వెదురు చాట విశిష్టత

ప్రతాపగిరి శ్రీనివాస్ గారి వ్యాసం

*వెదురు చాట విశిష్టత*

,ప్రకృతి సిద్దంగా లభించే వెదురు తో తయారు చేసిన పాలవెల్లి, చాటలే లక్ష్మీ దేవీకి ప్రీతీ పాత్రం.
వెదురు మొంటే,గుల్లలతో అమ్మ వారులకు పూజలు చేస్తూ ఇష్ట కార్యాలు సిద్దింపచేసుకుంటారో, సార పెట్టె, ఫలహార గంపలు వివిధ పవిత్ర సందర్భలలో ఉపయోగించి పుణ్య కార్యాలు చేస్తారో …. అదే తీరున దీపావళి నోములు,కేదారేశ్వర వ్రతం సందర్భంగా భక్తులు చాటలో వ్రత సామాగ్రిని ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ
లక్ష్మీ దేవీ కరుణ కటాక్షాలు పొందతారు .
అంతే కాదు శిశువు జన్మించినపు డు, ఎలాంటి వైరసులు సోకకుండా ఆ శిశువును చాటలో వేసి పడుకోబెడతారు. భర్త వియోగం సంభవించకుండా నిత్య సుమంగళి గా ఉండుటకు పార్వతీ దేవి శూర్ప సంపుటి వ్రతం చేయుటకు పార్వతి దేవి కోరిక మేరకు పరమశివుడు వెదురు సృష్టించి, చాటలు తయారు మేదరులచే చేయించి,పార్వతి దేవిచే శూర సంపుటి వ్రతం చేయిస్తాడు . అలా మొదలైనది వెదురు చాట యొక్క విసిష్టత.భూలోకంలో కూడా స్త్రీలు ఇలాంటి వ్రతమును ఆచరించుటకు వెదురు చాటను తప్పక ఉపయోగిస్తారు. పవిత్ర కార్యాలలో పసుపు, కుంకుమల కు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో వెదురు చాటకు కూడా అంతటి ప్రాధాన్యత ఉంటుంది.

ధాన్యం పండిన పిదప పంట చేతికి వచ్చినప్పుడు ధాన్యం మార్పిడి సమయంలో వెదురు చాటతోనే తూర్పారు పడుతూ తాలు,మేలు వేరుచేస్తారు. వెదురు చాటతోనే దాన్యం చెరగడం వల్ల రాళ్లు సులభంగా వేరు చేయడానికి వీలవుతుంది. గృహిణిలు వంటచేసే సమయంలో బియ్యంలో వుండే వడ్ల గింజలు (మెరిగలు) ఏరి పారేసి బియ్యం శుభ్రం చేస్తారు. గోదావరి కృష్ణ నదుల సందర్శన సమయంలో మహిళలు వెదురు చాట (చిన్న చాట) లేదా మొంటె చిన్న గుల్లల్లో పూలు,పండ్లు పసుపు కుంకుమలతో పాటు హారతులు వెలిగించి హారతి ఇచ్చి వాయనం ఇస్తారు. గ్రామ దేవతలు కొలువై ఉన్న సమయంలో దుర్గమ్మ పెద్ద దేవుడులకు మేక,గొర్రెలు బలి ఇచ్చి రక్తాన్ని వెదురు చాటలో బియ్యం తో కలిపి పొలిమేర చుట్టూ చల్లి పొలి చేస్తారు.అశుభకార్యాలలో భాగంగా మనిషి మరణానంతరము దహనం చేసిన పిదప కట్లు కట్టనటు వంటి వెదురు చాటతోనే స్మశానంలో బూడిద ఎత్తి స్వచ్ఛమైన తంగేడు చెట్టు కింద లేదా మోదుగ చెట్టు కింద పోస్తూ ఉంటారు. మనిషి జన్మించిన అప్పటినుండి చనిపోయిన పిదప కూడా శుభ,అశుభ కార్యక్రమాలకు చాట ఎంతగానో విశిష్టతను సంతరించుకుంది. ఇలాంటి చాటలులు తయారుచేసే మహాభాగ్యము శివాంశ సంభూతులైన మేదరి కులస్తులకు దక్కడం వారి అదృష్టంగా భావిస్తూ వుంటారు. కానీ… రోజు, రోజుకి చాటలు అల్లుతున్న మేదరన్నల చేతులు సన్నగిల్లుతున్నాయి. వారి జీవితాలు మసక బారుతున్నాయి.కారణం చాటలు అల్లుటకు కావలసిన ముడిసరుకు అయిన వెదురు దొరకక దిక్కు తోచని స్థితిలో మేదరులు సతమత మవుతున్నారు. ఆ మేదరి కులవృత్తిని వదులు కుంటూ… ఇతర రతర కూలీ నాలి పనులు చేయుటకు ఆసక్తి చూపుతున్నారు.

పూజలు, వ్రతాలు, అధ్యాత్మికత, భక్తి భావం, సంపూర్ణ మానవీయ విలువల, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు, పరిపూర్ణ జీవన విధానానికి బాటలు వేస్థాయి . సకల దేవతల ఆశీస్సులతో వెదురు పుష్కళంగా లభించి వ్రతానికి చాటలు అందించే,…వెదురు చాటలు ఆల్లుకుని జీవించే మేదరుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని విశ్వసిద్దాం …

— ప్రతాపగిరి శ్రీనివాస్ హనుమకొండ, 7993103924
=============

Get real time updates directly on you device, subscribe now.