కుందుర్తి జీవిత, సాహిత్య రేఖలు

పరిశోధన పత్రం


కుందుర్తి జీవిత, సాహిత్యరేఖలు

కుందుర్తి ఆంజనేయులు 16-2-1922న గుంటూరు జిల్లా, నరసరావు పేట తాలూకాలోని కోటవారిపాళెంలో జన్మించారు. వెంకటనర్సమ్మ, కామయ్యలు జననీ జనకులు. కామయ్యగారు గ్రామ మునసబు. కుందుర్తి ఎనిమిది నెలల ప్రాయంలో ఉన్నప్పుడు తండ్రిగారు. మరణించడంవల్ల వినుకొండకు తల్లితో వచ్చారు. బాల్యమంతా బీదరికంలో గడిచింది. తల్లి రెక్కల కష్టం తనయునికి విద్యాభ్యాసానికి తోడ్పడింది.1986లో వినుకొండలో బోర్డుమిడిల్ స్కూల్లో థర్డుఫాం చదివారు,
8వ తరగతి దాకా జాషువాగారొక్కరే తెలుగు పండితుడు. మొదట్నించీ తరగతిలో ప్రథమ శ్రేణిలో వచ్చేవారు. అందువల్ల జాషువాగారి దృష్టిలో పడి, వారి మధ్య అనుబంధం ఏర్పడింది. తరుచుగా వారింటికి వెళ్ళడమూ. అప్పటికి ప్రచురణ కానీ ‘ఫిరదౌసి’ కావ్యాన్ని వినడమూ జరుగుతుండేది. తాతగారి మిత్రుడైన పులుపుల వెంకటశివయ్య కమ్యూనిస్టుపార్టీ స్థాపక సభ్యుడు (వ్యవస్థాపక సభ్యుడు). ఆయన వీరి తాతగారితో నాస్తికత్వం గురించి వాదించేవారు. అప్పటికింకా కుందుర్తికి కవితాధోరణి లేదు. కుందుర్తికి అనంతర కాలంలో అభ్యుదయ దృక్పథం ఏర్పడటానికి జాషువా,పులుపుల శివయ్యల సాంగత్య ప్రభావమై వుంటుంది. ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు మాష్టారు. 1948లో A.C. కాలేజీలో బి.ఏ. పూర్తి చేశారు. బి.ఎ.లో ఉన్నప్పుడే 1942లో సుందరమ్మగారితో వివాహం జరిగింది.జాషువాగారి శిష్యరికంలో కుందుర్తిగారికి ‘కథలాంటిది’ రాయాలని పించేదట. తను నల్లనివాడు కావడంవల్ల ‘నల్లవాడ’ అనే కథ రాశారట. అదే మొదటి కథ. అంతర్ముఖత్వానికీ, కథాధోరణికి అది బీజమేమో?! బెజవాడలో వీరింట్లో ఒక ‘పేయింగ్ గెస్ట్’ (చెల్లించే అతిథి) ఉండేవాడు. అతనికి ఒక బాలకవితో పరిచయం. ఆ బాలకవి కవిత్వం నేర్పుతానని గణాలు, యతులు ఒక నోట్ బుక్‌లో రాసిచ్చాడు. దాన్ని కుందుర్తి చూశారు. బహుళ కవిత్వం రాయడానికి అది సహాయపడుతుందని వీరి భావన. అత్తిలి గురుమూర్తిగారు హెడ్మాస్టర్గా రిటైర్ అయినప్పుడు వీడ్కోలు సభలో కుందు రిగారు పద్యాలు చదివారు. అదే మొదటి కవిత్వం, 1989లో నెహ్రూ బెజవాడకు వచ్చినప్పుడు, రామమోహన లైబ్రరీలో జపాను వ్యతిరే కోద్యమానికి సంబంధించిన కొన్ని పద్యాలు చదివారు. ఛందోవ్యాకరణ దోషాలున్నా కూడా పద్యాన్ని దొర్లించేవారు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే రాయప్రోలు వారి తృణకంకణం, ఆంధ్రావళి, జడకుచ్చులు ఇత్యాది గ్రంథాల కవితాగంధాలు సోకినవి. ‘రసధుని’ అనే లఘుకావ్యం రారు. ప్రకృతి ప్రేమ కనిపించే ఇతివృత్తం. మేనల్లుడైన పోలూరి ఆంజనేయప్రసాద్ సహ కర్తృత్వంలో 1989లో ‘అపదోద్ధారక శతకం’ రచించారు. ఇది శ్రీరాముని గురించి ఆధునికరీతిలో రాసిన శతకం. అప్పటికి అభ్యుదయ లక్షణాలు మొలకెత్తసాగాయి. అదే సంవత్సరంలో ‘అమావాస్య’, ‘నా ప్రేయసి’ అనే కావ్యాలు రాశారు. ఇందులోనే పద్యరూపంతో పాటు తనదంటూ ఒక స్టైల్ ఏగ్పడిందని అంటారు కుందుర్తి.

