యుగసత్కారాలకై సిద్ధం చేయి…!!!

యుగసత్కారాలకై సిద్ధం చేయి…!!!

నేను పరీక్షా పత్రాన్ని మాట్లాడుతున్నాను
బాగా రాయండి…
గడిచిన దినాలతో వెలితినెంచక
వచ్చే రోజులతో పొద్దులు నిర్వచనమై
భావితరాలకు బాటలు వేస్తు…
చెదరని శాసనాలను యుగసత్కారాలకై
సిద్ధం చేయి…

నేటి బాలురుగా ఎదగుతూనే
పౌరులుగా బాధ్యతలు స్వీకరిస్తూ…
బడుగు జీవితంగా ప్రాణాన్ని కోల్పోక
బలగం పెంచినదిగా వ్యాపకమై…
కడుపు తీపిని మరిచి కారణాన్ని
చూపని నిత్యంతో తడిసిన
ఆదర్శభావమై పోతపోసిన నిగ్రహంతో
నిలబడు…

కాలమెంతో జ్ఞాన సందేశమై
కనువిప్పును తెల్పేటి ప్రయాణమది…
పొదగని మనస్సుతో వివక్షకు రంగువై
పూసిన క్షణాలతో దూరమేయబడకు…
నిబద్ధతతో నిశీ కవాటాలను దాటుతు
సహనాన్ని కోల్పోని ఆశయనికై
ప్రయత్నించు…

ఇష్టంతో ఇమిడిపోయి…
కష్టపడి చదివిన చదువులతో
సమైక్యతా భావంతో పథాకమై నిలిచి
మనిషిలోని నిద్దురపోయిన
మానవత్వాన్ని మేల్కొలుపుతు…
దేశ ఉద్దరణకు ఉద్యమాలు కావని
యువకుల చేతుల్లో చైతన్యం కోరుతు
ముందు వారికి బహుమానమివ్వు…

దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396

Get real time updates directly on you device, subscribe now.