హిందువుల పండుగలు

పండుగ – పదస్వరూపం :

“పండుగ” శబ్ద స్వరూపం సరైనది కాదు. పరియైన రూపం ‘పండుగులేదా పండువు’, జనవ్యవహారంలో అధికంగా పండుగ శబ్దమే వాడుకలో ఉండటం వలన ఆ శబ్దాన్నే గ్రహించాను. అని పండుగ పద స్వరూపం గురించి సురవరం వివరించారు. దీన్ని బట్టి వారు పదాల ఎంపికలలో గ్రంథస్థరూపం కన్నా ఎక్కువగా జన వ్యవహారానికే ప్రాముఖ్యం ఇచ్చారని చెప్పవచ్చు.

పండుగలు – విభజన :

హిందువుల పండుగలను నాలుగైదు విభాగాలుగా విభజించారు. అవి 1 లోకోత్తర పురుషులై ఈ ప్రపంచంలో లోక హితార్ధమై ఉత్తమ కార్యాలను చేసి పోయినమహానుభావుల జన్మదినోత్సవాలు. ఉదా :- శ్రీరామ కృష్ణాదిజయంతులు, 2. ఋతుసంబంధమైన ఉత్సవాలు, ఉదా :- ఉగాది, సంక్రాంతి, హోలి, రధసప్తమి మొ|| నవి.

3. శైవ వైష్ణవ సంబంధమైన వ్రతాలు. ఉదా :- శైవులకు వినాయక చతుర్ది మహాశివరాత్రి,

నవరాత్రులు, వైష్ణవులకు అనంత చతుర్దశి, ఏకాదశి మొ||నవి. 4. ద్విజులకు, స్త్రీలకు

సంబంధించినది. ఉదా :- ద్విజులకు రక్షికాపూర్ణిమ, స్త్రీలకు అశ్వత్థ, తులసి, సత్యనారాయణ వ్రతాలు మొ||నవి 5. ఇతరమైనవి, ఆదా :- విజయదశమి, ఇది తొలుత రాజులకు

సంబంధించినది. ఈ విభజన గురించి సురవరం గారు పీఠికలో చెప్పారేగానీ, పండుగల వివరణలో ఆ విభజనను గానీ, కాలక్రమాన్నిగానీ పాటించలేదు. ఈ విషయం వారు చెప్పిన పండుగల క్రమాన్ని చూపినపుడు స్పష్టమవుతుంది. దీపావళి :

దీపావళి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి రోజు జరుగుతుందని చెప్పి, ఆపండుగను జరుపుకోవడానికి గల కారణాలను వివరించారు. అవి:

1. శ్రీకృష్ణుడు సత్యభామ సహాయుడై నరకాసురుని చంపుట.

2. బలి చక్రవర్తి వామనుని చేత తన యావద్రాజ్యమును గోలుపోవుట

3. శ్రీరాముడు రావణ వధానంతరము రాజ్యాభిషిక్తుడగుట.

ఇందులో రెండవ కారణాన్ని మాత్రమే గ్రహించారు. మిగిలిన కారణాలకు సరైన ప్రమాణాలు లేవని వాటిని తిరస్కరించారు. బలికథలోని వామనుని “మూడు పాదాలకు” వేదాల ఆధారంగా అర్థం చెప్పారు. విష్ణువు (సూర్యుని) మూడు పాదాలు “ఉదయం, మధ్యందినం, అస్తమయాలు” అని ‘సూర్యుడు దక్షిణముపైనుండి జనులకు గాన్పించుకాలము విష్ణువుని రెండు పాదములగును, తదుపరి సూర్యుడు క్షితిజము క్రిందికి క్రుంకిపోయి దీర్ఘరాత్రిని కల్పించినపుడు అదృశ్యమగు విష్ణుని మూడవ పాదమేర్పడును’ అని తిలక్ గారు చెప్పారు. సూర్యుని వార్షిక గమనమే వామనుని పాదాలు అనిచెప్పారు.

