శీర్షిక: *తెలంగాణ ఖ్యాతి*
G-Mail: pmgiri085@gmail.com
తరతరాల చరిత గల్గి
బానిస సంకెళ్ళలో మ్రగ్గి
భాషయాస ఈసడింపుల్లో
భరింపరాని అన్యాయంలో
బ్రతికింది తెలంగాణము
ప్రాంతీయభాషా మధుర్యాలతో
ప్రకృష్ట పదబంధాలతో
వినసొంపైన సామెతలతో
మేలిమి జాతీయాలతో
కలగలిసె తెలంగాణము
నైజాముల సాహితీసేవ
నైతికవిలువల కావ్యాలు
మదినిలేపే జానపదాలు
ఎదన మురిసే కళల
ఘనతలము తెలంగాణము
రజాకార్ల అరాచకాలకు
రౌడీమూకల అల్లర్లకు
మోసాల రచనలకు
నిర్భీతితో ఎదురు తిరిగి
ఎదుర్కుంది తెలంగాణము
గోదారి చల్లని చూపులతో
కృష్ణమ్మ వరాల జలాలతో
పసిడి పంటలు పండించగా
పాడిబలం వృద్ధి చెందగా
పరవశించె తెలంగాణము
తనువు గర్భాన పెక్కు
తలతలల ఖనిజాలను
సిగలోన వెలుగులిచ్చే
సింగరేణి బంగారాన్ని నిల్పి
మురిసెను తెలంగాణము
ప్రపంచ మేటి గోల్కొండ కోట
తలయెత్తిన చార్మినార్
వార్ధిరూప హూస్సేన్సాగర్
చదువులతల్లి ఓయూలతో
మెరిసెను తెలంగాణము
గోండు వీరుడు భీం
వీరనారీ ఐలమ్మలాంటి
యోధుల కడుపారకన్న
పోరాటాల పురిటిగడ్డ
పుణ్యస్థలి తెలంగాణము
సకల సంస్కృతులతో
సబ్బండవర్ణాలతో
భేదాభిప్రాయాలు లేక
కష్టసుఖాలు పంచుకుంటూ
కల్సియుండె తెలంగాణము
అలుపెరగని త్యాగాలతో
అనంతమైన ఓర్పుతో
చివరికి విజయాన్ని పొంది
స్వేచ్ఛగాలులను పీలుస్తూ
నిలిచింది తెలంగాణము
———————
కవిపేరు: పారుపల్లి మత్స్యగిరి
ఇంటి నె: 4-9
గ్రామం : మునగాల తుర్కపల్లి
మం : వలిగొండ
జిల్లా : యాదాద్రి భువనగిరి
తెలంగాణ -508112
ఫోన్: 9000137644