సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి

సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి

నర్సింహులపేట ,ఎస్ఐ గండ్రాతి సతీష్

సమదర్శిని న్యూస్ :నర్సింహులపేట మహబూబాబాద్

నర్సింహులపేట,మార్చి11….సంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తే శారీరకంగా,మానసికంగా దృఢంగా తయారవుతారని నర్సింహులపేట ఎస్ఐ గండ్రాతి సతీష్ అన్నారు.ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో రాజీవ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్,నల్లగొండ,ఖమ్మం జిల్లాల స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించారు.గత మూడు రోజులుగా జరిగిన క్రీడలు ఆదివారం రాత్రితో ముగిసాయి.ఈ ముగింపు సమావేశానికి ఎస్ఐ సతీష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ క్రీడల్లో మొదటి విజేతగా నూతనకల్లు జట్టు నిలిచి ట్రోఫీతో పాటు రూ.40,000 ల నగదు బహుమతిని గెలుచుకున్నారు.ద్వితీయ విజేత ఎర్రబాడు జట్టు రూ.30,000లు, తృతీయ విజేత భూపాలపల్లి జట్టు రూ.25000లు,చతుర్థి విజేత గిరిమిల్ల జట్టు రూ .15000లు,పంచమ విజేత ఆలేరు జట్టు రూ.8000ల నగదుతో పాటు ట్రోఫీ ని గెలుచుకున్నారు.విజేతలకు ఎస్ఐ మరియు దాతల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ మన దేశంలోని యువతను ప్రోత్సహిస్తే ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ అవుతుందని అన్నారు.ఈ రోజుల్లో సెల్ ఫోన్ తో చాలా బిజీ అయ్యారని ఒకే దగ్గర కూర్చొని కాలం వెళ్లదీస్తున్నారని దీనివల్ల శారీరకంగా అనారోగ్యం పాలవుతున్నారని రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. క్రీడల్లో ఓటమి చెందిన వాళ్లు బాధపడకూడదని దానిలో లోపాలను సరిచేసుకొని విజయం సాధించాలని క్రీడాకారులకు సూచించారు.నేను చదువులో ఎక్కువగా రాణించలేకపోయానని క్రీడలు నేర్చుకోవడం వల్లనే పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యానని ఆయన తెలిపారు.గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడలను నిర్వహించడం గొప్ప విషయం అని రాజీవ్ యువజన సంఘం సభ్యులను ఆయన అభినందించారు.ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ అధ్యక్షుడు దోమల యాదగిరి,రేఖ అనిల్,పొన్నం శ్రీకాంత్,కాస యాకన్న,గౌని యాదగిరి,రావుల యాకన్న,కడుదుల వెంకటేష్,పొన్నం సోమేష్,కడుదుల దిలీప్,నిమ్మల శ్రీను,నీలం వీరన్న,దోమల యాకస్వామి,ఎర్ర రవి…ఇతర సభ్యులు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్,ఎంపీటీసీ సభ్యురాలు జినుకల అనురాధ,కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరోజు రాజశేఖర్, కడుదుల రామకృష్ణ,మంచినీళ్ళ రవీందర్ రెడ్డి,వేముల విజయ పాల్ రెడ్డి,గుండాల బిక్షం,ఏరనాగి రమేష్,ఏరనాగి వెంకన్న,ఎండి మున్వర్,కొంపెల్లి యాకన్న,ఎండి మహబూబ్ ఖాన్,మైదం మల్లయ్య,దాతలు బండ శ్రీనివాస్,జాటోత్ శ్రీనివాస్,బానోత్ దస్రు నాయక్,కొండ్రెడ్డి ఎల్లారెడ్డి,జినుకల వెంకట్ రాంనర్సయ్య,చెలిమల్ల గణేష్,ఇర్రి లింగారెడ్డి,భారత్ గ్యాస్ నాగార్జున,సూపర్ మార్కెట్ రాజేందర్ తదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.