“ఆర్యులు ఉత్తర ధ్రువ మండలవాసులుగా నుండి నప్పుడు తులా సంక్రమణమునాడు వారికి దీర్ఘ రాత్రి ప్రారంభమగుచుండెను, నాటినుండి తిరిగి యాఱునెలల వరకు చీకటిలోనే కాలము గడపవలసి వచ్చింది, కావున నా చీకటి ప్రవేశించిన తోడనే వారు దీపోత్సవము జేసి ‘బలి’ యను శత్రువును ‘చీకటిని’ పాతాళమునకు తన మూడవ పాదముచే నడగ, సూర్యుడు మరల తమకగు పడుగాకయని ప్రార్ధించుటకై చేసిన పండుగ దీపావళి” అని నిరూపించారు! ఉత్తర ధ్రువ ప్రాంతవాసులు ఈ చీకటి కాలము (తులాసంక్రమణము దీపావళి) నుండి మరల ఆరునెలలవరకు శ్రాద్ధకర్మలు చేయరు కాబట్టి ఈ కాలంలో చనిపోవడం అశుభసూచకంగా చూపించారు. వీరే ఈ పండుగ చేసేవారని సురవరం గారు రుజువు చేసారు.దీపావళి ఉత్తర ధ్రువనివాసుల దక్షిణాయన ప్రారంభపు పండుగగా గానవచ్చును.కానీ నరకాసుర కథకుగాని, శ్రీరాములజయమునకుగాని, విక్రమార్కునికిగాని ఈ పండుగయే మాత్రమును సంబంధించదని అభిప్రాయము. చేసినటుల నరక చతుర్దశియను పదమునకు నరకమునుండి పితృదేవతలకు విముక్తి కలిగించుటకై చేయబడిన పండుగయని యర్థము చేయుటకు మారుగా ‘నరక’ యను పదమును నరకాసురుని కర్థముచేసి, వాణివధను శ్రీకృష్ణుని కంటగట్టి, యా సందర్భమున నీ పండుగను వివరించి చెప్పుచున్నారు. విజయదశమి

హిందువుల పండుగలలో ముఖ్యమైన ఈ పండుగ ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు జరుపబడుతుందనీ, దీనిని ‘విజయదశమి’ అనడానికి అనేక కారణాలు చెప్తూ, ముందుగా ‘విజయకాలం’ గురించి, ‘శమీవృక్షపూజ’ గురించి, తర్వాత ‘రామాయణ భారత కథల’ గురించి శ్రవణానక్షత్ర యుక్తమైన ఆశ్వయుజ శుక్లపక్ష దశమిరోజు సాయంకాలం ‘ సర్వకామసాధకమైనదని, ఆసాయంకాలం మంగళవాద్యాలతో ‘శమీవృక్ష’పూజ చేస్తారని వివరించారు.

శమీవృక్షపూజను చేసిన శ్రీరామునిగురించి, అర్జునుని గురించి వివరించారు. శమీవృక్షపూజలో “శమీశమయతే పాపం శమీ శత్రువినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ‘ ప్రియవాదినీ’ అని ఉండటం వల్ల విజయదశమి గురించి రాముని పంరగ కొందరు, అర్జునుని పరంగా కొందరు అన్వయించుకుంటున్నారని అన్నారు. నిజానికి అర్జునుని ఉత్తర గోగ్రహానికి విజయదశమికి సంబంధం లేదని, అర్జునుని ఉత్తర గోగ్రహణం ‘బహుళ పక్షం’లో నిరూపించబడింది. తెలుగు భారతంలోని,

క॥ బహుళాష్టమినీతడు స న్నహానముతో పసుల బట్టు, నవమి మన గో గ్రహణమని నిశ్చయించిన నహికేతను పలుకులకు మహాహ్లాదమునన్ ”

అను పద్యాన్ని ఉదాహరించారు. ‘విజయకాలం”విజయ’ శబ్దం అనేక రకాలుగా చెప్పుకోవడానిక ఆస్కారం కలిగించిందని అంటారు. వాస్తవానికి క్షత్రియుల పండుగ అని, క్షత్రియులు జైత్రయాత్రకు వెళ్ళడానికి సన్నాహాలను ఇది సూచిస్తుందని చెప్పారు. ఇది మొదట క్షత్రియుల పండుగైనా తర్వాత అందరి పండగైందని, వారి జైత్రయాత్రలో భాగమైన ‘సీ మొల్లంఘన’ లేదా ‘సిలంగన్’ నేటికీ నిజాంరాష్ట్ర ప్రజలు ఆచరిస్తున్నారని సోదాహరణంగా వివరించారు. ఈనాడు సిలంగన్ (సీమోల్లంఘనం) కొన్ని ప్రాంతాల్లో ‘పాలపిట్టదర్శనం’ పేరుతో జరుగుతుంది. విజయదశమి సాయంకాలసమయంలో పాలపిట్టను దర్శనం చేసుకోవడం వల్ల శుభం జరుగుతుందని భావించి, ఊరుదాటి పాలపిట్టను దర్శించివస్తారు. ఆ తర్వాత శమీవృక్షపూజ చేస్తారు.

