పరువాలు విరబూసే — జానపద గేయం

రచన..బి.రాము, భైంసా 9553131274

పరువాలు విరబూసే జానపదం

రచన..బి.రాము

చిగురాకు చిగురించే
పరువాలు విరబూసే
పాలమ్మే పడుచు దాన్నిరా
ఓ చందురయ్యా
ఇగనన్నా చూడవేమీరా

కళ్ళ కిందా కాటుకెట్టి
నుదుటికి సింగారమెట్టి
అదిరేటి అధరాలను
నీ కోసం దాచిపెట్టి
ప్రాయమంతా ఎదురు చూసెనయా
ఓ చందురయ్యా చూడనన్నా చూడవేమయ్యా ఓ చందురయ్యా

||చిగురాకు ||

నాభి కిందా చీరకట్టి
నడుముకు బడ్డానమెట్టి
ఒంపుసొంపుల పరువాలు
నీ కోసం దాచిపెట్టి
వలపంతా వగచేనయ్య
ఓ చందూరయ్య
వచ్చి నన్ను చూడవేమయ్యా

|| చిగురాకు||

9553131274

Get real time updates directly on you device, subscribe now.