సరదాల దసరా

రాజేష్ గారి కవిత

*సరదాల దసరా*
===============
హిందువులందరికి
అతి పెద్ద పండగ
అంబరాల సంబరంగ
సంతోషం ఆనందం
పంచేటి పండగ.

విజయాలు అందించే
పండగనే పేరు సార్థకం
విజయ దశమి అనే
పేరుగల దసరా సంబరం

యావత్ భారతమంతా
విభిన్నపద్ధతుల్లోచేసుకునే
పది రోజుల వేడుక
అమ్మ దుర్గా భవాని
ఆశీస్సులకై చేసేటి పండగ

రాముడురావణుడిసంహారం
మహిశుడిపైదుర్గమ్మజయం
పాండవులువీడినవనవాసం
పాలసంద్రంనఅమృతము
ఈరోజేజరిగెననిప్రాశస్థ్యం

ఊరువాడయావత్ దేశం
సంబరంగచేసేటి పర్వదినం
సంతోషంసంబరంకలబోసి
శుభములు తేవాలీ దసరా!
ఆనందం పంచాలీ సరదాల
సంబరాల దసరా!!

*ఎన్.రాజేష్-కవి,జర్నలిస్ట్*
హైదరాబాద్-9849335757.

Get real time updates directly on you device, subscribe now.