సురవరం గారు విజయదశమి పండుగలో భాగంగా మహా భారతానికి సంబంధించిన అనేక అంశాలు 1. భారత యుద్ధం కార్తీక అమావాస్యనాడు మొదలైందని, భీష్ముడు మార్గశిర శు॥ ఏకాదశినాడు అంపశయ్య మీద శయనించాడని, యుద్ధానికి ముందు వైశాఖమాసంలో ఉత్తరాభిమన్యుల వివాహం జరిగిన సోదాహరణంగా వివరించారు. సారాంశంగా విజయదశమికి, అర్జుమనికి సంబంధం లేదని తేల్చారు.

ఉగాది

‘యుగాది’ మొక్క తద్భవరూపమే ‘ఉగాది’ అని, ఇది చైత్రశుక్ల పాడ్యమినాడు జరుగుతుందని, ఈ పండుగ ఆర్యులు, ఫార్సీలు కలసి ఉండిన మర్యాదలు జరుగుతాయని చెప్పారు. కాని తర్వాతి కాలంలో చంద్రసౌరమాన భేదాల వల్ల దక్షిణ భారతంలో చైత్ర మాసంలో, ఉత్తర భారతంలో మేషసంక్రాంతి నాడు జరుగుతుందని తర్కబద్ధంగా నిరూపించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి

ప్రతి సంవత్సరం ఈ పండుగ శ్రావణ బహుళాష్టమీ రోజు జరుగుతుందనీ ఈనాడు మనం చూస్తున్న శ్రీ కృష్ణుని స్వరూపం సరైనది కాదని, ఈ స్వరూపాన్ని విశేషంగా ప్రచారంలోకి తెచ్చిన వారు రాజా రవివర్మగారని సురవరంగారు చెప్పారు. ”

“శ్రీకృష్ణుడు బాల్యమందు గొల్లలతో బయళ్ళలో తిరిగి పెరిగిన వాడు, నూగు మీసాల నాడు, మంచి జెట్టీలతో పోరి కర్కశకాయుడైనవాడు. పరిపూర్ణవయః పరిపాకము నాడునానారాజులతో యుద్ధము చేసి వర్ణించి, యసామాన్యుడనిపించుకొన్నాడు. ండడు” అని చెప్పి, ఇతను 116 ఏండ్ల కన్నా హెచ్చు కాలము జీవించి నాడని సోదాహరణంగా నిరూపించారు.

హనుమజ్జయంతి

హనుమజ్జయంతి మధ్వులకుముఖ్యమైననీ, ఇది ప్రతి చైత్రపౌర్ణమిరోజు పండుగ జరుగుతుందనీ చెపుతూ రామాయణ వానరులు కోతులు కారనీ, బళ్ళారి ప్రాంతంలో నివసించే అనార్య జాతి వారు అయివుంటారని సురవరం గారు భావించారు.

భీష్మేకాదశి

భీష్ముడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అంపశయ్యపై శయనించాడని, మాగశుద్ధ అష్టమిరోజున మరణించాడని, మరణించేనాటికి ఇతని వయస్సు దాదాపు 170 సంవత్సరాలు ఉండొచ్చని తేల్చి చెప్పారు.

భారత మంతట శ్రీకృష్ణుడు ధర్మరాజుకు నవస్కారం చేయడం వల్ల, భీముని ఆలింగనం చేయడం వల్ల, అర్జునుడిని ఆశీర్వదించడం వల్ల ధర్మరాజు శ్రీకృష్ణునికన్నా పెద్దవాడని, భీముడు సమానీకుడని, అర్జునుడు చిన్నవాడని సురవరంగారు అభిప్రాయపడ్డారు. ధర్మరాజు వయస్సు 117, భీముని వయస్సు 116, అర్జునుని వయస్సు 115 సంవత్సరాలు అని భారత ప్రమాణాల చేతసమర్ధించారు.

