కొలాం వీరరత్న కుమ్రం సూరు

వ్యాసకర్త ..ఆత్రం మోతీరామ్

*కొలాం వీర రత్న కుమ్రం సూరు*

జోడేఘాట్ గ్రామంలో చిన్ను, మారుబాయి దంపతులకు 1918లో కుమ్రం సూరు జన్మించారు. జోడేఘాట్ అడవి ప్రాంతంలో చిన్ను, మారుబాయి దంపతులు 18 ఎకరాల భూమిని సాగుచేస్తూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జున్‌గామా (ఆసిఫాబాద్) జిల్లాలో, గోండు, కొలాం, తోటి, మన్నేవార్ పర్ధాన్, నాయికపోడ్ మొదైలెన గిరిజన తెగలపై కొనసాగుతున్న దౌర్జన్యాలు దోపిడిలు, భూ ఆక్రమణాలు, అన్యాయాలు, ఆనాటి వ్యాపారులు, పట్వారులు, గ్రామాధికారులు, ఆదివాసులపై అనేక దౌర్జన్యాలు చేసేవారు. జంగ్లాత్ (అటవీ అధికారులు) భూమిని పంటలతో సహా ఆక్రమించుకునే వాళ్ళు మొత్తం గూడేలను తగులబెట్టేవాళ్ళు వారి మన ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో ఎటువంటి పైశాచిక కృత్యాలకు పాల్పడతారో చెప్పలేని స్థితి. ఇటువంటి దురాగతాల సంఘటనలను చూ స్తూ చిన్నతనం నుంచి ఎదుగుతున్న వయసులోనే తన మిత్రులతో, గ్రామపెద్దలతో చనువుగా ఉండి తమ కష్టసుఖాలు పాలు పంచుకుని వారికి ధైర్యానిచ్చి అండగా నిలబడేవాడు. కొలాం జాతి ప్రజలు వెనుకబడిన బడుగు బలహీన జీవితాలు గడపడానికి కారణం ఆనాటి నైజాం నవాబులు వారి తబేదార్లు, రాజాకార్లు, కొనసాగిస్తున్న హింసలను ఆక్రమాలను, దౌర్జన్యాలను సంహించలేక ఎదురు తిరిగి మా జాతిని నైజాం ఉక్కు సంకెళ్ళు నుంచి విముక్తి గావించాలని నిర్ణయించుకున్నారు. అధికారులతో చర్చించి కొన్ని చిన్నచిన్న సమస్యలను నేరుగా పరిష్కరించగలిగారు. నైజాం పాలనతో తీవ్రైమెన హింసలను, అత్యాచారాలను ఎదుర్కొంటున్న ఆదివాసులను ఐక్యం చేసి ఆదివాసుల హక్కుల సాధన కోసం నిజాం నిరంకుశ పాలనపై పోరాడాలని నిర్ణయించి ఆదివాసీ ప్రజలను సమీకరించే తరుణంలో జోడేఘాట్‌కు కుమ్రంభీం ఎడ్లకొండు రాక ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నైజాం రజాకార్లుకు ఎదురు తిరిగిన ఆదివాసీ జనులను చిత్రహింసలు చేసేవారు. కుమ్రంభీం నాయకత్వంలో మా భూములకు పట్టాలు సంపాదించాలని కుమ్రం సూరు, ఎండ్లకొండు ప్రయత్నించారు. మా వాళ్ళు సాగుచేసిన భూములను దక్కించుకోవడం కోసం ఎన్ని చిత్రహింసలు చేసి న మా వాళ్ళు గుడిసెలను తగలబెట్టిన భయపడకుండా మమ్ములను మీరు ఏం చేసినా మా ప్రాణాలు పోయినా తమ భూములను వదిలిపెట్టి వెళ్లిపోమని, కుమ్రం సూరు ఎదిరించారు. కుమ్రం సూరుతో వందలాది కొలాం, గోండు ఆదివాసులు ఆసిఫాబాదు (జున్‌గామా) ఆనాటి జిల్లా కలెక్టర్ నాజం సాహెబుకు ఆ మేరకు ఆర్జీలు పెట్టుకున్నారు. నైజాం నవాబును కలవాలని ఎంతగా ప్రయత్నించిన అధికారులు ద్రుష్పవర్తన వలన మన వాళ్ళకు దర్శనం కాలేదు. పద్ధతి ప్రకారం తము సాధించుకోవలసిన పనిని సాధించుకోలేక పోవడం వలన వారిలో ఆగ్రహం పెల్లుబిక్కింది. కొంతమంది గోండు, కొలాం వీరుల సహకారంతో జల్ జంగల్, జమీన్ కోసం విజయమో వీరస్వర్గమా అన్న రీతిగా జోడేఘాట్ కొండలపై పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. జోడేఘాట్, బాబేఝరి, పాట్నాపూర్, టోకన్‌మోవాడ్, బలంపూరం, గుండిగూడ, సుర్థాపూర్, దెమ్మడిగూడ, గోగన్‌మోవాడ్, చిర్రన్‌మోవాడ్, భీమన్‌గొంది, మురికిలొంక, ఆదివాసులను సమీకరించి వారికి శిక్షణ ఇచ్చి గిరిజనులపై దౌర్జన్యాలు అత్యాచారాలను, ఆకృత్యాలకు పాల్పడిన నైజాం ప్రభుత్వ సైనికులపై తిరుగుబాటు చేశారు.

