేంటీ
ఆస్వాదిస్తున్నా “ఏంటీ…..?” ప్రకృతి అందం.”ప్రకృతి అందమా ఈ ప్రణయకాంత సౌందర్యమా..!అంతలా ఫీలవకూ నను సొంతం చేసుకుంటే జీవితాంతం నా అందంతో నిను మురిపిస్తా కదా…!అవేం మాటలూ నీపై నాకు ఆ అభిప్రాయం లేదు . “నాకు నువు కావాలీ అంటూ నను తన బాహువుల్లో బంధించింది. ఇదీ పబ్లిక్ చోటు ఎవరైనా చూస్తే బావుండదు. “సరే ఫ్రైవసీ చోటుకు వెళ్దామా అక్కడైతే ఎవరూ ఉండరూ ఏమి చేసినా ఎవరు చూడరూ.. అదేం కుదరదూ..”ప్లీస్ రా కాసేపు నీ ఒళ్ళో పడుకోవాలనీ ఉంది.”అదేం ఆశనే “ఆశ కాదు కోరిక”సరే పదా కాసేపు పార్క్ లో గడిపి ఇంటికి వచ్చాము కానీ నా మనసంతా అదోలా ఉంది.
“కిరణ్ ఏదైనా సాంగ్ ఉంటే పెట్టూ డాన్స్ చేద్దాం… “నాకు ఓపికగా లేదు నువు చేసుకో..తను పరికిణీ ఓనిలో అచ్చతెనుగు అమ్మాయి లా డాన్స్ చేస్తూ ఉంటే నాలో ఏదో మైమరుపు అక్కడి నుండి దూరంగా వెళ్ళి గదిలో పడుకున్నా వింత ఆలోచనలు నను కుదురుగా ఉండనీయడం లేదు.ఒక్కసారి.చదువు ఉద్యోగం పెద్దవారు గుర్తువచ్చీ అన్ని మరిచే ప్రయత్నం చేశాను
“కిరణ్ నీతో ఒక ఫోటో కావాలిరా ప్లీజ్ రా సరే పదా సిటీ అంతా తిరిగాము ఎక్కడ స్టూడియో లు తీసిలేవు సారీ రా…పర్లేదు కాసేపు నదీతీరంలో బండలపై కూర్చొని సరదాగా మాట్లాడి వచ్చశాం..
రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం ఒకే చోట పడుకున్నాం 12తర్వాత తను నా ప్రక్కన పడుకుని నా చేయిని తన నడుము పై వేసుకుని అలా ఉండిపోయింది గాఢ నిద్రలో ఉన్ననాకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది ఏంటిదీ “మధ్యాహ్నం నడుం బావుందీ టచ్ చేయాలి అన్నావ్ కదా….అందుకే అవకాశం ఇచ్చాను ఇపుడు హ్యాపీ నా అని కాసేపు ప్రక్కనే పడుకొని వెళ్లి పోయింది.
ఉదయం 10గంటల ప్రాంతం లో అక్కా బావా అత్తారింటి నుండి వచ్చేశారు. “ఏ మానసా బావున్నావా…?ఈ మూడురోజుల్లో ఎలా గడిచింది హ్యాపీ నా ,కిరణ్ ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా..!
ఆ ఏమి లేదు బావున్నాను.
అన్నయ్యా బావున్నావా శ్రీలతా భోజనం సరిగా పెట్టలేదా చిక్కిపోయావు.”ఏంటే అప్పుడే అలా మాట్లాడుతూ ఉన్నావు, ఎంతైనా చెల్లిని కదా ఆ మాత్రం శ్రద్ద ఉండదా ఏంటీ…ఇంకా ఏంటీ విశేషాలు ,”ఈ మూడురోజులు ప్రపంచాన్ని మరిచి పోయాను.కిరణ్ చాలా మంచివాడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారో కాని చాలా అదృష్టవంతురాలు.”అలా అంటావేంటీ…!లేదు షీలా నిజం నేనే కనుక ఆ అదృష్ట వంతురాలినైతే ఎంత బావుండో..
