గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలు

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్ గారి వ్యాసం

గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలు

( నవంబర్. 14 నుండి 21 వరకు గ్రంధాలయాల వారోత్సవాల సందర్భంగా.) తెలంగాణ., ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలోనూ గ్రంధాలయాల వారోత్సవాలను నవంబర్ 14 నుండి 21 వరకు రాష్ట్రప్రభుత్వాలు పెద్దయెత్తున చేయడానికి సన్నాహాలు చేశారు. గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా విద్యార్థులకు., నిరుద్యోగులకు. యువకులకు మహిళలకు వృద్దులకుఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ప్రతి గ్రామంలో గ్రంధాలయాలు ఉండేవి. ఆ గ్రంధాలయాలలో దిన.,వార.,పక్ష,మాస, త్రైమాసిక, అర్దవార్షిక.వార్షిక పత్రికలు నచ్చేవి. పిల్లలకోసం, విద్యార్థుల కోసం చందమామ., బాలరంజని,బాలజ్యోతి చిన్నారి., చతుర, శివరంజని, తెనాలి రామకృష్ణ కధలు., రామాయణం, మహా భారతం., భాగవతం., భగవద్గీత మొదలైన అనేక పుస్తకాలు అందుబాటులో ఉండేవి. ప్రతి పాఠశాలలో గ్రంధాలయాలు తప్పకుండా ఉండేవి. విద్యార్థులకు గ్రంధాలయాల బోధనా కాలంశం (పిరియడ్) ఉండేది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శం వహించేవారు. గ్రందాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా విద్యార్థులకు ఉపయోగపడేవి.

కరోనా వైరస్ వలన గత 20 నెలలుగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పనిచేయక పోవడం, ప్రత్యక్ష తరగతులు నిర్వహించకుండా పరోక్ష తరగతులు నిర్వహించడం వలన ఆఫ్ లైన్ కంటే ఆన్ లైన్ తరగతుల
వలన విద్యార్థులు సెల్ ఫోన్
అంకితం అయ్యారు. బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చింది. గ్రంధాలయాల వారోత్సవాల సందర్భంగా గతులో వారం., పది రోజుల నుండి పండుగ వాతావరణం ఉండేది.విద్యర్థులకు వ్యాస రచన., వక్తృత్వ., రంగోలి మొదలైన పోటీలను నిర్వహించి
ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేసేవారు. విద్యార్థులకు ప్రోత్సాహం గా ఉండేది. పుస్తకాలపై విద్యార్థులకు జిజ్ఞాస పెంపౌందేది.
మూత బడిన గ్రంధాలయాలు:-
తెలంగాణ., ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలోను అనేక ప్రాంతాలలో గ్రంధాలయాలు మూతపడ్డాయి. చాలామంది గ్రంధాలయాలకు వెళ్ళక పోవడం వలన పాఠకుల సంఖ్య తగ్గడం., గ్రంధాలయాల అధికారులు లేక పోవడం వలన అనేక గ్రంధాలయాలు మూతపడ్డాయి.
సెల్ ఫోన్ లతో కాలక్షేపం:_సెల్ ఫోన్ లతో అనేక మంది కాలక్షేపం చేస్తున్నారు.విద్యార్థులు., నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం పుస్తకాలపై ఆధారపడకుండా . సెల్ ఫోన్, గూగుల్ పెస్ బుక్ ట్విట్టర్ లపై, సాంకేతిక పరిజ్ఞానం పై ఆధారపడుతున్నారు.పుస్తకం హస్తభూషణం అనేవారు. కాని ఇప్పుడు సెల్ ఫోనే ప్రపంచంగా కాలం గడుపుతున్నారు. అనేక పత్రికలు ఆఫ్ లైన్ పత్రికలు గా కాకుండా ఆన్ లైన్ పత్రికలు గా వస్తున్నాయి.
పుస్తక పఠనం పై అవగాహన కల్పించాలి:-
పుస్తకాల పఠనం వలన విజ్ఞానం పెంపొందుతుంది. సెల్ ఫోన్ లతో., గూగుల్ లో సర్చ్ చేయడం వలన చదివినప్పుడు జ్ణాపకం ఉండి తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. పుస్తక పఠనం వలన విజ్ఞానం పెంపొందు తుంది. చదివినది ఎప్పుడు జ్ణాపకం ఉంటుంది. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడానికి., నీతి నిజాయితీ గా ఉండడానికి తోడ్పడుతుంది. సంస్కృతి., సంప్రదాయాలు., భాష., సాహిత్య సామాజిక, చరిత్రలోని అనేక విషయాలు తెలుసుకోవడానికి పుస్తకాలు తోడ్పడు తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు గ్రంధాలయాల వారోత్సవాల సందర్భంగా పుస్తకాల ప్రాధాన్యతపై అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయాలి.

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్.,
సైదాబాద్, హైదరాబాద్,
9290826988

Get real time updates directly on you device, subscribe now.