పదోన్నతులు దక్కని పండితులు

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్

 

మూడు దశాబ్దాలుగా పదోన్నతులు దక్కని పండితులు, పి.ఇ.టి.లు

ప్రముఖ పత్రికలలో భాషాపండితుల పదోన్నతులు అసలు విషయానికి వస్తే అంతా తుస్సు

శ్రమ దోపిడికి గురౌతున్న భాషా పండితులు., పి.ఇ.టి.లు

వెట్టి చాకిరి చేస్తున్న భాషా పండితులు.,పి.ఇ.టి.లు

ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన అమలు కాని భాషా పండితుల., పి.ఇ.టిల పదోన్నతులు

జీ.వో లు వచ్చిన పదోన్నతులకు నోచుకోని భాషా పండితులు.,పి.ఇ.టి లు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న భాషా పండితులకు .,పి.ఇ.టి లకు మూడు దశాబ్దాలుగా పదోన్నతులు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ప్రాథమిక పాఠశాల జీతాలు తీసుకుంటూ శ్రమ దోపిడికి గురౌతున్నారు.
2017 ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పండితుల.,పి.ఇ.టి.ల సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు కావొస్తున్న పండితులకు.,పి.ఇ.టి లకు పదోన్నతులు రాలేదు. ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రపంచ తెలుగు ప్రతినిధుల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.అయినప్పటికి పదోన్నతులు రాలేదు.గ్రాడ్యూవేట్., టీచర్ల శాసనమండలి ఎన్నికల ముందు భాషా పండితులకు పదోన్నతులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీ.వో లు విడుదల చేసింది.అన్ని ప్రముఖ పత్రికలలో భాషాపండితుల పదోన్నతులు అనే శీర్షికతో పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించబడ్డాయి కాని అసలు విషయానికి వస్తే అంతా తుస్సు మన్నది.
భాషా పండితులుగా ఉద్యోగంలో చేరి భాషా పండితులుగా పదవీ విరమణ చేస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పనికి తగిన వేతనం ఇవ్వాలి.కాని భాషా పండితులకు.,పి.ఇ.టి లకు ఉన్నత పాఠశాలలో పని చేస్తూ ప్రాధమిక పాఠశాల జీతాలు తీసుకుంటూ వెట్టి చాకిరికి గురౌతున్నారు.
భాషా పండితుల దగ్గర చదువు కున్న వారు స్కూల్ అసిస్టెంట్లుగా., ప్రధానోపాధ్యాయులుగా., విద్యాశాఖ పర్యవేక్షణ అధికారులు గా వస్తున్న భాషా పండితులకు మాత్రం పదోన్నతులు లేక ఉన్నత చదువులు పిహెచ్.డి.,ఎం.ఇడి., నాలుగు., ఐదు స్నాతకోత్తర డిగ్రీలు ( పి.జి )లు చేసిన ప్రయోజనం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం ఒక ఉద్యోగం లో చేరిన వారికి కనీసం మూడు పదోన్నతులు ఇవ్వాలి అని ఉంది. ఆచరణలో భాషా పండితుల విషయం లో ఒక్క పదోన్నతి రావడం లేదు.తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులకు మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించి జీ.వో.10.11 విడుదల చేసింది.భాషా పండితులకు మూడు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు గడిచినా పదోన్నతులు రావడం లేదు. భాషా పండితుల జీతాలు స్కూల్ అసిస్టెంట్ జీతాలు దగ్గర లోనే ఉన్నాయి.ఆర్థకంగా కాకుండా ఆత్మగౌరవం కోసం పదోన్నతులు అడుగు తున్నారు.
ఎస్జీటీ లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇవ్వాలి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్జీటీ లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇస్తామని ప్రకటించారు. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ మొదలు పెట్టాలి.
ఉపాధ్యాయులకు పదోన్నతులు., బదిలీలు చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో కాలంగా పదోన్నతులు., బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. బదిలీలు., పదోన్నతులకు మార్గదర్శకాలు విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పదోన్నతులు., బదిలీల ప్రక్రియ ముగిసింది. విద్యా శాఖలో మాత్రమే పదోన్నతులు., బదిలీల ప్రక్రియ మొదలు కాలేదు.
భాషాభిమాని ., తెలుగు సాహిత్యం., సంస్కృతి., సంప్రదాయాల పట్ల పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రి భాషా పండితులకు., పి.ఇ.టి లకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు.

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్.,
రాష్ట్ర కార్యదర్శి
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ( ఆర్. యు.పి.పి ) తెలంగాణ., 9290826988

Get real time updates directly on you device, subscribe now.