“ఇదేంటీ మానస కిరణ్ కి ఇంత లా దగ్గరైంది అమ్మో ఒకవేళా ఇంకా ఇకడే ఉంటే పొరపాటు జరిగేలా ఉంది వెంటనే తనను పంపించేయాలి
“కిరణ్ “అక్కా…మానస పై నీ అభిప్రాయం ఏంట్రా…?నథింగ్ అక్కా ఎందుకూ అలా అడిగావు ఏం లేదురా తను ఏదోలా ఫీల్ అవుతుంది. సరే తను రేపు ఊరు వెళ్తుంది బస్ ఎక్కించి రా…అలాగే…
ఉదయం 5గంటల కే నిద్ర లేచింది తయారు అయింది మానసా ఈ రోజు వెళ్తున్నావా….”లేదు మరో మూడురోజులు ఇక్కడే ఉంటా. వద్దు ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారు.”ఏం పర్లేదు ఏమి అనుకోరు….మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం కిరణ్ వాళ్ళ ఊరికి వెళ్తాడు ఒకదానివే ఉండలేవు కదా. .”ఓ అలాగా సరే.ఇదేంటీ షీలా నను వదిలించుకోవాలని చూస్తుదా.. అలా ఎందుకు అనుకుంటుంది బెస్ట్ ఫ్రెండ్ కదా..”కిరణ్ వెళ్ళరా పదా మానస…బస్ ఎక్కించి బాయ్ చెప్పాను బస్ కాసేపట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. “కిరణ్ మన స్నేహంలో చాలా చవి చూశాను వెళ్ళాలి అనిపించడంలేదు రా..”కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి.ఒక లిటిల్ హార్ట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్తుంటే…”కిరణ్ ఒక నిమిషం. చెప్పు మనం నదీతీరానికి వెళ్దాం.. ఇపుడా కాసేపట్లో బస్సు వెళ్తుంది మళ్లీ ఇప్పుడు బస్ లేదు.”ప్లీస్ రా మళ్ళీ నాకీ అవకాశం రాదు”అంకుల్ కాసేపు బస్ ఆపండి మొబైల్ ఇంట్లో మర్చిపోయాను అని చెప్పి నదితీరం తీసుకెళ్లాను. చిన్న చిన్నగా వర్షం పడుతుంది రెయిన్ కోట్ తనకు ఇచ్చాను. నదిలో ఆడుకుంటూ “నీకు రెయిన్ కోట్ లేదు గా నా ఒళ్ళో వెచ్చగా ఉంచుతాను రా..అలా అనకూ ఎవరైనా వింటే బాగోదు.”మరేం పర్లేదు అనీ గట్టిగా లాగేసీ నను తన తనువు లో కలిసి పోయేలా వాటేసుకుంది. అక్కడ నుండి బస్ ఎక్కి “కిరణ్ ఇది నా నెంబర్ మళ్ళీ మిస్ చేసుకోకు అపుడపుడు మాట్లాడుతూ ఉండు”అని చెప్పి వెళ్ళిపోయింది.
నాకు కూడా తన ఎడబాటు బరించలేక గుండె బరువెక్కింది కానీ ఏంచేస్తాం ఇంకా ఇక్కడే ఉంటే తనతో తిరిగిన చోట్లు క్షణాలు గుర్తు వచ్చి బాధ కలిగిస్తాయి అని భావించి మా ఊరు వెళ్ళిపోయాను…
“ఏరా నాన్నా ప్రయాణం బాగా జరిగిందా…? ఔనమ్మా .. నాన్నగారు లేరా…”ఇపుడే బయటకు వెళ్ళారు…నీ సిటిలైఫ్ ఎలా ఉందిరా వేళకీ భోజనం చేస్తున్నావా…?సరిగా నిద్రపోతున్నావా….?పూర్తిగా ఇంటికి ఎపుడు వస్తావు…?ఏ ఎందుకు అమ్మా…”ఏం లేదురా నీకు పెళ్ళి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది కదా …నాకు ఇపుడే పెళ్లి ఏంటమ్మా…?ఏరా ఎవరినైనా ఇష్టపడుతున్నావా. హ్మ్ అమ్మేంటీ ఇలా అడిగేసింది అంటూ ఒక్కసారిగా తడబడి లేదమ్మా ..”చూడు నాన్నా ప్రేమా వ్యామోహం అంటూ సిటీ కల్చర్ మొత్తం అలాగే ఉంటుంది మన వంశానికి సమాజంలో గొప్ప పేరు ఉంది ఆ పేరు నీ వలన పోవద్దు.అవేం మాటలు అమ్మా నాకు జాబ్ బిజీ లో తీరికనే లేదు ఇంకా ప్రేమించే టైం ఎక్కడిది…”సరే సరే స్నానం చేసిరా భోజనం చేద్దువుగాని ప్రయాణం లో అలసి పోయావు.