మహాలయపక్షం

మహాలయ పక్షంలో పితృదేవతలకోసం బ్రాహ్మణులు మంత్రాలతో, బ్రాహ్మణేతరులు మంత్రాలు లేకుండానే తర్పణాలు విడుస్తారని చెపుతూ, జనంలో ఉన్న జోకరయ్య కధను కల్పితకథ దత్తాత్రేయ జయంతి తేల్చివేశారు.

దత్తాత్రేయుని అవతారం ముగ్గురు మూర్తులు భిన్నులు కారని సూచిస్తుందనీ, దేవుడు ఒక్కడే అని వేద ప్రమాణాన్ని సమన్వయపరచడానికి ఈ కథ ఉద్భవించినీ, పాతివ్రత్యమహిమ వల్ల సాక్ష్యాద్దేపుళ్లనైనా తారుమారు చేయగలమని చెప్పడానికి ఈ కథ సృష్టించబడిందనీ వీరు భావించారు. ఈ పండుగను సామాన్యులు చేయరు. బ్రాహ్మణులు మార్గశిర శుద్ధ దశమి రోజు ఈ పండుగ చేసుకుంటారు.

సూర్యచంద్రగ్రహణాలు

ప్రతి సంత్సరానికొకసారి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సూర్యుడు సంభవిస్తుందనీ, దీనికి కారణం రాహువను రాక్షసుడని పీడకాదనీ, జ్యోతిశ్శాస్త్ర ప్రకారం పౌర్ణమ నాడు సూర్యచంద్రుల మధ్యభూమి వచ్చినట్లైతే చంద్రగ్రహణం కలుగుతుందని, అమావాస్య నాడు సూర్యుని భూమికి చంద్రగ్రహణం కలుగుతుందని, జ్యోతిశ్శాస్త్ర ఆధారంగా పురాణగాధ కల్పిత గాధ.

శ్రావణ పూర్ణిమ

రక్షికా పూర్ణిమ వికృత రూపమే రాకీ పున్నమనీ రక్ష అంటే సంరక్షణ అని, ఈ పండుగనాడు బంధువులు, స్నేహితులు, ఒకరి కొకరు ముంజేతిపైన పట్టుదారాన్నైనా, వెండితీగనైనా, బంగారు తీగనైనా రత్న మౌక్తికాలతో కూడిన కంకణాలు కట్టుకుంటారని వివరించారు. దీనినే కొంకణలో ‘నారలీపూర్ణిమ’ అంటారనీ, ఈ రోజు బ్రాహ్మణులు కొత్త జంధ్యాలు వేసుకుంటారనీ, పాల్కురికి సోమన దీనిని ‘నూలిపున్నమ’గా పేర్కొన్నాడు.

రక్షకను కట్టు ఆచారం రాజస్థానంలో ప్రారంభమైందని, చిత్తూరు మహారాణి హుమాయూన్ పాదుషాకు రక్షాబంధనం పంపి, తనను గుజరాతునవాబైన బహుదూర్షి మండి రక్షించమని కోరిందనీ, హుమాయున్ ఆమె ప్రార్ధనను అంగీకరించి బహుదూర్లోను తరిమి, ఆ తర్వాత ఈ ఆచారం ఉత్తరహిందూస్థానం, దక్షిణాదిన వ్యాపిస్తే ఇది కూడా ఉత్తరహిందూస్థానంలో ఉంది. ‘యజ్ఞోపవీత ధారణం’ అనే ప్రధాన ప్రాచీన కాలంలో ఆర్యులను అనార్యులనుండి భిన్నింప చేయడానికి ఈ పండుగనాడు ధరించే జంధ్యాల గురించిన వాస్తవాన్ని సురవరంగారు బయట పెట్టారు.

బ్రాహ్మణాదులు యజ్ఞోపవీతధారణ శ్రావణపూర్ణిమ నాడు కాని, భాద్రపదపూర్ణిమ నాడు కాని చేసి, ఉపాకర్మ చేసుకొని, నాటినుండి 5 1/2 నెలల పర్యంతం వేదాధ్యయనం చేయవలసినదని, ఈనాడు అది అడుగంటిపోయిందని బాధను వ్యక్తం చేశారు.

