కావ్య లహరి 1

కావ్య లహరి 1 విభాగం

**************************
కావ్యలహరి స్వర సంకలనం
**************************
స్వరం అనే నూతన వచన సాహిత్య ప్రక్రియ తొలిసారిగా  సంఘటిత సమాజ హిత విప్లవ చైతన్య రథసారథి అయిన నేటి కాలపు జాతీయ నేత స్వర్గీయ శ్రీ కిషన్ జీ మరణవార్త విని అశ్రునయనాల వ్యథలో నుండి ఆశువుగా ఉద్భవించిన ప్రక్రియ ఇది. అలా రామకృష్ణాభ్యుదయం అనే స్వర సంపుటిని రాసాను.

ఈ స్వరం ప్రక్రియను కావ్యలహరి (వాట్సపు) సాహిత్య సమూహం స్వీకరించి రోజువారి అంశాలలో భాగంగా నేడు 04 నవంబరు మాసం 2021 న ఐచ్ఛికం అంశంలో పోటీ నిర్వహించడం అభినందనీయం. కావ్యలహరిని సృష్టించిన శ్రీ పొట్లూరి హరికృష్ణ గారికి, శ్రీ కల్పన గారికి, శ్రీ సాకివార్ ప్రశాంత్ కుమార్ గారికి, మిగితా సమూహ నిర్వాహకులకు మరియు కవులకు, కవయిత్రులకు అందరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
******************************************
_______________
స్వరము-లక్షణాలు
————————
1. దీనిలో 5 వరుసలు ఉంటాయి
2. మొదటి వరుస లో 10 అక్షరాలు మించరాదు
3. రెండవ వరుసలో 10 అక్షరాలు మించరాదు
4.మూడవ వరుసలో 10 అక్షరాలు మించరాదు
5. నాల్గవ వరుసలో 10 అక్షరాలు మించరాదు
6. ఐదవ వరుసలో 10 అక్షరాలు మించరాదు
7. ఒక స్వరంలో 50 అక్షరాలు మించరాదు
8. అర్థవంతమైన భావవ్యక్తీకరణ ఉండాలి
9. ప్రాసలు, అలంకారాలు, వర్ణణలు వాడవచ్చు
10. ఇది వచన(గద్య) కవితా ప్రక్రియ
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
💐స్వరము💐 రూపకర్త
౼౼౼౼౼
డా.ఎల్మల రంజీత్ కుమార్, నిర్మల్
NET&JRF,SET,phd
ప్రముఖ తెలుగు సాహితీవేత్త

స్వరము :
ఉదాహరణ:-
1)
మదిలోని భావాలను సైతం
నిధిలా మలచి మైమర్పించి
దేదీప్యమానమ్ము గావించుచు
ఎదలోని వ్యథలను మాన్ప
కవి కలము హితం చూపెను
2)
మనసులోని మధురమైన
భావం పురివిప్పితే చాలు
అమృతమగు స్వరమౌతుంది   
చైతన్యరథమౌతుంది
తెలుసా!! ఓ మనసా
**********************
రచన రూపకర్త
**********************

**********************
శీర్షిక: *బసవడు*
పేరు:కాటేగారు పాండురంగ విఠల్
హైదరాబాద్
ప్రక్రియ:స్వరము
9440530763

భక్తులకు ప్రణమిల్లినట్లు
శివభక్తులను చూచినట్లు
పద్మాసనమున వున్నట్లు
ద్వితీయ శంభునిలా-నందిలా
బసవడే తలపించెనుగా!

సనాతన మార్గం అడుగులు
శివనామమే స్వరం-గళము
శివుని చిత్తమే పరుగులు
మహేశ్వరాచారమే తనువు
బసవడు పెరగ సాగెను!
&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&
:ప్రక్రియ: స్వరము
రచన: వెలిదె ప్రసాద శర్మ. వరంగల్
చరవాణి: 9441930144
*కవితా శీర్షిక: శుభాకాంక్షలు*

దివ్వెలు వరుసగ నిల్పేది
శుచిమతియై వెలిగించేది
లక్ష్మని గౌరిని కొలిచేది
చక్కని గొప్పని పండుగయౌ
దీపావళికిదె స్వాగతము!