“ఏమండి కిరణ్ వచ్చిండు ఔనా…బావున్నాడా ఏమంటున్నాడు …ఏముంది ఇపుడే పెళ్ళి వద్దంటా జాబ్ రాగానే చేసుకుంటా అంటున్నాడు.ఇంకేం ఏం తొందరా వాని కాళ్ళ మీద వాడు నిలబడనీయ్యు..నాన్నా బావున్నారా… ఔన్రా కిరణ్ కులాసేనా…ఔను నాన్నా… అందరం భోజనం చేస్తున్నాం ఇంతలో ఫోన్ “కిరణ్ నేను ఇంటికి చేరుకున్న హ్యాపీ నేనా.. ఇదేంటీ మళ్ళీ ఫోన్ చేసింది మర్చిపోవాలనుకుంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. అనుకుంటు భోజనం చేసి పడుకున్నా ఒంటరిగా ఉన్నా నాకు తన ఆలోచనలే… ఎలాగోలా ఆ రాత్రి గడిచింది.
ఏరా గిరీ ఏంచేస్తున్నావ్ “ఇంటర్ అయిపోయింది ఎమ్ సెట్ రాశాను…కంగ్రాట్స్ రా బాగా చదువు …పిన్నీ బావున్నావా… ఔను బాబు ఏదైనా జాబ్ చేస్తున్నావా… ఔను పిన్నీ కాంట్రాక్టు జాబ్ పర్మినెంట్ కాదు..బాబాయ్ లేరా…పూజ చేసుకుంటున్నారు ఓ పది రోజులు ఉంటావా.. లేదు పిన్నీ ఇప్పటికే పదిరోజులు అయింది రేపు వెళ్ళాలి.నమస్తే బాబాయ్ బావున్నారా…?ఔన్రా టిఫిన్ చేశావా లేదు బాబాయ్ చేసి వెళ్ళు.అలాగే బాబాయ్…
నాన్నా నేను సిటీకి వెళ్ళాలి “సరే ఏమైనా ఖర్చు లకు కావాలా…వద్దు నా దగ్గర ఉన్నాయి. .ఎపుడస్తావురా…దీపావళికీ వస్తా…
మల్కాజిగిరి లో ఇంతకు ముందు జాబ్ లో జాయిన్ అయాను నా స్నేహితుల సమూహం లో ఇన్నాళ్లు గమనించని ఓ కొత్త విషయాన్ని గమనించాను.కారణం ఏంటో తెలియదు కానీ మానసతో వారం రోజులుగడిపిన అనుభవమో ఏమో..
“ఏరా కిరణ్ పెళ్ళి బాగా జరిగిందా..?ఏం చెప్పడం లేదు. బాగానే జరిగింది వారంరోజులు చాలా ఎంజాయ్ చేశాను.. “ఔనా కంగ్రాట్స్ ఎవరా సొగసరి. హ్మ్ ఏంట్రా అలా అన్నావ్ కంగ్రాట్స్ ఎందుకు రా.!మాకు తెలుసు లేవోయ్ ఈ వయస్సు లో ఉన్నవారు ఎంజాయ్ అంటే ఖచ్చితంగా అది అమ్మాయి తోనే అయి ఉంటుందిరా అందుకే నిజమేనా ప్రేమ బీజం నాటినవా మొలకెత్తిందా.
వీడేంటీ ఇంత కరెక్ట్ గా అంటున్నాడు లేదురా వికాస్. “మాకు ఇది చాలా అనుభవం ఆ విషయంలో తలపండిన వాళ్ళం మేము మా దగ్గర నే దాస్తున్నావా చ చ అలాంటిదేం లేదు.అనుకుంటున్నా కాని వాళ్ళ మాటలతో నాకు ప్రేమ మీద నమ్మకం అభిమానం పెరిగింది ఇక వారితో ఎక్కువగా గడపడం మొదలు పెట్టాను.
మా ఫ్రెండ్స్ వికాస్ మహేష్ ఇద్దరూ క్లాస్ మేట్స్ మా ఆఫీసులో జాబ్ చేయడం తో రోజు కలిసి వెళ్ళడంతో పరిచయం పెరిగింది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కలిసే వాళ్ళం ఎప్పుడూ ప్రేమ పాటాలే చెప్పేవారు.నాలో చాలా మార్పు మొదలైంది తనకు నిజంగా నాపై ప్రేమ ఉందా…ఈ అనుభవం ప్రేమేనా అని డౌటు వచ్చింది.