సంక్రాంతి

సంక్రాంతి సూర్యగమనాన్ని బట్టి మార్గశీర్ష మాసంలోగానీ, పుష్యమాసంలోగానీ వస్తుందని చెపుతూ, జ్యోతిశ్శాస్త్ర గ్రంధాల ఆధారంగా ఇది సూర్యగమనానికి సంబంధించిన పండుగ అని నిరూపించారు.

రధసప్తమి

రధసప్తమి వ్రతం మాఘశుక్ల సప్తమి రోజు జరుపబడుతుందనీ, ఇది సూర్యుని ఉద్దేశించి చేసే వ్రతమనీ, ఇది ఆర్యుల ప్రకృతి ఆరాధనను సూచిస్తుందనీ, శైవ వైష్ణవ సంప్రదాయాలు ముదిరిన కొద్దీ సూర్యారాధన మాసిపోతూ వచ్చి సప్రమాణ యుక్తంగా నిరూపించారు.

గణేశ చతుర్థి

గణపతి, వినాయక, విఘ్నేశ్వర, గణేశ మొదలగు పేర్లతో పిలువబడే వినాయక చవితి పండుగ భాద్రపద శుద్ధ చతుర్థినాడు జరుగుతుందని చెపుతూ, ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణాలను వివరించారు. ఇతర పండితుల అభిప్రాయాలను చర్చించారు.

వినాయకుడు పంటల దేవుడని ‘గుప్తే’ ప్రతిపాదిస్తూ పంటలను నాశనం చేసేవి ఎలుకలు, ఆ ఎలుకలను వాహనంగా కలిగినవాడు, లొంగదీసుకున్నవాడు, నాశనం చేసిన వారు గణపతి కాబట్టి వినాయకుడు పంటలదేవుడు. అతని చెవులు చేటలు అవి ధావ్యాన్ని తూర్పార బట్టడానికి పనికి వస్తాయి, అతని ఏకదంతం నాగలి, ఆతని పూజలో సమర్పించేవి పత్రపుష్పాలు కుడుములు మొదలగునవి. కాబట్టి ఇతను పంటల దేవుడనీ, అవార్యదేవుడనీ గుప్తంగారి అభిప్రాయం. ఇతని ఈకన్నా మ్యూపండితువి

5 అభిప్రాయం వైపే సురవరం గారు మొగ్గుచూపుతారు.

ప్రాచీన వేదాంతులు సమానార్ధక ద్యోతకాలైన పదాలన్నింటిని ఒక చోట చేర్చి, వాటికి గణములని పేరు పెట్టి, ఆ గణాల అధిపతిని ‘బ్రహ్మణస్పతి’ అని అన్నారు. దీని తర్వాత విద్యతో సరిపోల్చి, ఆ విద్యనే బ్రహ్మఅనీ, వేదమనీ అన్నారు. యాస్కుడు ఇటువంటి గణాలను సమకూర్చాడు. ఈ పండితుని (మ్యూర్) అభిప్రాయం ప్రకారం, ఈ గణాల (విద్య) అధిపతియే గణేశుడు, ఏరువాక పున్నమి

‘ఏరువాక’ దేశ్యపదమనీ, ఈ పండుగ బ్రాహ్మణేతరులకు ముఖ్యంగా వ్యవసాయ దారులకు ప్రధానమైన పండుగనీ, ఈ పండుగ జైమిని కాలానికి సుప్రసిద్ధమైన పండుగనీ, దీనిని పూర్వకాలంలో “ఉద్వృషభయజ్ఞమ” నే పేరుతో చేస్తుండే వారనీ సాక్ష్యాధారాలతో ఈ పండుగగురించి సురవరం గారు చెప్పారు.

ఈ విధంగా – హిందువుల పండుగల గురించి సురవరం గారు అనేక అంశాలను పరిశీలించి, చర్చించి, పరిశోధించి ఎన్నో అమూల్యమైన విషయాలను తమ “హిందువుల పండుగలు” అనే గ్రంథంలో పొందుపరిచారు.

డాక్టర్ మాతంగి జానయ్య తెలుగు అధ్యాపకులు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ 9640811664

Get real time updates directly on you device, subscribe now.