సింగరేణి తెలంగాణ కల్కితురాయి

సింగరేణి తెలంగాణ కల్కితురాయి

జనహృదయ గని సింగరేణి
సిరులు పండించే సింగరేణి
ప్రపంచ దేశాలకే సహకారిని
శ్రమజీవులకు స్ఫూర్తిదాయని
సింగరేణి యేతరులకు ప్రియదర్శిని
కార్మికుల పాలిటిహితకారిణి
సమస్త కార్మికులకు ఆదర్శిని
వార్తా సమాచారాలకు విశ్వ దర్శిని
అఖిల శ్రమజీవులకు ఆదరణి
కష్టజీవిలా పాలిటి కుంకుమ భరణి
దిన దిన అభివృద్ధిని సింగరేణి
జనులంతా హర్షించే జనరంజని
అందరి హృదయాలను దోచే మనోరంజని
సాహిత్య సంగీత శృతికి శివరంజని
సింగరేణి సిరి సంపదలకు తోరని
శ్రమైక సౌందర్యాలకు నిదర్శిని
వ్యక్తిత్వ వికాసానికి రాజ తరంగిణి
నేత్రదానాలకు కారుని
విజ్ఞాన సాంకేతిక అభివృద్ధికి తరుణి
పర్యావరణాన్ని సంరక్షించే సంజీవిని
మన్యప్రాణులను సంరక్షించే జాగృతి
పేద ప్రజలకు ఔషధాలను పంచే దివ్య ఔషధని
అవనిలో ప్రతిభ ప్రావిన్యుల గని
క్రీడాకారుల కీ గంటకి క్రీడాజ్యోతి
అధిక జనాభాని అరికట్టే నినాదాలనియంత్రిని
విద్యార్థుల మేధస్సును మెరుగుపరిచే మాగాని
భావితరాల సర్వ జీవన విస్తృతి
మూఢనమ్మకాలకు ఎయిడ్స్ మహమ్మారిని కి సంహారిణి
తరతరాల అంతరంగంలో వికాస తరంగిణి
అఖండ వాహిని సింగరేణి
అత్యుత్తమ అవార్డులు పొందడంలో అగ్ర శ్రేణి
గ్యాస్ ఉత్పత్తులకు వినూత్న జిజ్ఞాసి
తెలంగాణ మూలధనం సింగరేణి
దక్షిణ భారత సంపదకు ఊర బావి
అనాధలకు ఆప్తులకు నిస్వార్ధ వితరిని
సకల కళలకు నిలయం సింగరేణి
నిరక్షరాశులకు అక్షర భారతి
అనాధలకు ఆర్తలకు నిస్వార్ధ వితరిని
నిరుద్యోగ యువతకు ఆశయ సంక్రాంతి
వికలాంగుల అంతరంగాల్లో ధైర్యం నింపే జీవన స్రవంతి
కళాకారుల పాలిటి నవరసభరితి
సంక్షేమ పథకాలను అమలుపరచంలో వినూత్న రీతి
పదవి విరమణ అయిన వారికి భవిష్య నిధి
మహిళా యువత ఉపాధికి యువరాణి
అందరి యదలో వెలిగే విజ్ఞానదివిటి
ప్రగతి మార్గాలకు సింగరేణి మార్గసిరి
గనుల ప్రపంచానికి సింగరేణి రారా ణి
సింగరేణి నిత్య సమాచార వారధి
నల్ల బంగారాల ఉత్పత్తిలో విజయభారతి
సింగరేణి విశ్వమంతా మోగిస్తుంది విజయభేరి
సింగరేణి సాధిస్తుంది అఖండ కీర్తి
శ్రమలో అంకితభావానికి సత్యనిరతికి నిత్య సందర్శిని
నక్షత్ర కూటమిలో సింగరేణి ఓ స్వాతి
నిత్య కళ్యాణం పచ్చ తోరణం మన సింగరేణి
విశ్వమంతా వికసిస్తుంది సింగరేణి ఖ్యాతి
పర్యావరణ పరిరక్షణకు అందుకుంది ఇందిరా ప్రియదర్శిని
సింగరేణి ప్రకృతి ఇచ్చిన ఓ గొప్ప బహుమతి
సరిరారు వేరెవ్వరు సింగరేణికి
సమభావం స గౌరవం అంకితభావం ఇదే సింగరేణి నినాదం
M రవి ప్రసాద్,M A. M A BE d

Get real time updates directly on you device, subscribe now.