హలో మానసా నేను కిరణ్ బావున్నావా…?”ఔను కిరణ్ నువ్ ఎలా ఉన్నావు.. జాబ్ చేస్తున్నావా ఖాళీగానే ఉన్నావా…?చేస్తున్న ఏ ఎందుకు…?”జాబ్ బిజీలో ఉఃటే కాల్ చేయవుకదా… అందుకే ఆశ్చర్యం వేసిందీ అదేం లేదు .”ఇంతకీ కాల్ ఎందుకు చేశావ్…?ఊరికే మాట్లాడదామని..”అబ్బచా…ఏంటీ ప్రేమ బీజాలు మొలకెత్తుతున్నాయా…నాతో మాట్లాడాలనీ మనసు తహతహ లాడుతుందా…. ఎహే లేదు..తను ఇలా అంటుందేంటీ నా భావాలు ఇంత కరెక్ట్ గా ఎలా చెబుతోంది దేవుడు మా ఇద్దరికీ రాసి పెట్టాడా నిజంగా ఇది బంధమేనా అంటూ ఆలోచన లో పడిపోయాను ఇంతలో ఫోన్ కట్ అయింది.
“గుడ్ మార్నింగ్ రా కిరణ్, ఆ ఆకాష్ చెప్పు. “ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి రాత్రి నిదుర పట్టలేదా..!ఎనీ ఫ్రాబ్లం…?ఆకాష్ మీకు అబద్ధం చెప్పానురా,అక్క పెళ్ళి లో వింత అనుభవం ఎదురైందిరా.. “ఏంటీ…?ఆ అనుభవం పేరు ఇప్పటికీ అర్థం అవడం లేదురా…అసలు ఒక స్త్రీ పురుషుల మధ్య స్నేహం ఉండదారా…?”ఉంటుంది కానీ అది రాన్రాను ప్రేమగా మారుతుంది.ఏమైందిరా కిరణ్ ప్రేమంటే ఆమడ దూరంలో ఉండే నీవు ఇలా మాట్లాడుతున్నావు చెప్పరా.. ప్లీస్..చెపుతానురా అది స్నేహమో,మోహమో తెలియడం లేదు …”మేము చెప్పేస్తాం అక్కడ జరిగింది చెప్పు..పెళ్ళి లో అక్క ఫ్రెండ్ అమ్మాయి తన ప్రవర్తన చాలా ఇబ్బంది గా ఉండేది వింత చేష్టలు చేసేది .అదంతా మర్చిపోయానురా మీరు బలవంతంగా అడిగేసరికి తనకు ఫోన్ చేశాను తను నా ఫీలింగ్స్ ని కరెక్ట్ గా చెబుతోందిరా …ఈ ఆలోచనలతోనే రాత్రంతా గడిపాను.”ఔనా…! ఒరేయ్ కిరణ్ నువ్ ఇలాగే ఉంటే తనకు దూరం అవుతావురా. ఇపుడే కాదు ఇంకొంతకాలం దూరంగా ఉండు తన పై ఇదే భావం ఉంటే ఖచ్చితంగా తన దగ్గరకు వెళ్ళు మిస్ చేసుకోకు.ఇవాళే బాస్ కీ చెప్పు వేరే జాబ్ లో జాయిన్ అవుతున్నా ఈ జాబ్ కి 3నెలల్లో రిజైన్ చేస్తాననీ… ఓకేరా థ్యాంక్యూ…
గుడ్ మార్నింగ్ సర్.”రా కిరణ్ సర్ నాకు మారేజ్ ఫిక్స్ అయింది జాబ్ మనేసి మా ఊరు వెళ్తున్నా… ఔనా కంగ్రాట్స్ ఆల్ ద బెస్ట్ కిరణ్ విష్ హ్యాపీ మ్యారిడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్… థ్యాంక్యూ సర్.
మళ్ళీ నాగాపూర్ లో అదే కాలనీలో రూం వెతికాను దొరకలేదు ఇన్నిరోజులు తనకు ఫోన్ చేయాలంటే తీరిక దొరకలేదు తను మిస్ అవుతుందేమో అనే బాధ తో ఇంకొన్ని రోజులు గడిపాను. నాకు శివభక్తి ఎక్కువ ప్రతిరోజు గుడికి వెళ్ళేవాన్నీ దినచర్య లో బాగంగా ఆ రోజు శ్రావణమాసం సోమవారం శివాలయం వెళ్లి వస్తున్నా. అనుకోకుండా తను ఎదురుగా వచ్చింది ప్రాణం లేచివచ్చినట్లయింది.”ఎక్కడ ఉంటున్నావ్ కిరణ్…?టీచర్స్ కాలనీలో,మీ కాలనీలో రూమ్స్ లేవంట కదా…!”ఔనా ఓకే వీలు కుదిరినపుడు కలుస్తావుండు అంటూ వెళ్ళిపోయింది.
