దేశభక్తుడి అక్షర నివాళి…!!

దేశభక్తుడి అక్షర నివాళి...!!

దేశభక్తుడి అక్షర నివాళి…!!

తండ్రి బాటలో నడిచిన తనయుడు
సైన్యంలో చేరి
త్రివిధ దళాలకు సేవలందించిన ఘనుడు
నిజమైన దేశభక్తుడు
జీవితాన్ని భరతమాత సేవకే
అంకితము చేసి ధన్యజీవి
నిరంతర సైన్య పోరాటాలతో అలసి
మాతృమూర్తి రుణం తీర్చుకొని
గగనాన్ని ఎగిసి స్వర్గాన్ని చేరెను
వివిధ పదవులు అలంకరించి
సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి
విదేశీయులకు వణుకు పుట్టించే
స్వదేశీయులకు గుండె ధైర్యం నింపినా సాహసి
భరతమాత నుదుటి రక్త తిలకం
పరదేశి యులకు అతనొక పాశుపతాస్త్రం
ఆలోచనలన్నీ దేశ సేవ కోసం
ఆత్మీయత అంతా సైనికుల కోసమే
ఆధునాతన యుద్ధ నిర్మాణకర్త
శత్రు దుర్భేద్యను పేల్చిన అణుబాంబు
కీర్తి పురస్కారాలు ఎన్నో వచ్చినా
అవి అలంకార ప్రాయమైన నిలిచే
అహర్నిశలు అంకితభావం
ఆఖరి శ్వాస కూడా దేశము కోసమే సమర్పించే..

ఆ మహనీయుడు లేని లోటు తీర్చలేము
భరతమాత కన్నీరును ఆపలేము
అలాంటి వ్యక్తిని మరలా ఊహించుకోలేము
ఆ దేశ భక్తుడికి కన్నీటి అక్షర నివాళి.. సమర్పిస్తూ..
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను…

కొప్పుల ప్రసాద్
నంద్యాల

Get real time updates directly on you device, subscribe now.