అమ్మ ప్రేమ

Dr. అవులూరి ప్రశాంత్

సాకి:
అనురాగానికి అర్థం అమ్మ
ఆప్యాయతకు అర్థం అమ్మ
లాలించేది అమ్మ లాల పోసేది అమ్మ
మరి అమ్మ ప్రేమ …..

అ.ప:
అమ్మ అమ్మ .. నువ్వే నా దైవం అమ్మ
నా గుండె నిండా నువ్వే నిండావమ్మ ( 2 )

పల్లవి :
నడిచే దేవత నీవమ్మ
పిలిచే పిలుపే నీవమ్మ
మాటకు అర్థం నీవమ్మ
పాటకు ప్రాణం నీవమ్మ ( 2 )

// అమ్మ .. అమ్మ //

చ-1:
నవ మాసాలు మోసిన అమ్మ
నా ప్రాణం నీవమ్మ
నాకు లాలపోసావమ్మ
నాకు నడక నేర్పావమ్మ ( 2 )

// నడిచే //

చ-2:
మాటలు నేర్పావు నాకు
గోరు ముద్దలు తినిపించావు
అన్ని వేళలా నాకు అండగా నిలిచావు
భాషలు నేర్పావు భాషకు భావం చెప్పావు
తియ్యనైన మాటలు చెప్పి
నాకు దూరం అయ్యావు ( 2 )

// నడిచే //
Dr. అవులూరి ప్రశాంత్
జంగారెడ్డి గూడెం , ఏలూరు

Get real time updates directly on you device, subscribe now.