మరువని గమనం…… శ్రీవిద్య వ్యాస కర్త


సినీ ప్రపంచం లో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంటుంది .సంగీతానికి పెద్ద పేట వేస్తారు. సినిమాలలోని పాటలు కొంతమందిని ఉర్రూతలూగిస్తే ,మరికొన్ని పాటలు ఏడిపిస్తాయి, కొన్ని పాటలు లాలిస్తాయి, కొన్ని ఉత్తేజం రగిలిస్తాయి.సినిమాలోని సంగీతం మరియు పాటలు ఒక్కోసారి సినిమా హిట్ను నిర్ణయిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలు వాటి యొక్క లిరిక్స్ నోటికి చేరవు లేదా అంద కేవలం సంగీతమే వినపడుతుంది పాటల పదాల కంటే ముందుగా హోరుమని సంగీతమే చెవులకు చేరుతుంది.పాటల యొక్క అర్థాలు అర్థం చేసుకునే లోపు మ్యూజిక్ చెవుల్లో మారుమోగుతుంది.ఇటీవల విడుదలైన సినిమా ‘సలార్’ లోని ఒక పాట ఎంతో అర్థవంతంగా , మనస్సుకు హత్తుకునేలా రాశారు రచయిత గారు.”సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి”అని మొదలవుతుంది ఈ పాట , ఈ పాటలో స్నేహితుల గురించి ఆపదలో ఉన్న స్నేహితుడు మరో స్నేహితుడిని రక్షించమని అడగడానికి వచ్చే క్రమంలో స్నేహితుని శక్తి సామర్థ్యాల గురించి వర్ణించటం అత్యద్భుతం.ఆపదలో ఉన్న స్నేహితుని రక్షించడానికి సాక్షాత్తు సూర్యుడే గొడుగు పట్టుకుని వస్తే, ఆ గగనతలానికి రాజైన సూర్యుడే వచ్చి రక్షణగా నిలబడితే అని చెప్పే ఆలోచన చాలా బాగుంది . తన స్నేహితుని యొక్క బలాన్ని సూర్యుని శక్తితో పోల్చడం , స్నేహితుని యొక్క బలాబలాలు చెప్పకనే చెప్పాడు . సూర్యుడే వచ్చి భుజం తట్టి అండగా నిల్చుంటాడని తన స్నేహితుడి తనకు కొండంత అండ అని, కష్టంలో ఉన్న స్నేహితుడు యొక్క నమ్మకం. చిమ్మ చీకటిలోనూ నీడలా ఉండేటోడు. చిమ్మ చీకటిలో నీడల తన స్నేహితుడు తనతో ఉంటాడని మరో స్నేహితుడు అనుకోవడం ఆ స్నేహితుని యొక్క ఆలోచన, చిమ్మ చీకటిలో కూడా నీడలా వెంట ఉండే వాడే స్నేహితుడు, చీకటిలో అంటే చావు వరకు . చీకటిలో ఎవరు రారు ఎవరు ఉండరు తన స్నేహితుడు తనతో నీడలా వస్తాడని ఆశిస్తున్న అనుకుని మనోభావం ఎంతో గొప్పది ఇక్కడ
రెప్పనోదలక కాపు కాసే డే కన్నువాడు ఈ వాక్యం రాయాలని రచయితకు వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.రెప్పను వదలని ,కన్నుతో సరితూగడం ఎవరివల్లా కాదు. తన స్నేహితుని స్నేహం స్నేహం గురించి వచ్చిన ధైర్యమే ఈ వాక్యాన్ని ఇచ్చిందేమో అని నా ఆలోచన. తన స్నేహితుని గుణగణాలను చెప్పే క్రమంలో రెప్పనవదలక కాపు కాసాడు కన్నువాడు అని ఎంత బాగా చెబుతున్నాడు , రెప్పకు ,కంటికి ఉన్న అవినాభా సంబంధం గురించి చెప్పక్కర్లేదు. అటువంటి ఇద్దరి స్నేహితుల సంబంధాన్ని తెలియజేయడం. స్నేహితులు కాపాడే క్రమంలో కంటిని కాపాడే రెప్పవలె ఉంటాడని అర్థం. బలవంతుడైన స్నేహితుడు ఉండడం వేరు అన్ని సమయాలలో కాపు కాసేడి స్నేహితుడు ఉండడం వేరు అని వర్ణించడం బాగుంది
తన స్నేహితుడు తనను కంటికి రెప్పవలె కాపాడుకుంటాడని తన విశ్వాసాన్ని తెలియజేయడం కూడా ఎంతో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఖడ్గం ఒకడైతే కలహాలు ఒకడివిలే ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే
పాట యొక్క చరణం లో ఇద్దరి స్నేహితుల గురించి వివరించే క్రమంలో ఒకరి కలహాలకు మరొకరు ఖడ్గమవుతారట ఒకరు గర్జన ,మరొకరు ఉప్పెన. గర్జించే ఆకాశము ఒకరు ఉప్పొంగే సముద్రం ఒకరు అని ,వారిద్దరూ ఒకటైతే ప్రళయమే అని చెప్పటం , వారి యొక్క సామర్ధ్యానికి నిదర్శనం ఒకరికి ఒకరు నమ్మినడిచిన స్నేహమే ఇది లే నూరేళ్లు నిలవాలి
స్నేహితులు ఇద్దరు సామర్థ్యం ఉన్నవారు శక్తి గల వారు ఇద్దరూ ఒకరికొకరుగా నడిస్తే ,వారి యొక్క స్నేహం నూరేళ్లు ఉంటుంది .నూరేళ్లు నిలవాలి అని ప్రేక్షకులు అనుకునే విధంగా తీర్చిదిద్దారు స్నేహం గురించిన ఈ వాక్యం చాలా అద్భుతంగా ఉంది.

వేగం ఒకడు త్యాగం ఒకడు గతము మరువని గమనమే
ఒకరిది వేగమట ,ఒకరిది త్యాగమట ,ఒకరిని వేగంగా మరొకరిని త్యాగంగా మలచడం. గతాన్ని మర్చిపోకుండా చేసిన త్యాగాన్ని మరవకుండా గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుత కాలంలో ఒకరికి ఒకరుగా జీవించడాన్ని చూపించడం చాలా బాగుంది. ఈ ఆధునిక ప్రపంచంలో విలువైన స్నేహాన్ని గురించి, స్నేహితుల మధ్య ఉండే సంబంధమును గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పినందుకు రచయితకు నా ధన్యవాదాలు.

శ్రీవిద్యా
టీచర్
వరంగల్

Get real time updates directly on you device, subscribe now.