బిడ్డాయల్లుడు పిల్లలుఇంట
సందడి చేయుచు నడిచేది
బుద్ధిగ కేదారేశుని గొల్చు
చక్కని గొప్పని పండుగయౌ
దీపావళికిదె స్వాగతము!

ఇంటినియలికి శుభ్రముచేసి
దైవారాధన చేయగదలచు
పిండివంటలనారగింపుల
చక్కని గొప్పని పండుగయౌ
దీపావళికిదె స్వాగతము!

బాణసంచలు తారాజువ్వలు
నింగికియెగసే రాకెట్టూలు
చీకటిలోన వెల్గులనింపే
చక్కని గొప్పని పండుగయౌ
దీపావళికిదె స్వాగతము!

దశకంఠుడి విగ్రహమింక
బాణపు బాంబున కాల్చునది!
దుష్టుల పీడ విర్గగ జేసే
ఛక్కని గొప్పని పండుగయౌ
దీపావళికిదె స్వాగతము!

కొత్తజంటకు దీవెల కట్నం
ప్రేమగ పెట్టుచు వెలిగేది
శ్రీలను భాగ్యము నొసగెడి
చక్కని గొప్పని పండుగయౌ
దీపావళికిదె స్వాగతము!

కావ్యలహరిలో సభ్యుడనై
కవులకు నిర్వాహకులకు
చక్కని గొప్పని పండుగయౌ
దీపావళిలో తెల్పితినయ్య
*స్వరమున* శుభ కాంక్షలను!
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఆర్.ప్రవీణ్ , హైదరాబాద్
9014124221
ప్రక్రియ: స్వరములు
శీర్షిక:- అతివల పండుగ దీపావళి

అతివలు సుఖశాంతులతో
సౌభాగ్యంగా విరాజిల్లితే
అదే నికార్సైన దీపావళి
ధన ధాన్యం ఆనందాలతో
వికసిస్తోంది కుటుంబావళి

భ్రూణ హత్యలు ఆపాలి
పెంచాలి ఆడ సంతతిని
పచ్చగా ఉంటుంది సంఘం
అతివలుంటేనే దీపావళి
నిండైన సంతోషం అతివతో
%%%%%%%%%%%%%%%
%%%%%%%%%%%%%%%
శీర్షిక:  కేదారేశ్వరుడు

ఇల్లు వాకిలినీ కడుక్కుంటాం
మావితోరణాలు కట్టుకుంటాం
తలంటు స్నానాలు చేసేస్తాము
రంగవళ్ళులను దిద్దేస్తాము!
కేదారీశా! శరణం శరణం!

దేవుని గద్దె సున్నం జాజుతో
చక్కగ అలికి దేవుని నిల్పి
కూరాడులను నీరాడులను
దాపట వల్పట నిల్పెదము!
కేదారీశా! శరణం శరణం!

ఇరదిఒక్కటి లేదా రాశి
చేటలొ పోకలు ఖర్జూరాలు
పస్పుకొమ్ములు ఫలపుష్పాలు
చక్కగ నిల్పుచు కొలిచెదం!
కేదారీశా! శరణం శరణం!

కేదారేశునియఖండ దీపం
వెలుగగ పూజలు చేస్తాము
కథలను చదివి ప్రార్థనచేసి
పెద్దల దీవెన పొందెదము!
కేదారీశా! శరణం శరణం!

బెల్లపు పాశము నైవేద్యాలు
ఎల్లరికప్పుడె పంచేస్తాము!
చేతికంకణం మెడకు దండ
వేయుచు నోచెదము ఆహాహా!
కేదారీశా! శరణం శరణం!
$$$$$$$$$$$$$$$$$$$$
$$$$$$$$$$$$$$$$$$$$
స్వరము- ప్రక్రియ
దీపావళి – శీర్షిక

కృష్ణ, సత్యభామలు కలిసి
ధర్మరక్షణకై కదిలిరి
పుత్రుడైననేమి నరకునే
చంపిరి గదా రణరంగంలో
చెడునశించి సత్యం నిలిచే

