***నగుమోము గలవాని***
నగుమోము గలవాని,
నవనీత చోరుని గని,
హరివిల్లె విరి సినది,
జగమెల్లా మురిసినది…
మొహన మురళీ రవమును విని,
కోయిలలే గొంతు కలిపినవి,
మయూరములే పురి విప్పి ఆడినవి,
గో క్షీరము స్రవించినది….
గోప కాంతలు బృందావనముకు,
గుంపులు గుంపులుగా పరుగులిడిరి
చిరు జల్లులలతో పుడమియే,
పరిమళములు వెదజల్లినది.
రాస లీల శుభారంభమైనది.
చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి.