భార‌త్‌లో క‌రోనా కొత్త రూపంలో వచ్చింది

భార‌త్‌లో క‌రోనా కొత్త వేరియంట్‌పై హైఅల‌ర్ట్

భార‌త్‌లో క‌రోనా కొత్త వేరియంట్‌పై హైఅల‌ర్ట్

కరోనా పై మరో పోరుకు కేంద్ర,రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి అని అప్ర‌మ‌త్తం చేసిన కేంద్రం.*ఒమిక్రాన్ విరుచుకు పడుతున్న వేళ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సంబంధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరించింది. ఆయా దేశాల నుంచి భారత్‌లోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కఠినమైన స్క్రీనింగ్‌, టెస్టులు నిర్వహించాలని ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ఇప్పటికే కొత్త వైరస్‌ కేసులు దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంగ్‌కాంగ్‌లోనూ పలుకేసులు నమోదయ్యాయి. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, కాంటాక్టులను తప్పనిసరిగా ట్రాక్‌ చేయడంతో పరీక్షలు చేయాలని ఆదేశించింది.

ఇదిలా ఉండగా B.1.1.529 వేరియంట్‌ లక్షణాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

కొత్త వేరియంట్‌ గుర్తించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం, శనివారాలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
కరోనా కొత్త వేరియంట్‌ కలకలం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీగారు కూడా సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) డా. వీకే పాల్ హాజరైనారు.

*దక్షిణాఫ్రికాలో వైరస్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో*
అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షడంతో పాటు దేశంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకనేందుకు తగిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

*కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమైందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
*ఇదీలావుండగా !*
భువనేశ్వర్‌: ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఒకే పాఠశాలకు చెందిన 26 మంది విద్యార్థినులకు కరోనా సోకింది.
కావున ప్రజలందరూ ప్రస్తుత పరిస్థితులను గమనించుచూ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటారని ఆశిస్తున్నాను.

—- ప్రతాపగిరి శ్రీనివాసు, హనుమకొండ,7993103924

Get real time updates directly on you device, subscribe now.