అంటరాని కవిత
———————-
దొర
నన్ను ఎగాదిగా చూసి
ఏమైందిరా ! ఎటో పోతున్నావ్
అన్నప్పుడు అర్థం కాలే
నేను వేసుకున్న
తెల్ల చొక్కా నచ్చలేదని
కొత్త చెప్పులారా!!
అన్నప్పుడు అర్థం కాలే
నా మట్టి పాదాలకు
అలంకరణ ఎందుకని
ఒడ్లు రాసి ఎక్కి
ఓలి గోలి గాని
ఒడ్లు తూర్పాల పట్టినప్పుడు
నే పితికిన పాలు
తెచ్చిన నీళ్లు
తాగినప్పుడు ,
బంతిలో నేను
పక్కన కూర్చున్నప్పుడు
చివుక్కున లేచిపోయినప్పుడు
గుర్తుకొచ్చింది
నేను అంటరాని వాడిని అని,
నా అంతరంగానికి.
✍️ రచన: దోమల యాకస్వామి
గ్రామం &మండలం.నర్సింహులపేట.
జిల్లా: మహబూబాబాద్.