ఋషికంటకుడు రావణుడు
స్త్రీల చెరపట్టే, మధాంధుడు
రాముడు తెగటార్చె ఆతని
అయోధ్య వచ్చి రాజ్యం చేపట్టే
ప్రజల ఆనందం దీపావళే

ఎం. అరుణ కుమారి
స్వీయ రచన
హైదరాబాద్
9985196847
######$$$$#########
###########$$$$$$$$$
+91 94901 68715: కావ్యలహరి
మేడిశెట్టి యోగేశ్వరరావు..
మచిలీపట్నం
ప్రక్రియ :- స్వరము
శీర్షిక:-తరతరాల చరిత
……………………..
వరాలెన్నొ కురిపిస్తూ
తరాలెన్నొ మారినాయి.‌..
తమబాగునుచూసుకుంటు
తల రాతలు మార్చుకుంటు…
తరతరాల చరిత ఇదే…

కూడబెట్టి కూడబెట్టి
కుబేరులై పొయినారు‌..
పద్మవ్యూహ రహస్యాన్ని
పదిలంగా దాచుకుంటు..
తరతరాల చరిత ఇదే..

ఖజానాకు గండిపడి
కాలువులా పారుతుంది..
ఏలిన వారికి ఎపుడు
ఏరువాక సాగుతుంది…
తరతరాల చరిత ఇదే..

వారసత్వ పదవులాయే..
ఆస్తి పాస్తులన్ని మాయే..
కరిమింగిన వెలగపండు.
తీరుగున్న కాలమాయే..
తరతరాల చరిత ఇదే..

వర్షమొచ్చి వెలిసి పాయే
వసంతాలు గడచిపాయే…
పిల్లి లెగని పొయ్యి లాయే..
పితకాటపుబతుకులాయే..
తరతరాలచరిత ఇదే..
@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@
+91 83098 52047
స్వరం

నా హృది మది నిండా నీవేలే
నా ఎదలో కలలో నీవేలే
నాహృదయమే నీ తలపులే
నాలో ఊసులు నీకోసమేలే
నానుండి నీవిక పోలేవులే

చూసినా తనివి తీరనిది
నీరూపం నాలో కొలువైనది
నిను తలవని నేను వ్యర్థం
కల్పించు జీవిత పరమార్ధం
అదే కదా నా జన్మకు అర్ధం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
         సాలూరు, విజయనగరం జిల్లా
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
నూతన ప్రక్రియ.స్వరము
శీర్షిక.భువిన తారలు

ముంగిట్లో దీప కాంతులు
కాంతులిచ్చెను వెలుగులు
వెలుగులు జీవితమున
యామిని తొలగించును
ఈ దీపావళి పర్వదినము

అరటి మామిడి తోరణాలు
బంతిపూలతో దండలు
తల్లి లక్ష్మీ దేవికి పూజలు
వ్యాపారస్థుల కొత్త లెక్కలు
ఈ దీపావళి పర్వదినము

అరణ్య ఆగ్నాతం ముగిసి
రాక్షస సంహారం జర్పి
దుష్టశిక్షణ జర్గిన రోజు
దీపావళి పర్వదినము
ఈ దీపావళి పర్వదినము

పేరు.అనురాధ.సురేష్
9177253505
*******************************
*******************************
ప్రక్రియ: స్వరము
శీర్షిక: వెలుగుల పండుగ

1
అమావాస్య చీకట్లను చీల్చి
దివ్వెలను సైతం వెలిగించి
మగువల కోరికలు తీర్చి
మంచికి అండగాను నిలిచే
సంతోష సంబరాల పండుగ.

2
జీవితంలో కాంతులు చిందిస్తూ
విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తూ
ఆశయాలకు జీవాన్ని పోస్తూ
ఇంటింటా సిరులను పండించే
దీపావళి పండుగ చేద్దాము.