కొత్త జాబ్,కొత్త జీవితం వారం రోజులు బిజీనే ఒక ఆదివారం వస్తే సరదాగా బయటకు వెళ్ళేది ఇలా రెండు నెలు గడిచాయి మొదటి నెల జీతం తీసుకున్నా ఆ సమయంలో నా గుర్తుగా తనకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని కాల్ చేశాను ఇందిరా పార్కు కి వెళ్దాం ఇవాళ రండీ…”ఔనా నేనె మీకు కాల్ చేయాలి అనుకుంటున్నా..మీకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇస్తాను.”అదేం కుదరదు కిరణ్ నేనే మీకు జీవితం లో మర్చిపోలేని బహుమతి ఇస్తాను.అని చెప్పడంతో సంతోషం గా బయలుదేరాను దారిలో గోల్డ్ చొన్ లవ్ షేప్ లో లాకెట్ తెరిస్తే మా ఇద్దరి ఫోటోలు ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఉండేలా స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళాను.
“కిరణ్ ఈ సండే స్పెషల్ రోజంతా మీతో గడపాలని పిక్స్ అయాను. నేను కూడా అలాగే వచ్చాను ఇదిగో మన స్నేహానికి గుర్తుగా ఈ కానుకా. “ఇంకా స్నేహమేనారా…!కాస్తా ముందుకు రావచ్చు కదా.. స్నేహం ఎపుడూ స్నేహమే, “కాదు ప్రేమకు టర్నింగ్ పాయింట్ ఫ్రెండ్షిప్ అంటారు అది నా అభిప్రాయం.సరేకాని అక్కడ చల్లని చెట్ల నీడలో స్విమ్మింగ్ పూల్ లో చల్లగాలి కి సేద తీరినట్లుంది అక్కడ మాట్లాడుకుందాం పదా..ఒకే చెయిర్ లో కూర్చున్నాం తను నా ఒడిలో తలపెట్టుకొని చాలాసేపు పడుకుంది.తన చిలిపి చేష్టలతో తనువును గిలిగింతలు పెట్టేసింది రహస్య ప్రదేశాలను తాకుతూ రతి విణలను శృతి చేస్తూ శృంగార భావాలు రవళించేలా తన చూపులతో మత్తెక్కించింది.
ఒక్కసారిగా నా నరాలు జివ్వుమన్నాయి కామనాడుల్లో ఉద్రేకం కలిగింది. గట్టిగా వాటేసుకుని అధరాలపై ముద్దు పెట్టింది. ఆ క్షణం అలాగే శాశ్వతం అయితే బావుండు అనిపించింది. నేను మైకంతో తనను నా కౌగిలి లో బంధించాను.తన కళ్ళలో ఆనంద భాష్పాలు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంతో ఆమే మొహం కోటి కాంతులతో వెలిగిపోయింది.నాకు అనిపించింది అసలు స్త్రీ జన్మకు కావలసింది ఏమిటీ పురుష సంగమమేనా…అనీ ఇంకా ఇక్కడే ఉంటే ఏదో జరిగేలా ఉంది అని ఇంటికి వచ్చేస్తూ దారిలో పార్శిల్, తనకు కావలసిన వస్తువులు పూలు తీసుకుని వచ్చాము. డిన్నర్ చేశాము విశాలమైన గదిలో ఇద్దరమే ఉన్నాం అసలే వర్షాకాలం ఆకాశం మేఘావృతమై ఉంది ఉరుములు మెరుపులతో ప్రకృతి భయంకరంగా ఉంది . గాలి బలంగా వీస్తుంది చలి తీవ్రంగా ఉంది .దానికి తోడు కరెంట్ కూడా పోయింది. ఉరుముల శబ్దానికి తను భయంతో నను వాటేసుకుంది. తడిచిన వస్త్రాలలో తన ఒంపుసొంపుల ఒయ్యారాలు నాకు మత్తెక్కించేస్తున్నాయి ఉదయం నుండి తనకు దగ్గర గా ఉన్న నేను నన్ను కూడా మర్చిపోయాను తన కర స్పర్శతో అర్ధరాత్రి వేళ ఉరుముల మెరుపుల సాక్షిగా శారీరకంగా ఒక్కటయ్యాం. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. తన సంతోషానికి అవధులు లేకుండా పోయింది. నీతో ఈ బంధం కోసమే ఇన్నాళ్లు వేచిచూశాను అంటూ ఒళ్ళో వాలిపోయింది.నా మీద నాకే అసహ్యం వేసింది.ఒక్కక్షణం ఇంత బావుంటుందా…ఇది శాశ్వత బంధం అయితే బావుండు తొలి అనుభవం లో నా తనువంతా పులకరించింది ఉదయం మళ్ళీ తనను పార్క్ లో దింపి వచ్చేశాను.
