వెదురు ఆకుల తేనీరు

ప్రతాపగిరి శ్రీనివాస్ గారి వ్యాసం

వెదురు ఆకుల టీ… అనారోగ్య సమస్యలకు అసలైన పరిష్కారం

 

టీ ల విషయానికి వస్తే, ఈ ప్రపంచం చాలా పెద్దది. ఎన్నో దేశాల్లో ఎన్నో రకాల టీలు తయారు చేస్తున్నారు. జపాన్ లాంటి దేశాల్లో వెదురు చెట్ల ఆకులతో తయారుచేసే టీ చాలా ఫేమస్. ఇప్పు డిప్పుడే ఇండియాలో… డార్జిలింగ్ లాంటి ప్రాంతాల్లో ఈ టీని తయారుచేస్తున్నారు. అల్లం టీ, పసుపు టీ, చామంతి టీ, పుదీనా టీ, లవంగం టీ, మసాలా టీ తులసి టీ ల లాగానే .. వెదురు ఆకుల టీ కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.
ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే చెట్టు వెదురు చెట్టు. రోజుకూ 50 సెంటీమీటర్లు పెరిగేస్తుంది. ఈ చెట్టు నాలుగేళ్లపాటూ పెరిగితే…దీని నుంచి అద్భుతమైన వెదురు కలప వస్తుంది. దాంతో ఫర్నిచర్, బాస్కెట్లు, మ్యాట్స్, పేబర్, బీర్, వస్త్రాలు సహా చాలా తయారుచేస్తారు. వెదురు ఆకుల టీ… థాయిలాండ్, కొరియా, తైవాన్, జపాన్, ఈశాన్య ఇండియాలో పేరు తెచ్చుకుంది. చైనా సంప్రదాయ మందుల్లో వెదురును వాడేవారు. వెదురు ఆకులను మరగబెట్టి… టీ తయారుచేసేవారు. ఈ ఆకులు ముదిరినవి కాకుండా…లేత ఆకుల్ని వాడుతారు. ఈ టీ తేలిగ్గా ఉంటంది. తియ్యగా ఉంటూనే గడ్డి వాసన వస్తుంది. మొత్తంగా గ్రీన్ టీ లాగా ఉంటుంది. ఇందులో కెఫైన్ అన్నదే ఉండదు కాబట్టి… ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
వెదురు ఆకుల నుంచి సిలికా అనే ఖనిజం లభిస్తుంది. ఇది మన శరీరంలోని ఎముకల్ని బలంగా చేస్తుంది. జుట్టు బాగా పెరగాలన్నా, చర్మం కోమలంగా మారాలన్నా… కాలి, చేతి వేళ్ల గోళ్లు ఆరోగ్యంగా, బలంగా అవ్వాలన్నా… వెదురు ఆకుల టీ త్రాగాలి. ఇప్పుడు జుట్టు బాగా పెరగడానికి కాస్మెటిక్ కంపెనీలు వెదురు ఆకుల్ని వాడి… షాంపూలు తయారుచేస్తున్నాయి. మన దేశంలో సరైన ఆహారం లేక ప్రజల ఎముకలు బలంగా ఉండట్లేదు. ముసలివాళ్లు కాకముందే… ఎముకల్లో పటుత్వం తగ్గిపోతోంది. అందువల్ల వెదురు ఆకుల టీ తాగితే… ఎముకలు గట్టిగా అవుతాయి. నోట్లో దంతాలు కూడా బలంగా అవుతాయి. ముసలితనంలో ఎముకలతో వచ్చే అనారోగ్యాలు దూరమవుతాయి అల్జీమర్స్, మతిమరపు అనేవి లేనిపోని సమస్యలు. అవి వచ్చాయంటే వాటిని తగ్గించుకోవాలి అనే విషయం కూడా గుర్తుండదు. ముఖ్యంగా ఆల్జీమర్స్ ప్రమాదకరం… భోజనం తింటూనే… తినడం కూడా మర్చిపోతారు. 60 ఏళ్లప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. అది రాకుండా అడ్డుకోవాలంటే… వెదురు ఆకుల టీ రెగ్యులర్‌గా తాగితే సరి.ఈ టీలో యాంటీఆక్సిడెంట్స్ ఫుల్లుగా ఉన్నాయి. అంటే ఫెనోల్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సీ, ఈ ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అడ్డమైన రోగాలు రానివ్వవు. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఆపగలవు. కణాలను పాడవకుండే చేసే అద్భుత శక్తి వీటికి ఉంది. ఈ ఆకుల్లో సెలెనియం, ఐరన్, కాపర్ (రాగి), జింక్, మాంగనీస్ ఉన్నాయి. ఇవి కూడా వ్యాధుల నుంచి కాపాడు తాయి. పెద్దలు అన్నట్లు ఆకులు, అలములు తిన్న వారు అద్భుతం గా బతికారు అని ఊరకనే అనలే. అది వెదురుకు ఎదురు లేదు అని నిరూపిద్దాం. ఇన్ని ప్రయోజనాలున్న వెదురు టీ ని సేవిద్దాం….
—- ప్రతాపగిరి శ్రీనివాస్ హనుమకొండ,7993103924

Get real time updates directly on you device, subscribe now.