పేరు: చదలవాడ బేబీ రత్నకుమారి, తెనాలి ,గుంటూరు జిల్లా .
చరవాణి: 9 7 0 1 3 0 2 7 7 4
***************************
***************************
ప్రక్రియ.. స్వరము
పేరు.. శనగపల్లి ఉమామహేశ్వరరావు. తెనాలి..
చరవాణి…8676680426
శీర్షిక…
   01.   దీపావళొచ్చె
****************
సత్యభామ నరకుని చంపె
ప్రజా కంఠకుడు మరణించె
ముల్లోకాలు ముదము నొందెను
ఆనంద దీపాలు వెలిగెను
అదియే దీపావళి ఘనత
********
02.
సర్వత్రా హర్షము విరిసెను
టపాసులు పటాకులు పేలే
దిశలంతా వెలుగు నిండెను
హర్షామోదములు వెల్లువెత్తే
అదిగదిగో దీపావళొచ్చె

₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
అంశం: *ఐచ్ఛికం*
పేరు: *మార్గం కృష్ణ మూర్తి*
ఊరు: హైదరాబాద్
చరవాణి: 9441841314
శీర్షిక: రామప్ప వైభవం – యునెస్కో గుర్తింపు

స్వరాలు:

01.
కాకతీయుల కళానైపుణ్యం
నక్షత్రరూపమున నిర్మాణం
అపురూపమైన ఆ సౌందర్యం
సప్తస్వరాలు పలికే శిల్పం
అద్భుతమైనట్టి దేవాలయం

02.
నృత్య శిల్పాలకు కొలువైంది
రామప్ప దేవాలయం నచ్చింది
నిర్మాణం ప్రపంచం గుర్తించింది
యునెస్కోచే గుర్తింపును పొంది
భారత దేశం పులకించింది

03.
యునెష్కోగుర్తింపుకు కారణం
నిర్మాణం ఇసుకలోజర్గడం
నీట తేలే ఇటుక కట్టడం
రాతి  రంగు నేటికి ఉండటం
గుడి గోపురం మన్నికుండడం

04.
యునెష్కో గుర్తింపువలనొచ్చే
దేవాలయానికి నిధి వచ్చే
దేశానికి గొప్ప పేరు వచ్చే
పర్యాటకంగా గుర్తింపు వచ్చే
నా తెలంగాణకు కీర్తి తెచ్చే

05.
స్తంభాలపై నృత్య భంగిమలు
శిల్పాల వైభవ సౌందర్యాలు
గుడిలోన నిత్య వెలుగులు
రుద్రుడి కళా నిదర్శనాలు
విస్తరిస్తుండే దేశ దేశాలు
************************
************************
అంశం:- ఐఛ్ఛికం.
ప్రక్రియ.. స్వరము
శీర్షిక:- దీపావళి

దీపావళి ఇది దీపావళి
అందాల వెలుగు దీపావళి
కొత్తబట్టలు తొడుగుదాము
సేమియాపాయసము తిందాము
సంతోషముగా గడుపుదాము

భూమిమీద భూచక్రం తిరుగు
విష్ణుచక్రం చేతిలో తిరుగు
చిచ్చుబుడ్డి వెలుగు  పంచును
రాకెట్టునింగికేసి దూకును
ధన్ ధన్ తుస్ తుస్ ఢాం ఢాం

మాసం సీమ
జిల్లా.. కరీంనగర్
చరవాణి…9490730181
***********************
***********************
అంశం :- ఐచ్ఛికం
ప్రక్రియ :- ” స్వరము “.
శీర్షిక :- ” దీపావళి ”
కవి పేరు :- మైలవరపు వెంకట లక్ష్మణ రావు
ఊరు :- కాకినాడ.
చర వాణి :- 94413 28073.

1.
దీపావళి దీపాల పండుగ
ఇంటింటా  వెలుగును దీపాలు
ఊరంతా దీపాల తోరణాలు
అందరి మదినిందా ఆనందం
వెల్లివిరియును సంతోషాలు

2. 
ధర్మ రక్షణ దుష్ట శిక్షణ
జరుగును ఏ యుగాననైనా
ఆనాడే సంతసింతురు జనం
చెడు పై మంచి కి విజయం
ఆనాడే అసలైన దీపావళి
*******†*******************
***************************
ప్రక్రియ :- ” స్వరము “.
శీర్షిక :-  ” దీపాల పండుగ  దీపావళి “.