మాధ్యమిక పాఠశాల వరకు జాషువా, కళాశాల ప్రాంగణంలో విశ్వనాథ కుందు ర్తిమీద బలమైన ప్రభావం పడింది. ఇంటర్ లో విశ్వనాథ రాయడమూ, చదవడమూ, అనుకరించడమూ, చివరకు నశ్యం కూడా అలవాటు చేసుకోవడమూ జరిగింది. విశ్వనాథ ప్రభావంతో సంస్కృత సమాస భూయిష్టంగా ‘సౌప్తికం’ అనే కావ్యం రాసి, సభ లేకుండా వ్రాత ప్రతిని గురువుగారికి అంకితమిచ్చారు. 1941లో ‘భారతి’లో రామరాజు శీర్షికతో 10, 12 పద్యాలు ప్రచురితమయ్యాయి. 1941 చివరలోనో,
1942 ప్రారంభంలోనో మాచిరాజు దేవీప్రసాద్ మద్రాసునుంచి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ వ్రాతప్రతిని ఒకటి రాసుకొని వచ్చాడు. దానివల్ల క్రమంగా విశ్వనాథ ప్రభావం నుంచి బయటపడి శ్రీశ్రీ ప్రభావంలోకి వచ్చారు. ‘సౌప్తికం’ తరువాత రాసిందంతా శ్రీశ్రీ ప్రభావంతో రాసిందే.

ఉద్యోగ జీవితం:

1943లో తెనాలి తాలూకా దేవేంద్రపాడు నేషనల్ కాలేజీలో ఆంగ్ల భాషా బోధకుడిగా చేరారు. 1944లో ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యారు. 1946లో గుంటూరు టుబాకో మార్కెటింగ్ కమిటీలో ఇన్ స్పెక్టర్ గా చేరారు. ఇది కమ్యూనిస్టు పార్టీవారి చేతుల్లో ఉండేది. కొల్లా మార్కెట్ వెంకయ్య కమిటీ చైర్మన్. 1946-56లో అందులోనే పని చేశారు. అందులో సమా 댕 (ఇన్ఫర్మేషన్ బ్యూరో) 25 ໖ (వింగ్) 8. దానికి మేనేజర్ గా పనిచేశారు. తాడికొండ, ఏల్చూరు వంటి ఊళ్ళల్లో సూపరింటెండెంటుగా పనిచేశారు. 1956లో కర్నూలులో సమాచార పౌరసమాచారాలు )సమాచారం మరియు ప్రజాసంబంధాలు( కుడిగా ఉన్నాయి. కర్నూలు నుంచి హైదరాబాదుకు బదిలీ అయ్యారు 1965లో మహబూబ్‌నగర్ జిల్లా పౌరసంబంధాల అధికారిగా పనిచేసి, 1966లో అదే పదవిలో హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు.

సాహితీ సంస్థలతో సంబంధాలు :

1941–48లో ‘నవ్యసాహిత్య పరిషత్తు’ నరసారావుపేటలో ఉండేది. అందులో విశ్వనాథ సత్యనారాయణ, పింగళి లక్ష్మీకాంతం మొదలైన ప్రసిద్ధ కవులు ఉండేవారు. అంత స్థాయిలో కాకపోయినా, ఉన్నంతలోనే అనిశెట్టి, ఎల్చూరు సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు మొదలైన యువకుల వాహనంతో నర్సరావు పేటలో ‘నవ్యకళాపరిషత్తు’ నొక దానిని స్థాపించారు. అని పెట్టి కార్యదర్శిగా, కుందుర్తి ముఖ్య వ్యవహర్తగా ఉండేవారు. దాని అధ్వర్యంలో ‘నయాగరా’ కవిత సంపుటిని ప్రచురించారు. ‘నవ్యసాహిత్య
పరిషత్తు’ వాళ్ళు ‘నవ్య కవిత్వం’ అని పేరు పెడితే, వీరు ‘అతినవ్యకత్వ మ’ని పేరు పెట్టారు. 1941-48లో కోలవెన్ను రామకోటేశ్వరరావు (‘త్రివేణి’ ఎడిటర్) అధ్యక్షతన కుందుర్తి, ఏల్చూరి సుబ్రహ్మణ్యం మూడు రోజులు మూడు సాయంత్రాలు ‘అతినవ్యకవిత్వం’పై నర్సరావుపేట హై స్కూలులో ఉపన్యాసాలిచ్చారు. యువకులందరూ మార్క్స్ ప్రభావంలో పడిపోతున్నారని కోలవెన్ను రామకోటేశ్వరరావు ‘త్రివేణి’లో సంపాద కీయంలో రాశారు. కుందుర్తి, బెల్లంకొండ రామదాసు ‘నవ్యకళాపరిషత్తు’ తరపున ఒక మేనిఫెస్టో తయారు చేశారు. అందులో ఇలా అన్నారు –