ఆసిఫాబాద్, తహసీల్దార్ 1940లో కొందరు సైనికులను వెంటపెట్టుకొని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కుమ్రం సూరును నైజాం సైనికులు కుమ్రం భీం ఆచూకీ తెలియజేయాలని బెదిరించారు. ఎంత ప్రయత్నించిన భీం ఆచూకీ వారికి తెలియజేయలేదు. కుమ్రం భీం వరుసకు అన్న అయినప్పటికి అతను గొండు నేనే కొలాం తెగకు చెందిన వాడినని వివరించిన వినకపోవడంతో కుమ్రం సూరు తనకున్న విద్యను ఉపయోగించి తేనెటీగలను సైనికుల పైకి పంపి దాడి చేయించడం వలన నైజాం సైనికులు వెనుతిరిగి పారిపోయారు. మడావికొద్దు, నైజాం సైనికులు ఆశపెట్టిన ప్రతిఫలానికి లొంగిపోయి వీరు ఉన్న రహస్య స్థావరాన్ని తెలియపరచిన అన్యాయుడు కుమ్రం భీం, కుమ్రం సూరు ఎడ్లకొండు అడవిలో అలజడికి ఆయుధం చేతపట్టి పొరుకు తలపడ్డారు. ఈ పోరాటంలో కొలాం తెగకు చెందిన వారు ఆత్రం భీము, ఆత్రం పోచయ్య, టేకం ముత్తు, ఆత్రం పావుగా, టెకం పావుగా, దుర్గం కొండు వీరితో పాటు మరెందరో ఈ పోరాటంలో అమరులయ్యారు.

1975లో ఐటీడీఏ (సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ)లు ఏర్పడిన తరువాత అప్పటి అధికారులతో చర్చించి కుమ్రం భీం వర్థంతి సభను ప్రభుత్వం తరుపున నిర్వహించే విధంగా కృషి చేసినారు. కుమ్రం భీం వర్థంతి జరిగిన ఐదురోజుల నుంచి కుమ్రం సూరు వర్థంతులను వివిధ కొలాం గూడేలు మా కోలాం సంస్కృతి సంప్రదాయాల బద్ధంగా ఘనంగా నిర్వహిస్తాం. నిస్సహాయులుగా నిస్తేజంతో సతమతమవుతున్న కొలాం గిరిజనుల హృదయాలలో బీజ ప్రాయంగానైనా సరే స్వాతంత్రేచ్ఛను రగిల్చిన ఖ్యాతి మా కుమ్రం సూరుకు దక్కింది. అమాయక ఆదివాసుల జీవితాలకు ఒకానొక లక్ష్యం కల్పించి స్వాతనా త్య్ర జీవనం గడపడానికి దారిచూపిన ఆదర్శమూర్తి చిరస్మరణీయుడు మా కుమ్రం సూరు.

– ఆత్రం మోతీరామ్
8985051473

**** *****  *** ****

ఆధారాలు

1. గ్రామంలోని వ్యక్తులు.
2. వంశీయులు.

3.పట్టా పాస్ బుక్/పహాని.

4.ఐటీడిఏ K.D.O. (కొలాం డెవలప్మెంట్ ఆఫీసర్) గా నియమించిన ప్రభుత్వ పత్రాలు.(పుట్టిన తేది)

5.వంశ వృక్షం

Get real time updates directly on you device, subscribe now.