01.
చీకటి వెలుగుల రంగేళీ
జీవితమే ఒక దీపావళి
సర్వేజనా సుఖినోభవంతు
అసలైన దీపాల పండుగ
ఆనాడే దీపావళి పండుగ

02.
అమాస రేయిని పున్నమి చేసే
వెలుగు జిలుగుల పండుగ
దీపాల ఆరావళీ పండుగ
ఆనంద రవళుల పండుగ
సంతోష  సంబరాల పండుగ

కవి పేరు ;-
మైలవరపు వెంకట పద్మావతి
ఊరు :- కాకినాడ.
చర వాణి ,:- 94413 28073.
****************************
****************************
ఆర్.ప్రవీణ్ ; హైదరాబాద్
ప్రక్రియ. స్వరం
శీర్షిక :-  సామాజికం

తరుముదాం ప్లాస్టిక్ భుాతాన్ని 
కల్పించాలి అవగాహన
వాడాలి వస్త్ర, నార సంచులే
కాపాడాలి భూసారాన్ని
పూజిద్దాం ప్రకృతి మాతని

మధ్యమును నిషేదించాలి
ముందుండాలి మహిళలే
మూసివేయాలి మద్యం కొట్లని
నెరవేరాలి గాంధీజీ కల
కావాలి అభివృద్దే నినాదం
*************************
*************************
స్వరం ప్రక్రియ

మదిలోని కమ్మని  భావం
రమ్యమైన భాష జతచేరి
పెదవిపై పలికె కవితై
బ్రతుకున బంగరు భవితై
కవిగా లోకాన  బ్రతుకిచ్చే

మంచిని పెంచేటి భావాలతో
చెడునెదిరించే కవితలు
ప్రబోధం కలిగించే పదాలు
చరిత్రలో కీర్తి తెచ్చిపెట్టు 
ఉన్నతంగా నిన్ను నిలబెట్టు

పంతులవేంకటేశ్వరరావు విజయవాడ
9908344249
##################
##################
*అంశం*:- *ఐచ్ఛికం*
*ప్రక్రియ* :- *స్వరము*
*************************
శీర్షిక: రామప్ప గుడి
కవి పేరు : గుండమీది కృష్ణ మోహన్
జిల్లా :హన్మకొండ
చరవాణి :9949554809
****************
కలల నిలయం రామప్ప
చక్కగ చెక్కిన శిల్పము
సృష్టికి మరొక లోకము
శిల్పము రూపము చూడుము
ఆనందాలను పొందుము

ప్రకృతి ఒడిలో ఒదిగింది
పచ్చని పంటల వెలిగింది
ఎందరో మనసుల దోచింది
ప్రపంచ పటాన నిలిచింది
ప్రగతికి బాటను చూపింది.

కాకతీయుల చరిత్రలో
కట్టిన కట్టడం రామప్ప
రమణీయంగా వెలిసింది
రాజుల పాలన చూపింది
రచనకు బీజము వేసింది
###################
###################
*ప్రక్రియ* :- *స్వరము
శీర్షిక: సత్కవిత
కవి పేరు :పంతులవేంకటేశ్వరరావు విజయవాడ
జిల్లా : కృష్ణా
చరవాణి 9908344249

*స్వరాలు*
మదిలోని కమ్మని  భావం
రమ్యమైన భాష జతచేరి
పెదవిపై పలికె కవితై
బ్రతుకున బంగరు భవితై
కవిగా లోకాన  బ్రతుకిచ్చే

మంచిని పెంచేటి భావాలతో
చెడునెదిరించే కవితలు
ప్రబోధం కలిగించే పదాలు
చరిత్రలో కీర్తి తెచ్చిపెట్టు 
ఉన్నతంగా నిన్ను నిలబెట్టు
####################
############’########
ప్రక్రియ: స్వరం
అంశం: ఐచ్ఛికం
శీర్షిక :  ఆనంద రవళి
పేరు: ఎస్. రత్నలక్ష్మి
జిల్లా: కర్నూలు 
చరవాణి: 8331930635 