(1) పద్యకవిత్వం తెలుగు కవిత్వానికి తుదిరూపు కాదు.
(2) అతినవ్య కవిత్వంలో కొత్త రూపాలు (రూపాలు) వెతుకుతున్నాం. (అప్పట్లో వచనకవిత్వం మాటలేదు) దీనిని అతినవ్య కవిత్వమని అంటున్నాం

(3) ఆంధ్రదేశంతో అతినవ్య కవిత్వాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాం.

(4) శ్రీశ్రీ నాయకత్వంలో పూర్వకవిత్వం మీద తిరుగుబాటు.

కుందుర్తి అభ్యుదయ రచయితల సంఘంతో కూడా సంబంధం ఉంది. ఆ సంఘంలో సభ్యుడిగా, హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షులుగా ఉండి, దాని వికాసానికి ఎంతగానో పాటుపడ్డారు.

ఫ్రీవర్స్ ఫ్రంట్:

1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత సమాచార, పౌరసంబం ధాలశాఖలోని ఉద్యోగిగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారని దీని గురించి చర్చించాం. ఉద్యోగరీత్యా అజంతా, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అబ్బూరి వరద రాజేశ్వరరావు, రాయప్రోలు శ్రీనివాస్ లు హైదరాబాద్ వదలిపోయారు. వచనకవిత్వం రాసే యువకుల్ని ఒకచోట సమావేశపరిచి నెలనెల సాహిత్య చర్చలు జరుపుకునేవారు. ఈ సమావేశాలు నగరంలో తిలక్రోడ్‌లోని ‘రాకాలేజీ’ ఆవరణలో జరుగుతుండేవి. ఏ. మురళీధర్ సమావేశకర్త. దాః ఆరిపిరాల విశ్వం, యాదవరెడ్డి (నిఖిలేశ్వర్), కేశవ దావు (నగ్నముని) మొదలైన దాదాపు 30 మంది యువకులంతా సమా
119 కొన్నాళ్ళు ఈ

నహవేళాలు డా॥ అరిపిరాల విశ్వం గారింట్లో జరుగుతుండేవి. ఉద్యోగరీత్యా ఏ. మురళీధర్ హెడ్రాబాద్ వదలివెళ్ళడం, 1965లో కుందు రి మహబూబ్ నగర్ కు బదిలీ కావడం వల్ల సమావేశాలకు తాత్కాలికంగా తెరపడింది. అంతవరకు ‘ఫీవర్స్ ఫ్రంట్’ అనే పేరు లేదు. 1966లో మళ్ళీ కుందుర్తి హైదరాబాద్ కు బదిలీ అయివచ్చాక, ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ అనే సంస్థను స్థాపించి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంస్థకు ప్రత్యేక నిధులు గానీ, సభ్యత్వ చందాలుగానీ, కార్యనిర్వాహకవర్గ ఎన్నికలుగానీ లేవు. సాహిత్య అకాడమీ సంస్థ కోసం సంస్థను స్థాపించడమే అపవాదుకు వ్యతచెంది, సంస్థను భర్తీ కూడా చేయలేదు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణగా కుందుర్తి ‘నగరంలో వాన’, ‘నయాగరా’, ‘నాలోని నాదాలు’, సి.వి. కృష్ణా రాపు ‘వైతరణి’, ‘వచనకవిత’ వ్యాససంకలనం, ‘తరంతరం’ కవిత సంపుటి వెలువడ్డాయి. ఉత్తమ వచనకవితా సంపుటులకు ఏటేటా బహుమతులిస్తూ వచనకవితోద్యమానికి పాటుపడ్డారు.

