కలలూ..కనలేవా.‌?

కలలూ..కనలేవా.‌?

కనులిచ్చిన దేవుడు
కలల్ని ప్రసాదిస్తే..
హాయిగా..నిద్రిస్తున్న
సమయంలో..

కలల అలలు
ఎద మది తలుపుల
తలుపు తడుతుంటే..
కలల్ని..వద్దని
కను పాపలు..ఎలా
కాదనగలవు..?

వద్దన్నా..వినే కలల
కల్లోలాలు..కను పాపల నుండి
రాలక మానుతుందా..?

కను కొలకల నుండి
జాలువారే.. జలతారలు
కలలు..ఆశల హరివిల్లులు.

విజయకుమార్ గడియా
చిత్తూరు.

Get real time updates directly on you device, subscribe now.