ఇంటింటా దీపాల వెలుగులు
వెల్లివిరిసే నవ కాంతులు
అంబరాన్నంటేలా  సంబరాలు
కొంటె మరదళ్ళ తమాషాలు
కొత్త అల్లుళ్లకు  సరదాలు

కార్తీక మాసాన దీపావళి
చీకటి వెలుగుల రంగేళి
బాలలుమెచ్చే ఆనందకేళి 
పాటిస్తే నీతి నియమావళి
జీవితమౌతుంది  శోభావళి
$$$$$$$$$$$$$$$$$$$
$$$$$$$$$$$$$$$$$$$
*అంశం:దీపావళి*
*ప్రక్రియ:స్వరము*
*శీర్షిక:నవ శకం*
*కవిపేరు:వనపర్తి గంగాధర్* జిల్లా:హన్మకొండ
చరవాని:9440146435

*స్వరాలు*

కలిమి లేములు ఒకటయి
సమ సమాజ నిర్మాణమయి
ప్రజలందరు ఆనందమయి
ప్రతి హృదయాన వెలగాలి
నవ్య దీపావళి వెలుగులు  (01)

దుష్టశక్తులను దునుమాడి
సమాజాన శాంతి స్థాపనకు
నడుముకట్టి పాదులు వేద్దాం
నవశకానికి దారి వేసి
విశ్వ దీపాలను వెలిగిద్దాం (02)
౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭
౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭
ప్రక్రియ : స్వరం
శీర్షిక : *చీకటి వెలుగులు*

చీకటి వెలుగులు జిలుగులు
పేలే టపాసులు  తారాజివ్వలు
చిన్నా,    పెద్దల    చిరునవ్వులు
దీపావళి  అచ్చట్లు,   ముచ్చట్లు
బాణా సంచా శబ్ద   భజాoత్రీలు

ఇంటిలో తలంటు స్నానాలు
వీధి, వీధిన  చీకటి వెలుగులు
ప్రమిదలు   దీపాల   కాoతులు
చిచ్చుబుడ్డీలతళుకు బెళుకులు
కర్రలు   బొద్దు  దివిటీ మంటలు

ఇంటిలో పిండి వంటలు
ముక్కు అదిరే ఘమ ఘమలు
చిన్న పిల్లల గాబరా ఆరాటాలు
పెద్దలు   పండగ  చిరు నవ్వులు
నేటి దీపావళి  చీకటి వెలుగులు

రాముద్రి. గోవింద రావు
బొబ్బిలి
కలం పేరు ; ప్రియ
8500865056
౪౪౪౪౪౪౪౪౫౫౫౫౪౪౪౪౪
౪౪౪౪౪౪౪౫౫౪౪౪౫౪౪౪౪
ప్రక్రియ: స్వరము
శీర్షిక: దివ్యజ్యోతులు
పేరు: అక్కి నర్సింలుగౌడ్
జిల్లా: రంగారెడ్డి
చరవాణి: 9912659965

దీపావళి ‌రోజున దివ్యజ్యోతులు
పంచును ఇంటింట ప్రేమకాంతులు
పిండివంటల గుమగుమలు
కొత్త అళ్ళుల్ల‌కు కానుకలు
చిట్టి మరదళ్ళ పకపకలు

పిల్లల టపాకాయల సంబరాలు
పెద్దల ఆప్యాయతల ముచ్చట్లు
సత్యనారాయణ స్వామి వ్రతాలు
అష్టలక్ష్మీ దేవికి చేయగ పూజలు
కలిగించు ఇంటిల్లిపాదికి శుభములు
౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬
౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬౬
ప్రక్రియ: స్వరం
శీర్షిక: ఆనందమయం
పేరు: కట్టెకోల చిన నరసయ్య
జిల్లా: ఖమ్మం
చరవాణి: 7981814784

పండగంటే వారి కేరింతలు
సందడి చేసిన ఆర్భాటాలు
ఇంటికి వచ్చినారు చుట్టాలు
అమ్మ చేసెను పిండి వంటలు
కొత్త బట్టలతో చిన్నారులు