వచనకవితా సంపుటులు :

కుందుర్తి, బెల్లంకొండరామదాను, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ముగ్గురూ కలిసి 1944లో ‘నయాగరా’ వెలువరించారు. 1956లో ‘తెలంగాణ’ వచన కవితాకథాకావ్యాన్ని ప్రచురించారు. 1957లో ‘ఆశ’ వచనకవితా నాటకాన్ని 1938లో ‘యుగే యుగే’ కవిత సంపుటిని ముద్రించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణగా 1966లో ‘నగరంలో వాన’ ప్రచురించబడింది. 1958 నుంచి వరునగా ‘ఆంధ్రజనత’లో ‘ఈ వారం కవిత’ శీర్షికన వారం వారం రాశారు. అప్పటిదాకా ఏ పత్రికలోనూ ‘పోయెట్రీ కాలం’ లేదు. ఆ కవిత 1966లో ‘నాలోని నాదాలు’ ప్రచురించబడింది. 1975లో కుందుర్తి సన్మాన సంఘంవారు ‘కుందుర్తి కృతులు’ నర్వకవితా సంకలనాన్ని ప్రచురించారు. అందులో ముద్రితమైన కవితా సంపుటులతోపాటు – అమద్రితమైన కవితాసంపుటులు ‘దండయాత్ర’, ‘మాతృగీతం’, ‘రగవంతు 2 ఊహిరంగ లేఖినితా అనువాదమాం’, అదే నా దేశం’, ‘సాహనయ్యార్థ -శేరున వెలుగులు* ‘అముద్రిత కావ్యం’, ‘శిక్ష ఏమిటి?’, ‘ఆచారాల= గౌరమ్మాయి’, ఉన్నాయి.
వ్యక్తిత్వం కుందుర్తి వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కవిత్వాన్ని దగ్గరగా చూసి నప్పుడు, అతని వ్యకిత్వాన్ని అంచనా వేసుకోవచ్చు. అప్పుడే వ్యక్తిత్వం వన్నెకు వస్తుంది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించినవాడు కావడంపల్ల, మధ్యతరగతి జీవితాన్ని వర్ణించే సందర్భాల్లో వ్యక్తిగత విషయాల్లో ‘ఏ కరువు పెట్టడంలో వెనుకాడలేదు.త ను పుట్టినరోజు డిసెంబర్ 16 న దృష్టిలో పెట్టుకుని. ………… ‘ఇవ్వాళ నా పుట్టిన రోజేమిటి? పదిరోజుల నుండి వెతగ్గ బహుశా అప్పుపుట్టిన రోజేమో ?!’1 అంటారు.తన బలహీనతల్ని చెప్పడంలో కూడా కుందుర్తి ఏ మాత్రం సిగ్గు పడలేదు, బాధపడలేదు.
‘అర్థాంగి పిలిచినా పలకకుండా అర్థరాత్రి కవిత్వం రాయడం అవలీలగా ఆస్తిని అమ్మేని ఆజ్యంలా అగ్నిలో సోయడం ఉదయం మార్చిన పెద్ద నోటు సాయంత్రానికి వాడడం’2 _ ఇదీ కుందుర్తి పరిస్థితి.

మిత్రులతో, కవిమిత్రులతో కలిసి ‘బార్’ (బార్)కు వెళ్లినా, ఠాగే వాడు కాదని, ఆ పరిశీలన గంగినేని ఇలా అన్నారు. “ప్రతి పొరపాటుకు, దురలవాటుకూ దూరంగా వున్న, వుండగలిగిన కవి బహుళ ఆయనొక్కడే చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి ఉన్నవాడు కాబట్టి వచనకవితా వ్యాప్తికి లక్ష బాలు చెప్పే, లక్ష్యాలు చూపారు. పద్యరచనలో చేయితిరిగినవాడైనా, వచనకవిత చాలా సేటప్పుడు. పద్యస్పృహ కలుగకుండా, కనిపించకుండా సాగరపడేవాడు. కమ్యూనిస్టు సిద్ధాంత దృక్పథం ఉన్నా, దేశనాయకు పైన అమితమైన గౌరవం ఉన్నవాడు. గాంధీ, నెహ్రూలపై స్మృతిగీతాలు (ఎలిజీ) రాశారు. తన కృతులను ఎవ్వరికి అంకితమివ్వ లేదు.

“నా తత్వం నీకు తెలుసు గదా నానుడూ నీళ్ళు నమలడం నా ఒంటికి సరిపడవు అభిప్రాయం చెప్పమని నువ్వు అడుగూ ఆడక్కపో అనుకున్నది పిలిచినా చెప్పేది చెప్పేదే”ఇదీ కుందుర్తి తత్త్వం. ఈ తత్వమే కుందుర్తి వ్యక్తిత్వాన్ని నిలిపింది.వచనకవిత్వాన్ని ఒక ఉద్యమంగా జీవితకాలమంతా పోరాడి కుందుర్తి 25–10–1982 నాడు తన ఆఖరి శ్వాసవిడిచాడు.

డాక్టర్ మాతంగి జానయ్య తెలుగు అధ్యాపకులు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ 9640811664

Get real time updates directly on you device, subscribe now.