కానీ మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఎప్పుడూ తన ద్యాసనే ఎప్పుడెప్పుడూ కలుస్తామా అని ఉండేది .విలు కుదిరినపుడల్లా కలుస్తూ ఉండేవాళ్ళం.తనతో మాట్లాడుతా ఉంటే ఇంతకీ ముందు లేని కొత్త అనుభూతి కలిగేది నేను కుదురుగా ఉండలేక పోతున్నా ఒక్క క్షణం నరకంగా ఉండేది.అలా దీపావళి కి ఇంటికి వచ్చేశాను.
అమ్మ నాన్నా వాళ్ళు నాకోసం పెళ్ళి సంబంధాలు చూస్తున్నారనీ తెలిసి ఎలా చెప్పాలనీ ఆలోచిస్తున్నా.. !నేను ముభావంగా ఉండడం గమనించిన అమ్మ అడిగేసరికి చెప్పేశాను.”ఆ అమ్మాయి వివరాలు ఏంటీ…?”తెలియవు అమ్మా ఇష్టం అనిపించింది మీకు ఇష్టమైతే చేసుకుంటా మీ మనసు కు కష్టం కలిగించి కాదు అమ్మా. “అక్క పెళ్ళి అపుడు ప్రేమించడానికి టైం లేదు అన్నావ్ ఇపుడేంట్రా ఇలా అంటున్నావు…?” ఏమో అమ్మా తెలియదు తనను చూడగానే నాకోసం పుట్టిందేమో అనిపించింది. ఆ సంఘటన తర్వాత నుండీ నతన ఆలోచనలు నను కుదురుగా ఉండనీయడం లేదు మీకు చెప్పలేక తనను వదులుకోలేకా చాలా ఇబ్బంది గా ఉంది నాన్నగారితో ఒక మాట చెప్పమ్మా.ముందు అమ్మా నాన్నా కుటుంబం తర్వాతే ఇవి.”అలా ఎందుకు అంటావ్ రా పాతికేళ్ళు పెంచింది మేమైనా ముప్పాతికేళ్ళు ననీకు తోడుగా ఉండేది భార్య నేరా మనసుకు నచ్చిన వారితో జీవనయానం ఆనందంగా ఉంటుంది రా….. మాకు అభ్యంతరం ఏమి లేదు తను మనకు సమానంగా ఉంటే చాలు వివరాలు కనుకో నాన్నాగారితో నేను చెప్తాను….” థ్యాంక్యూ సో మచ్ అమ్మా…
హలో మానసా బావున్నావా… మన విషయం ఇంట్లో చెప్పశావా..”ఏ విషయం…?”మనం ప్రేమించుంకున్నా విషయం..”ఆ చెప్పలేదు..”మరేం పర్లేదు మీ నాన్నాగారి వివరాలు చెపితే మా పెద్దవాళ్ళు మాట్లాడుతారటా…”మా నాన్నగారు అడిచర్ల పరందామయ్య,అమ్మ విమల…”అడిచర్ల. ఇంటి పేరు మాకు పరిచయమే… “ఔనా…ఎలా..”మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అడిచర్ల నే…అంటే మీరు పద్మశాలీ నా… “ఔనూ….ఏ …”ఏంలేదు… మేము పద్మశాలీ నే …. ఒక్కసారిగా నాకు పెళ్ళై పోయినంతా ఆనందం కలిగింది. అమ్మకు చెప్పినా నాన్నా పెద్దవారు ఒప్పుకున్నారు ఇదంతా.ఒక నెలలో జరిగి పోయింది. నిజమే ఆ రోజు తను అన్నట్లు మా బంధం దేవుడు వేసిందే అనుకోకుండా తన పరిచయం తను మా కులం కావడం అదృష్టం.ఇపుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం మాకు ఒక పాప పేరు అలౌకిక…..
మీ
చిలకమారి తిరుపతి
9640908491
స్వరమయూరి
చెన్నూర్