నాన్న తెచ్చినాడు టపాసులు
ఎన్నెన్నో పేల్చినాము బాంబులు
ఆకాశంలోకి తారాజువ్వలు
తెచ్చే దీపావళి ఆనందాలు
ఇంటిముందు దీపాల కాంతులు
******************************
*****************************
అంశం: ఐచ్ఛికం
ప్రక్రియ: స్వరం
శీర్షిక: పాలేరుల్లా…
రచయిత: చింతాడ కృష్ణారావు
చరవాణి: 9010223380, 8008679666
ఊరు: శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం

ఆకసంలో కోట్ల నక్షత్రాలు
ఎక్కడో మిలమిల్లాడుతున్నాయి
భువిలో పేదోళ్ల డొక్కలలా
ఆకాశమంతా విస్తరించినా
చంద్రుడికే విలువెక్కువ

ఆనక వచ్చిన సూరీడికే
వెలుగెక్కువ … విలువెక్కువ
సూర్యచంద్రులకన్నా చుక్కలు
వేలవేలు వెలుగులున్నా సరే
భూస్వామి వెనుక పాలేరుల్లా
##################
##################
అంశం: స్వరము
శీర్షిక : వెలుగుల పండగ

వెలుగుల జిలుగులు నింపే
కమనీయకాంతుల పండగ
దీపాల వరుస వెలిగించి
చీకట్ల ఇక్కట్లు తొలగించు
దివ్యపు దీపావళి పండగ !

నరకుని వేదింపులుతోను
తాళక వధించె సత్యభామ
విజయము సాధించిన దినం
దీపావళి పండగ దినమై
వేడుకతో జరుపు పండగ !

కొత్తబట్టల్లో కోలాహలంగ
భక్తిభావములతో బాగుగా
దీపావళిపండుగ జరుపు
టపాసులను చక్కగాకాల్చి
వేడుకగా జరుపుకొందురు !
**************************
**************************
*అంశం: ఐచ్చికం*
*ప్రక్రియ; స్వరము*
*శీర్షిక:.   నీలోసమతమమతలు జగతికి వెలుగు!*

౧.
సహనముకరుణయు , నించి
సమతయుమమతయుపెంచి
శాంతినీ క్రాంతినీ  వెలిగించి
సాహిత్య,సంపదలను పంచి
అందరినీ కలుపుకొనుము!

౨.
మానవ సేవ మాధవ సేవ
నీతినియమములుతో నుండి
అనుభవంతో జ్ఞానము పెంచి
అభివృద్ధితో సోపానమును
నిర్మించు కోవాలి, ఓ మనిషి!

౩.
సజ్జనసాంగత్యం లో నిలిచి
స్వార్థ చింతన  కొంత విడిచి
వ్యర్థంగా కాలాన్ని   గడుపక
మార్మికతను ,మరువకుమా!
ధార్మికత ను విడువకు మా!

౪.
నిజాయితీ నీ ఆవరణంగా
మంచి ,మమత ,ఆభరణంగా
త్యాగశీలత ,దేశభక్తితో
జాతీయ పతాకమంత గర్వం
నీ సర్వం యయిన  నీవే మేటి!

బి హెచ్.వి.రమాదేవి.
చర వాణి:6305543917.
*రాజమహేంద్రవరం* *తూర్పు గోదావరి జిల్లా.
##########$#$$$$####
#####$$$$$$$$$######
అంశం:-ఐచ్చికం
ప్రక్రియ:-స్వరం
శీర్షిక:-అధర్మo అంతం

బలహీనతలకు రావణుడు
బానిసయిన ఆ కామాంధుడు
తనకెన్నో దివ్యశక్తులున్నా
సీతమ్మని చెరబట్టీ  తాను
అధోగతి పాలే ఆయెనుగా.

పాపాల కొడి గట్టినవాడు
కయ్యానికి కాలు దువ్వువాడు
అధర్మాలు ఆచరించువాడు
సమూలంగా అంతమొందే తీరు
చరిత్ర సాక్ష్యాలెన్నో చదువు.

