కవి, జర్నలిస్ట్ ‘రాజేష్ ‘ కు కీర్తి ఆర్ట్స్ వారి గరుడ పురస్కారం
====================
గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత సాహిత్య సంస్కృతిక సంస్థ
కీర్తి ఆర్ట్స్ అకాడమీ
వారి సారద్యంలో జరిగిన నాల్గవ వార్షికోత్సవ మహోత్సవం మరియు దసరా పండగ 2021, జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు పురస్కరించుకొని నిర్వహించిన అవార్డుల మహోత్సవం సందర్బంగా కవి,రచయిత, జర్నలిస్ట్
*ఎన్.రాజేష్* కు సాహితీ సంస్కృతిక అంశాల పరంపరలో చేస్తున్న సేవలకు గాను కీర్తి ఆర్ట్స్ అకాడమీ తరుపున
గరుడ పురస్కారం అందజేయడం జరిగింది.
స్థానిక రవీంద్రభారతి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించిన అవార్డుల మహోత్సవం శ్రీ గోరేటి వెంకన్న, శ్రీ దైవజ్ఞ శర్మ, తెలంగాణ స్టేట్ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, యువ సినీ హీరో కిరణ్ కుమార్, ప్రైడ్ ఇండియా కో ఆర్డినేటర్ గాంధీ మరియు మెట్రో టీవీ అధినేత కొండవీటి జయప్రసాద్ అతిరథులు ముఖ్య అతిథులు గా పాల్గొనగ ఈ వేడుక కన్నుల పండగగ జరుగగా పలువురి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్బంగా అతిథుల సమక్షంలో జరిగిన అవార్డు ల వేడుకలో రాజేష్ ను శాలువా, మెమెంటో తో సత్కరించి గరుడ పురస్కారంను అతిథులు అందజేశారు. ఈ అవార్డు స్వీకరించడం పట్ల కవి, జర్నలిస్ట్ రాజేష్ హర్షం వ్యక్తం చేస్తు అతిథులకు అభినందనలు తెలియజేస్తూనే కీర్తి ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ శ్రీమతి బిందు లిమ్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయండం జరిగింది.
Get real time updates directly on you device, subscribe now.
తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
Prev Post
Next Post