పోతుల చైతన్య భారతి
  హైదరాబాద్
7013264464
#########$$$$#######
###########$$$######
*అంశం*:- *ఐచ్ఛికం*
*ప్రక్రియ* :- *స్వరము*
*శీర్షిక:*  ఊహల పల్లకి
*కవి పేరు* : మొక్క ఉపేందర్
*జిల్లా :* మేడ్చల్ – మల్కాజిగిరి
*చరవాణి* :9959320221

నా మదిలోని స్వప్న
సుంధరిని ఊహల
పల్లకిలో ఊరేగించాలని
దేదీప్యమానంగా
వెలుగొందిన

ఆ ఊహల
నాఎదలోని ఊహలను
తల్వరవివర్మ
తరమౌనా!…?.
కవి వర్మ తరమౌనా!..?.

మదిలోని మధుర స్వప్నాలు
పురివిప్పిన నెమలి పించాలై
జత కోరిన కోయిల రాగంలా అమృతస్వరమౌతుంది. 
సప్త చైతన్యరథమౌతుంది.
తెలుసుకోవే!! ఓ మనసా!!
**************************
**************************
ఆర్. ప్రవీణ్ , హైదరాబాద్
ప్రక్రియ. స్వరం
శీర్షిక :-. మంచితనంకే పట్టం

మంచితనం ప్రతిభకే  పట్టం
కులం మతం వివక్షత వద్దు
అదే మేలైనది భవితకు
జీవిత సౌఖ్యంకు అది ముద్దు
భావి పౌరులకదే సోపానం

ఇష్టపడుతారు సత్యంను
బోసి నవ్వుల తాత  బాపు
పూవుల్లో రంగులు వేరు వేరు
చేతిలో కర్ర కొల్లాయి రూపు
సత్యమే పరమ అహింస
**********************
*********************
*ప్రక్రియ* :- *స్వరము*
శీర్షిక:మనసురాగం
కవి పేరు :గాంగేయుల రవికుమార్ ,తుని.
జిల్లా :తూర్పుగోదావరి
చరవాణి :8341535070

1)
పరుగులు తీసేనే భావాలు
ఉరకలు వేసేనే ఊహలు
పారేనది చూస్తే పరవశం
వీచే గాలిలో వింటా సంగీతం
పచ్ఛని చేలలో పల్లెగీతం

2)
మసకలో నాదే సంధ్యారాగం
మనసులో నీదే మౌనరాగం
కంచెమీద వేచా చెలి కోసం
చందమామ చల్లే చల్లదనం
చెలి నీ సంగమం వెచ్ఛదనం
**************************
**************************
స్వరం…౧

శీర్షిక:అచ్చమైన భాష
🌷🌷🌷🌷🌷🌷
అందమైనది అజంత భాష
రాయలు మెచ్చిన భాష ఇది
పరాయి భాషా వ్యామోహముతో
ఉచ్చారణలో దోషములతో
అచ్చమైన భాష కరువైంది…!
**************************

స్వరం…౨

శీర్షిక :తల్లిదండ్రులు
🌷🌷🌷🌷🌷
జన్మనిచ్చిన తల్లిదండ్రులు
వారే కదా ప్రత్యక్షదైవాలు
కనుపాపలా కాపాడితిరి
రెక్కలొచ్చినాయని ఎగిరి
కృతజ్ఞతను మరచితివి…!

చంద్రకళ. దీకొండ
మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లా.
చరవాణి : 9381361384
************************
************************
అంశం:స్వరం
1.
కోటికిరణాల వింధ్యాచలం
కోవెల గంటల  కోలాహలం
కోటప్ప గళాన హాలాహలం
కోరినిదిచ్చే కోదండ రామ o
కోయని ధ్వనించే కావ్య గానం
           
2.
నల్ల గోడపైమల్లెల మెట్లు
టీచరద్దిన వెన్నెల బొట్లు
చెప్తుంది తీర్చిదిద్దే ట్లు
సీతాకోక వాలిన  చెట్లు
వినక పోతే వీపుపై అట్లు

రచన:Y శ్రీ దేవి
ఊరు:పాలకొల్లు
9989710800
*******************
*******************

Get real time updates directly on you device, subscribe now.